Maruti Dzire EMI Calculator: మారుతి డిజైర్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కార్. ఇది మంచి మైలేజ్ ఇవ్వడంతోపాటు సేఫ్టీని కూడా అందిస్తుంది. ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర 6.84 లక్షల రూపాయల నుంచి 10.19 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మారుతికి చెందిన ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారును కొనుగోలు చేయడానికి మీ వద్ద దాదాపు 50 వేల రూపాయలు ఉండటం అవసరం,  

Maruti Dzire ఆన్-రోడ్ ధరమారుతి డిజైర్ బేస్ మోడల్ LXi ఆన్-రోడ్ ధర 7.65 లక్షల రూపాయలు. ఈ కారును మీరు ఒకేసారి పూర్తి నగదును  చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మీ వద్ద అంత డబ్బులు లేవంటే లోన్‌కు వెళ్లవచ్చు. నెలకు ఎంతోకొంత ఈఎంఐ చెల్లించి కూడా కారు కొనుగోలు చేయవచ్చు.   

మారుతి డిజైర్ కొనుగోలు చేయడానికి ముందుగా మీరు 50 వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే మీకు 7,14,659 రూపాయల లోన్ లభిస్తుంది. మీ సిబిల్ స్కోరు ఆధారంగా వడ్డీ, లోన్ రావడం ఆధారపడి ఉంటుంది. బ్యాంకు ఈ లోన్‌పై ఒక నిర్దిష్ట వడ్డీని వసూలు చేస్తుంది. దాని ప్రకారం మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని EMI రూపంలో చెల్లించాలి.

మారుతి డిజైర్ కొనుగోలు చేయడానికి మీరు మూడు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే మరియు బ్యాంకు ఈ లోన్‌పై 9 శాతం వడ్డీని వసూలు చేస్తే, ప్రతి నెలా 21,750 రూపాయల EMIని బ్యాంకులో జమ చేయాలి.

మారుతి కారును కొనుగోలు చేయడానికి మీరు 7,14,659 డబ్బులను నాలుగు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో వసూలు చేస్తే నెలకు 17,784 రూపాయల EMIని ప్రతి నెలా బ్యాంకుకు చెల్లించాలి.  

మారుతి డిజైర్ కోసం 7,14,659 డబ్బులను ఐదు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే 14,835 రూపాయల EMIని ప్రతి నెలా చెల్లించలి. 

మీరు ఆరు సంవత్సరాల లోన్‌పై డిజైర్ కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో 12,882 రూపాయల EMIని చెల్లించాలి.

మీరు ఏడు సంవత్సరాల లోన్‌పై డిజైర్ కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో 11,498 రూపాయల EMIని చెల్లించాలి.

మీరు ఏడాది నుంచి ఏడేళ్ల వరకు ఎన్ని ఏళ్లకైనా లోన్ తీసుకోవచ్చు. మీరు ఏడాది లోన్‌పై డిజైర్ కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో  62,498 రూపాయల EMIని చెల్లించాలి.

మీరు రెండేళ్ల లోన్‌పై డిజైర్ కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో 32,649 రూపాయల EMIని చెల్లించాలి.

మీరు మూడేళ్ల లోన్‌పై డిజైర్ కొనుగోలు చేస్తే, 9 శాతం వడ్డీతో 22,726 రూపాయల EMIని చెల్లించాలి.

మారుతి డిజైర్ కొనుగోలు చేయడానికి మీరు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా, లోన్ తీసుకునేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. బ్యాంకులకు వేర్వేరు విధానాలు ఉండటం వల్ల ఈ నెంబర్‌లో తేడా కనిపించవచ్చు.

మారుతి డిజైర్‌లో మొత్తం 9 వేరియెంట్స్ ఉన్నాయి. ఐదు స్పీడ్ మాన్యువల్‌, లేదా అటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో అందుబాటులో ఉంది. సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది.