Maruti Brezza Price, Down Payment, Loan and EMI Details: మెరుగైన మైలేజ్‌ ఇవ్వడంలో మారుతి కార్లకు మరే బ్రాండ్‌ పోటీ రాదు, ఇవి కామన్‌ మ్యాన్‌ ఇష్టపడే కార్లు. మారుతి ఫ్యాక్టరీ నుంచి వచ్చిన బ్రెజ్జా ఒక కాంపాక్ట్ SUV, దీని ధర రూ. 10 లక్షల స్థాయిలో ఉంటుంది. బ్రెజ్జా కారు పెట్రోల్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. మారుతి బ్రెజ్జా కూడా తక్కువ ధరకు ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు అని గట్టిగా చెప్పవచ్చు.              

Continues below advertisement


మారుతి బ్రెజ్జా (Maruti Brezza ex-showroom price) ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి మారుతుంది. టాప్‌-ఎండ్‌ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ రేటు రూ. 14.14 లక్షల వరకు ఉంటుంది.         


తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర
మారుతి బ్రెజ్జా Lxi (పెట్రోల్) మాన్యువల్‌ వేరియంట్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 10 లక్షల 31 వేలు. విజయవాడ సహా, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ నగరాల్లో స్వల్ప తేడాలతో దాదాపు ఇదే రేటు ఉంటుంది.            


కార్‌ లోన్‌ ఎంత వస్తుంది?
మీరు, మారుతి బ్రెజ్జా కారును కొనడానికి ఒకేసారి పూర్తి చెల్లింపు చేయలేకపోతే, బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌ తీసుకుని కూడా ఈ కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయవచ్చు. లోన్‌ తీసుకోవడానికి ముందు డౌన్‌ పేమెంట్‌ చేయడానికి మీ దగ్గర కొంత మొత్తం (డౌన్‌ పేమెంట్‌) ఉండాలి. ఉదాహరణకు, మారుతి బ్రెజ్జా కొనడానికి మీరు 1 లక్ష 31 వేల రూపాయలను డౌన్‌ పేమెంట్‌ చేశారనుకుందాం. మిగిలిన 9 లక్షల రూపాయలను కార్‌ లోన్‌గా బ్యాంకు ఇస్తుంది. ఈ రుణంపై 9% వడ్డీని వసూలు చేస్తుందని భావిద్దాం. ఇప్పుడు, మీ ఆర్ధిక పరిస్థితిని బట్టి మీకు అనుకూలమైన ఫైనాన్స్‌ ప్లాన్‌ ‍‌(EMI ఆప్షన్‌) ఎంచుకోవాలి.             


ఫైనాన్స్‌ ప్లాన్‌/ EMI ఆప్షన్‌ 


7 సంవత్సరాల రుణ కాలపరిమితిని మీరు ఎంచుకుంటే, ప్రతినెలా రూ. 14,480 EMI చెల్లించాలి       


6 సంవత్సరాల లోన్‌ టెన్యూర్ పెట్టుకుంటే, ప్రతినెలా రూ. 16,223 EMI చెల్లించాలి      


5 సంవత్సరాల్లో లోన్‌ మొత్తం తీర్చేయాలనుకుంటే, ప్రతినెలా రూ. 18,683 EMI చెల్లించాలి          


4 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, ప్రతినెలా రూ. 22,397 EMI చెల్లించాలి         


మారుతి బ్రెజ్జా కొనాలంటే ఎంత జీతం ఉండాలి? 
మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్‌ను కార్‌ లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే, మీ జీతం రూ. 50-60 వేల మధ్య ఉండాలి. రుణం మొత్తం, కార్‌ లోన్‌పై వడ్డీ రేటు వంటివి మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి.