Cheapest Car In India Vayve Mobility Eva EMIs:  భారతదేశంలో అత్యంత చౌకైన కారు Eva. గతంలో, మార్కెట్లో అత్యంత చౌకైన కారు మారుతి ఆల్టో K10. కానీ Eva లాంచ్‌తో, ఇది దేశంలోనే అత్యంత చౌకైన కారుగా మారింది. ఇది ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.25 లక్షల నుంచి ప్రారంభమై రూ. 4.49 లక్షల వరకు ఉంటుంది. Eva బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 3,42,812, మిడ్-వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 4.19 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ. 4.71 లక్షలు.

Eva- దేశంలోనే అత్యంత చౌకైన కారు శ్రేణిEva మూడు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. ఈ కారు బేస్ మోడల్ 9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 125 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు మిడ్ వేరియంట్ 12.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది 175 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ కారు టాప్-ఎండ్ మోడల్ 18 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే  250 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. 

Evaలోని వేరియంట్స్ ఇవే

ఈ కారు మొత్తం మూడు వేరియెంట్స్‌లో లభిస్తుంది. మొదటిది నోవా, స్టెల్లా, వేగా అనే మూడు వేరియెంట్స్‌లో లభిస్తుంది. నోవా ఆన్‌రోడ్ ప్రైస్‌ 3.43 లక్షలు ఉంటుంది. స్టెల్లా ఆన్‌రోడ్ ప్రైస్‌ 4.19 లక్షలకు వస్తుంది. వేగా వెరియెంట్‌ 4.71 లక్షలకు లభించనుంది. వేరియెంట్స్‌ను బట్టి మీకు వచ్చే లోన్, ఈఎంఐ మారిపోతూ ఉంటుంది. 

EMIపై Evaను ఎలా కొనుగోలు చేయాలి?Eva బేస్ మోడల్ నోవా ఆన్-రోడ్ ధర రూ. 3.43 లక్షలు ఉంటుంది. ఈ కారును కొనడానికి మీకు రూ. 3 లక్షల బ్యాంకు లోన్ ఇస్తుంది. Evaను కొనడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 34 వేలు డిపాజిట్ చేయాలి.

  • మీరు Eva నోవాను కొనడానికి నాలుగు సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈ రుణంపై 10 శాతం వడ్డీని వసూలు చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 7,832 EMIగా డిపాజిట్ చేయాలి.
  • మీరు ఈ కారును కొనడానికి ఐదు సంవత్సరాల కోసం  రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 6,561 EMIని 10 శాతం వడ్డీ రేటుతో చెల్లించాలి.
  • Evaను కొనడానికి ఆరు సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, రూ. 5,721 EMIని నెల నెల చెల్లించాల్సి ఉంటుంది.
  • ఏడు సంవత్సరాల కోసం కార్ లోను తీసుకుంటే అత్యంత చౌకైన ఈ కారును పొందడానికి, మీరు నెలకు రూ. 5,127 ఈఎంఐ డిపాజిట్ చేయాలి.

EMIపై Evaలోని రెండో వేరియెంట్‌ ఎలా కొనుగోలు చేయాలి?

Eva రెండో మోడల్ స్టెల్లా ఆన్-రోడ్ ధర రూ. 4.19 లక్షలు ఉంటుంది. ఈ కారును కొనడానికి మీకు రూ. 3,77,333 బ్యాంకు లోన్ ఇస్తుంది. Evaను కొనడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 42 వేలు డౌన్‌పేమెంట్‌  చేయాలి.

  • మీరు Evaలోని స్టెల్లా మోడల్ కొనడానికి నాలుగు సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈ రుణంపై 10 శాతం వడ్డీని వసూలు చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 9,570EMIగా డిపాజిట్ చేయాలి.
  • మీరు ఈ కారును కొనడానికి ఐదు సంవత్సరాల కోసం  రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 8,017 EMIని 10 శాతం వడ్డీ రేటుతో చెల్లించాలి.
  • Evaను కొనడానికి ఆరు సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, రూ. 6,990 EMIని నెల నెల చెల్లించాల్సి ఉంటుంది.
  • ఏడు సంవత్సరాల కోసం కార్ లోను తీసుకుంటే అత్యంత చౌకైన ఈ కారును పొందడానికి, మీరు నెలకు రూ. 6,264 ఈఎంఐ డిపాజిట్ చేయాలి.

EMIపై Evaలోని మూడో వేరియెంట్‌ ఎలా కొనుగోలు చేయాలి?

Eva రెండో మోడల్ వేగా ఆన్-రోడ్ ధర రూ. 4.19 లక్షలు ఉంటుంది. ఈ కారును కొనడానికి మీకు రూ. 4,71,036బ్యాంకు లోన్ ఇస్తుంది. Evaను కొనడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. 47 వేలు డౌన్‌పేమెంట్‌  చేయాలి.

  • మీరు Evaలోని వేగా మోడల్ కొనడానికి నాలుగు సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈ రుణంపై 10 శాతం వడ్డీని వసూలు చేస్తే, మీరు ప్రతి నెలా రూ. 10,714  EMIగా డిపాజిట్ చేయాలి.
  • మీరు ఈ వేగా కారును కొనడానికి ఐదు సంవత్సరాల కోసం  రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 8,968 EMIని 10 శాతం వడ్డీ రేటుతో చెల్లించాలి.
  • Eva వేగాను కొనడానికి ఆరు సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, రూ. 7,813 EMIని నెల నెల చెల్లించాల్సి ఉంటుంది.
  • ఏడు సంవత్సరాల కోసం కార్ లోను తీసుకుంటే అత్యంత చౌకైన ఈ వేగా కారును పొందడానికి, మీరు నెలకు రూ. 6,996  ఈఎంఐ డిపాజిట్ చేయాలి.