Mahindra Scorpio N: భారతదేశంలో GST స్లాబ్ స్ట్రక్చర్‌ మారడంతో చాలా కార్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. కార్ల తయారీ సంస్థ Mahindra అందరినీ ఆశ్చర్యపరుస్తూ GST అమలులోకి రాకముందే ధరలను తగ్గించింది. కంపెనీ Thar, Scorpio, Bolero, XUV700 వంటి తన ప్రజాదరణ పొందిన SUVs ధరలను 1.56 లక్షల రూపాయల వరకు తగ్గించాలని ప్రకటించింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

వాస్తవానికి, Mahindra Group చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా కంపెనీ సెప్టెంబర్ 22 కోసం ఎదురుచూడదని ప్రకటించారు. ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ, “అందరూ సెప్టెంబర్ 22 అంటున్నారు... మేము ఇప్పుడే అని చెప్పాము. Mahindra లైన్‌అప్‌లోని అన్ని కార్లపై GST ప్రయోజనం సెప్టెంబర్ 6 నుంచే కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తుంది.”

ఇప్పుడు Mahindra Scorpio ఎంత చౌకగా లభిస్తుంది?

మహీంద్రా స్కార్పియో N ప్రస్తుతం GST, సెస్‌తో కలిపి 48 శాతం పన్ను విధిస్తున్నారు. GST మార్పు తర్వాత, ఈ కారుపై ఈ పన్ను 40 శాతం ఉండాలి. ఈ విధంగా, మీరు మహీంద్రా స్కార్పియో N పై 1 లక్ష 45 వేల రూపాయల వరకు తగ్గింపు పొందనున్నారు.

Mahindra Scorpio N దాని బలమైన బిల్డ్ క్వాలిటీ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.62 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలు రెండూ ఉన్నాయి.

ఈ SUVలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS, రియర్ కెమెరా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, Android Auto, Apple CarPlay, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్‌లు కూడా ఉన్నాయి. సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ దీనిని మరింత ప్రీమియంగా చేస్తాయి.

Mahindra Scorpio N ఇంజిన్

Mahindra Scorpio N Z4 వేరియంట్ ఇంజిన్, పనితీరు గురించి చూస్తే... రెండు ఇంజిన్ ఆప్షన్‌లు కలిగిఉంది. మొదటిది 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 203 PS పవర్‌ను ,380 Nm టార్క్‌ను (ఆటోమేటిక్ వెర్షన్‌లో) అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

రెండో ఆప్షన్‌ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, ఇది రియర్-వీల్ డ్రైవ్‌లో 132 PS, 300 Nm టార్క్‌ను అందిస్తుంది. అదే సమయంలో, దాని 4WD వెర్షన్ (Z4 E) 175 PS, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇది ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

వేరియెంట్‌ ట్రాన్స్మిషన్  ఇంజిన్ డిస్క్రిప్షన్  పవర్  ఎక్స్‌-షోరూం ధర
Mahindra Scorpio N Z2 Diesel E Manual 2198 CC  130 kW@ 3750rpm రూ. 14.49 లక్షలు
Mahindra Scorpio N Z4 Diesel E Manual 2198 CC  130 kW @ 3750rpm రూ.16.21 లక్షలు 
Mahindra Scorpio N Z6 Diesel Manual  2198 CC  172.45 kW @ 3500rpm  రూ. 17.25 లక్షలు 
Mahindra Scorpio N Z4 Diesel AT Automatic  2198 CC  172.45 kW @ 3500rpm  రూ. 17.86 లక్షలు 
Mahindra Scorpio N Z4 Diesel E 4x4  Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 18.35 లక్షలు
Mahindra Scorpio N Z6 Diesel AT Automatic 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 18.91 లక్షలు
Mahindra Scorpio N Z8 Select Diesel Manual  2198 CC  172.45 kW @ 3500rpm  రూ. 19.56 లక్షలు
Mahindra Scorpio N Z8 Select Diesel AT Automatic 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 19.56 లక్షలు
Mahindra Scorpio N Z8T Diesel Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 20.69 లక్షలు 
Mahindra Scorpio N Z8 Diesel Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 21.22 లక్షలు 
Mahindra Scorpio N Z8 Diesel AT Automatic  2198 CC   172.45 kW @ 3500rpm  రూ. 21.22 లక్షలు 
Mahindra Scorpio N Z8 Carbon Edition Diesel Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 21.42 లక్షలు 
Mahindra Scorpio N Z8 Carbon Edition Diesel AT Automatic 2198 CC  172.45 kW @ 3500rpm  రూ. 21.42 లక్షలు
Mahindra Scorpio N Z8L Carbon Edition Diesel Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 21.48 లక్షలు
Mahindra Scorpio N Z8L Diesel Manual 2198 CC  172.45 kW @ 3500rpm రూ. 21.75 లక్షలు
Mahindra Scorpio N Z8 Diesel 4x4 Manual 2198 CC  172.45 kW @ 3500rpm రూ.21.78 లక్షలు
Mahindra Scorpio N Z8L 6 Str Diesel Manual 2198 CC 172.45 kW @ 3500rpm రూ. 22.12  లక్షలు
Mahindra Scorpio N Z8T Diesel AT Automatic  2198 CC  172.45 kW @ 3500rpm   రూ. 22.18 లక్షలు