Hyundai Creta Down Payment and EMI:హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ కొనడానికి డౌన్‌పేమెంట్‌ ఎంత? EMI లెక్క ఏంటీ?

Hyundai Creta Down Payment and EMI:హ్యూందాయ్‌ క్రెటా కొనుగోలుకు 50,000 రూపాయలు డౌన్‌పేమెంట్‌తో 10% వడ్డీతో 5 ఏళ్లకు లోన్‌పై కొంటే నెలకు 28,377 రూపాయల EMI చెల్లించాలి.

Continues below advertisement

Hyundai Creta Down Payment and EMI:  హ్యుందాయ్ క్రెటాకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన SUV. దీని బట్టి మార్కెట్‌లో దీనికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికి ఉన్న ఫీచర్స్‌తోపాటు ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కారు కావడంతో ప్రజలకు దీని వెనకాల పడుతున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹13.92 లక్షల నుంచి ₹20.42 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్,, డీజిల్ రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

Continues below advertisement

హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ధర ఎంత?

హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర ₹13.92 లక్షలు. ఈ కారును కార్ లోన్ మీద కూడా కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ క్రెటా కొనుగోలు చేయడానికి మీరు బ్యాంకు నుంచి13,91,761 లోన్ పొందవచ్చు. లోన్ మొత్తం క్రెడిట్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు తక్కువ ఉంటే కచ్చితంగా వడ్డీ రేటు పెరుగుతుంది. ఇచ్చే లోన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. అదే క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తగ్గే ఛాన్స్ ఉంది.. కావాల్సినంత అమౌంట్‌ లోన్‌గా తీసుకోవచ్చు. 

ప్రతి నెల ఎంత EMI చెల్లించాలి?

మీరు హ్యుందాయ్ క్రెటా  కొనుగోలు చేయడానికి ₹50,000 డౌన్ పేమెంట్ చేస్తే, 10 శాతం వడ్డీతో ఐదు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే. మీరు ప్రతి నెల మొత్తం ₹28,508 EMI చెల్లించాలి. 

అదనంగా, హ్యుందాయ్ క్రెటా  కొనుగోలు చేయడానికి 6 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, 10 శాతం వడ్డీతో ప్రతి నెల 24,857 EMI చెల్లించాలి. హ్యుందాయ్  కారు కొనుగోలు చేయడానికి 7 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, 10 శాతం వడ్డీతో ప్రతి నెల 22275  కిస్తీ చెల్లించాలి.

అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా 

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాను జనం బాగా ఇష్టపడతారు. వాస్తవానికి, హ్యుందాయ్ క్రెటా  ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఈ కారు మార్చి 2025 నాటికి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా  మార్చి నెలలో 18,005 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నుంచి మార్చి 2025 వరకు క్రెటా మొత్తం అమ్మకాలు 52,898 యూనిట్లు, ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV.

బడ్జెట్‌పరంగా ఇది బేసిక్ మోడలే అయినా ఫీచర్స్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. ప్రీమియం వెహికల్స్‌కు ఏమాత్రం తీసిపోదు. బేసిక్ మోడల్ హ్యూందాయ్‌ సిగ్నేచర్‌ గ్లోబల్‌ ఎస్‌యూవీ స్టైలింగ్‌ను అనుసరిస్తుంది. ఫ్రంట్‌ గ్రిల్‌ సిల్వర్ ఫినిష్‌తో వస్తుంది. డ్యూయల్‌ టోన్ బంపర్‌, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి. 16 ఇంచ్‌ స్టీల్‌ వీల్స్ స్టాండర్స్‌గా లభిస్తాయి. బాడీ- కలర్డ్ డోర్ హ్యాండిల్‌, ఓఆర్‌వీఎంలు వస్తున్నాయి. 

ఇటీరియర్‌ డిజైన్ చూస్తే... డ్యూయల్‌ టోన్ బ్లాక్‌ అండ్ గ్రే ఇంటీరియర్‌ థీమ్‌తో వస్తుంది. ఫ్రాబ్రిక్ సీట్లు, మాన్యువల్ అడ్జెస్ట్‌ చేయగల డ్రైవింగ్ సీటు ఉంది. మమాన్యువల్‌ ఎయిర్ కండిషనర్స్‌ అందుబాటులో ఉన్నాయి. పవర్‌ విండోస్‌ టిల్ట్‌- అడ్జస్టబుల్‌ స్టీరింగ్ వీల్ కలిగి ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన మల్టీ ఇన్ఫర్మే,న్ డిస్ల్‌ప్లే వస్తుంది. 

సేఫ్టీ ఫీచర్ల చూస్తే... డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాక్స్‌ అందుబాటులో ఉంటాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌, ఎలక్ట్రానికి బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ సెన్సార్స్‌, సీటు బెల్ట్ రిమైండర్, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది .15 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 115bhp, 144 Nm టార్క్‌ను కలిగి ఉంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola