Skoda Kodiaq Full-Size SUV Down Payment and EMI Details: భారత మార్కెట్లో, టయోటా ఫార్చ్యూనర్ ఫుల్-సైజ్ SUVగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే, స్కోడా కూడా న్యూ ఏజ్ స్కోడా కోడియాక్‌ను (Skoda Kodiaq 2025 Model) ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం SUV & దిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర (Skoda Kodiaq ex-showroom price, Delhi) రూ. 46.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 2025 స్కోడా కోడియాక్ మీ ఇంటికి తీసుకెళ్లాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ, అధిక ధర కారణంగా కొనలేకపోతే, ఫైనాన్స్ రూట్‌లో ఆ బండిని మీ సొంతం చేసుకోవచ్చు. అంటే, బ్యాంక్ & ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి కార్ లోన్ తీసుకుని మీ 2025 స్కోడా కోడియాక్‌ను మీ గరాజ్‌లో పార్క్ చేయవచ్చు.
స్కోడా కోడియాక్ కోసం ఫైనాన్స్ తీసుకునే ముందు మీరు కొన్ని ఆర్థిక అంశాలు ఆకళింపు చేసుకోవాలి. ముఖ్యంగా, 2025 మోడల్ స్కోడా కోడియాక్ ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్ & EMI గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. దిల్లీలో స్కోడా కోడియాక్ ఆన్-రోడ్ ధర (Skoda Kodiaq on-road price, Delhi) దాదాపు రూ. 54 లక్షల నుంచి స్టార్ అవుతుంది. మీ దగ్గర రూ. 10 లక్షలు ఉంటే, ఆ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చెల్లించి స్కోడా కోడియాక్ కొనుగోలు చేయవచ్చు. మిగిలిన రూ. 44 లక్షలు బ్యాంక్ నుంచి కార్ లోన్ రూపంలో లభిస్తుంది.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
బ్యాంక్ మీకు రూ. 44 లక్షల కార్ లోన్‌ను 9 శాతం వడ్డీ రేటుతో మంజూరు చేసిందని అనుకుందాం. మీరు 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 91,337 EMI చెల్లించాలి. మొత్తం ఐదేళ్లు లేదా 60 EMIల్లో మీరు బ్యాంకుకు మొత్తం రూ. 10,80,206 వడ్డీ + అసలు రూ. 44,00,000 కలిపి మొత్తం రూ. 54,80,206 చెల్లిస్తారు. మీరు స్కోడా కోడియాక్ కొనాలని ఆలోచిస్తుంటే మీ జీతం కనీసం 2 లక్షలు ఉండాలి, అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా EMI చెల్లించగలరు.
EMI తగ్గించుకోవాలనుకుంటే ఆరేళ్ల కాలానికి లోన్ తీసుకోవచ్చు. రూ. 44 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో ఆరేళ్లకు తీసుకుంటే, EMI రూ. 79,312 అవుతుంది. మొత్తం ఆరేళ్లు లేదా 72 EMIల్లో మీరు బ్యాంకుకు మొత్తం రూ. 13,10,490 వడ్డీ + అసలు రూ. 44,00,000 కలిపి మొత్తం రూ. 57,10,490 చెల్లిస్తారు.
ఏడేళ్ల టెన్యూర్‌తో లోన్ తీసుకుంటే EMI భారం ఇంకా తగ్గుతుంది. రూ. 44 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో ఏడేళ్లకు తీసుకుంటే, మంత్లీ EMI రూ. 70,792 అవుతుంది. మొత్తం ఏడేళ్లు లేదా 84 EMIల్లో మీరు బ్యాంకుకు మొత్తం రూ. 15,46,523 వడ్డీ + అసలు రూ. 44,00,000 కలిపి మొత్తం రూ. 59,46,523 చెల్లిస్తారు.
ఈ వడ్డీ రేటు ఒక ఉదాహణ మాత్రమే. వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోరు, లోన్ కాలపరిమితి & బ్యాంక్ విధానాల ఆధారపడి ఉంటుంది.
స్కోడా కొడియాక్ ఫీచర్లు (2025 Skoda Kodiaq Features)
స్కోడా కొడియాక్ మునుపటి మోడల్‌తో పోలిస్తే 2025 మోడల్‌లో మరిన్ని ప్రీమియం ఫీచర్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు కారులో ఎక్కువ స్పేస్ కనిపిస్‌తోంది. 2025 మోడల్‌లో పెద్దవాళ్లు కూడా మూడో వరుసలో హాయిగా కూర్చోవచ్చు. ఈ ప్రీమియం SUVలో 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కాగ్నాక్ లెదర్ & వెంటిలేటెడ్ సీట్లు, వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకుల కోసం టాబ్లెట్ హోల్డర్ కూడా ఉన్నాయి. భద్రత కోణంలో ఈ స్కోడా కారు మరో మెట్టు ఎక్కింది, మొత్తం 9 ఎయిర్ బ్యాగ్‌లు ఏర్పాటు చేశారు. కారులో ఎక్కువ సేపు కూర్చున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మసాజ్ ఫంక్షన్‌తో వచ్చే ఎర్గో సీట్లను అమర్చారు. స్కోడా కోడియాక్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 190 hp పవర్ & 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.