2025 జూలై 30th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 30th 2025

మేష రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పని చేయడానికి కొత్త మార్గాలను పరిశీలిస్తారు, ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారం , కుటుంబంలో  సమతుల్యత ఉంటుంది. మీరు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. చాలా రోజులుగా ఆగిపోయిన పని పూర్తవుతుంది 

వృషభ రాశి

ఈ రోజంతా కొత్త ఉత్సాహంతో ఉంటారు. కార్యాలయంలోని సహోద్యోగి సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సలహా లభిస్తుంది. ఓ శుభకార్యానికి హాజరవుతారు. ఈ రాశి విద్యార్థులు చదువును మెరుగుపర్చుకునేందుకు దినచర్యలో కొన్ని కొత్త మార్పులు చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది

మిథున రాశి

ఈ రోజు మీకు ఉత్తమంగా ఉంటుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ సహనాన్ని కొనసాగిస్తారు. మీ పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. మీ స్నేహపూర్వక ప్రవర్తన అందర్నీ ప్రియమైనవారిగా మారస్తుంది. మీ ప్రత్యర్థులు మీ గురించి పుకార్లు వ్యాప్తి చేసే పనిలో ఉంటారు.  వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే నిపుణులను సంప్రదించాలి. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. కర్కాటక రాశి

ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. కొన్ని ప్రశంసనీయమైన పనలు చేస్తారు.  కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి...అవన్నీ పూర్తిచేసేందుకు సహోద్యోగి సహాయం పొందుతారు. సంతానం నుంచి మీకు ఆనందం లభిస్తుంది. తండ్రి ఆశీర్వాదం మీపై ఉంటుంది. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. కష్టమైన పరిస్థితుల్లోనూ ముందుకుసాగుతారు. సింహ రాశి

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో పనిపై అకస్మాత్తుగా ప్రయాణించవలసి రావచ్చు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. చేపట్టిన పనిలో సహచరుల సహకారం లభిస్తుంది.. దీనివల్ల పని సకాలంలో పూర్తవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది, సాయంత్రం మీరు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో లాభం వస్తుంది...తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు

కన్యా రాశి

ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉండబోతోంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. చేపట్టిన పనిలో స్నేహితుల సహకారం మీకుంటుంది. కొత్త పనిని ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశికి చెందిన వ్యాపారులు రోజంతా బిజీగా ఉంటారు.

తులా రాశి

రోజంతా ఆనందంగా ఉంటారు. మీ భావాలతో పాటూ ఇతరుల ఆలోచన పరిగణలోకితీసుకుంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి శుభఫలితాలున్నాయి. ఏదైనా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆచరణాత్మక స్వభావం మెచ్చుకోలుగా ఉంటుంది.  సంగీత రంగంలో ఆసక్తి ఉన్నవారికి  సినీ పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. కుటుంబానికి సమయం కేటాయించడం మంచిది. వృత్తిపరమైన పని విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. మెడికల్ స్టోర్స్ రన్ చేస్తున్నవారికి ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభం ఉంటుంది. మీ ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి

ఈ రోజు మీరు చేసే పనిపై శ్రద్ధవహించండి. అనవసరమైన కార్యకలాపాలలో ఆసక్తి చూపవద్దు. ఏదైనా అనుచితమైన పని మీకు సమస్యలకు కారణం కావచ్చు. కుటుంబంలోని పెద్దల అనుభవం , సహకారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సంతానం నుంచి ఏదైనా ప్రత్యేక శుభవార్త లభిస్తుంది, ఇంట్లో అందరూ సంతోషిస్తారు.  ఏదైనా పనిలో చుట్టుపక్కల వారు మీకు సహాయపడతారు. మానసిక గందరగోళానికి గురవుతారు. మకర రాశి

మీరు మీ ఆర్థిక పరిస్థితిని , ఇంటి నిర్వహణను సరిగ్గా ఉంచడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారాన్ని పెంచడానికి కొన్ని కొత్త మార్గాలు మీ మనస్సులో వస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాతో చేసే పనుల్లో మీరు సక్సెస్ అవుతారు. పెట్టుబడి విషయంలో మీరు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. కుంభ రాశి

ఈ రోజు మీకు ఉత్తమ ఫలితాలున్నాయి. వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించండి. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు లక్ష్యాన్ని చేరుకుంటారు. సరైన వ్యూహాన్ని రూపొందిస్తే విజయావకాశాలు పెరుగుతాయి. ఈ రోజు చాలా గందరగోళ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఏపని ప్రారంభించినా విజయం సాధఇస్తారు. అసంపూర్తిగా ఉన్న పని పూర్తవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.  

మీన రాశి

ఈ రోజు మీన రాశివారు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ప్రణాళిక ప్రకారం పనులన్నీ పూర్తవుతాయి. మీ సహనాన్ని కొనసాగించండి. మీరు మీ పురోగతిపై దృష్టిసారిస్తారు. కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం మీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. అకస్మాత్తుగా ధనం రావడం మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. 

ప్రశ్న 1. ఈ రోజు ఏ రాశి వారికి ధన లాభం కలుగుతుంది?వృశ్చికం, మకరం మరియు మీన రాశి వారికి రేపు మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి.

ప్రశ్న 2.ఈ రోజు ప్రయాణించే యోగం ఉందా?సింహ రాశి వారు రేపు ఆఫీసు పని కారణంగా ప్రయాణించవలసి రావచ్చు.

ప్రశ్న 3. ఏ రాశి వారికి ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది?తుల రాశి వారు రేపు ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తారు.

ప్రశ్న 4. ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా శుభ సంకేతం ఉందా?కుంభ రాశికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు రేపు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

ప్రశ్న 5. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చా?మేషం, కన్య మరియు మకర రాశి వారికి కొత్త పని ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.