Bajaj Platina 100 EMI: మీరు రోజువారీ ప్రయాణాల కోసం చవకైన, మంచి మైలేజీనిచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే, Bajaj Platina బైక్ మీకు మంచి ఎంపిక కావచ్చు. మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఒకేసారి మొత్తం చెల్లింపు చేయకుండా ఫైనాన్స్ కూడా పొందవచ్చు. Bajaj Platina బైక్ మీకు ఎంత EMIకి లభిస్తుందో తెలుసుకుందాం. 

హదరాబాద్‌ Bajaj Platina 100 బైక్ ఆన్-రోడ్ ధర దాదాపు  87,802 రూపాయలు. ఇందులో ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO ఫీజు  బీమా మొత్తం కూడా ఉన్నాయి. మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి 4,390 రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే, మీరు బ్యాంకు నుంచి 83,411 రూపాయల బైక్ లోన్ తీసుకోవాలి. ఈ లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. 

ఎంత EMIకి బైక్ లభిస్తుంది? 

మీ సిబిల్ స్కోర్ బాగుంటే, మీకు 9 శాతం వడ్డీ రేటుతో బైక్ లోన్ లభిస్తుంది. లేకుంటే వడ్డీ రేటు పెరుగుతుంది. 9 శాతం వడ్డీకి మీకు 3 సంవత్సరాల పాటు లోన్ వస్తే, మీరు నెలకు దాదాపు 2,943 రూపాయల EMI చెల్లించాలి. ఈ మొత్తం కాల వ్యవధిలో మీరు దాదాపు 22,536 రూపాయలు వడ్డీగా చెల్లించాలి. అదే నాలుగేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 2,363 రూపాయలు చెల్లించాలి. ఈ నాలుగేళ్లలో మీరు 30,012 రూపాయలు వడ్డీ చెల్లించాలి. ఒక ఏడాది నుంచి మీరు ఏడేళ్ల టెన్యూర్ వరకు లోన్‌ తీసుకోవచ్చు.  

బజాజ్‌ ప్లాటినా పవర్‌ట్రెయిన్

బజాజ్‌ ప్లాటినా 100లో కంపెనీ 102 cc ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ 7.9 PS మ్యాక్స్‌ పవర్‌తోపాటు 8.3 Nm మ్యాక్స్‌  టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. ఈ బైక్ ARAI క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్లు. 

ఈ బైక్‌లో DRL, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఈ బైక్ Honda Shine, TVS Sport, Hero Splendor Plus వంటి బైక్‌లకు నేరుగా పోటీనిస్తుంది. ఇది దేశంలోని అత్యుత్తమ మైలేజ్ బైక్‌లలో ఒకటి.