Tata Punch Price, Down Payment, Loan and EMI Details: భారతీయులు ఎక్కువగా కొంటున్న & అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల లిస్ట్‌లో టాటా పంచ్ పేరు కూడా ఉంది. ఇది స్టైలిష్‌ లుక్స్‌లో కనిపించే బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. టాటా పంచ్‌ కారు ధర ఏడు లక్షల రూపాయల పరిధిలో ఉంది. ఈ కారును కొనుగోలు చేయడానికి మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు.

'కార్‌ లోన్‌/ బ్యాంక్‌ లోన్‌' తీసుకుని కూడా ఈ టాటా బ్రాండ్‌ కారుకు మీరు ఓనర్‌ కావచ్చు. లోన్‌లో కారు కొన్న తర్వాత, వడ్డీ రేటును బట్టి నిర్దిష్ట మొత్తాన్ని బ్యాంకులో EMI గా డిపాజిట్ చేయాలి.

టాటా పంచ్‌ ధర ఎంత?టాటా పంచ్‌ బేస్‌ మోడల్‌ 'ప్యూర్‌ పెట్రోల్‌ MT వేరియంట్‌' ఎక్స్‌-షోరూమ్‌ ధర (Tata Punch ex-showroom price) రూ. 6.20 లక్షలు. ఈ బండిని కొనాలంటే రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 89,000; బీమా కోసం దాదాపు రూ. 34,000; ఇతర ఛార్జీల కింద దాదాపు రూ. 2,000 చెల్లించాలి. మొత్తం కలిసి, టాటా పంచ్‌ ఆన్‌-రోడ్‌ ధర (Tata Punch on-road price) హైదరాబాద్‌లో దాదాపు రూ. 7.45 లక్షలు అవుతుంది. విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలోనూ కొద్దిపాటి తేడాతో దాదాపు ఇదే రేటు ఉంటుంది.

టాటా పంచ్ కోసం ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? టాటా పంచ్ కారును కొనడానికి మీ దగ్గర పూర్తి డబ్బు లేకున్నా, బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌ లభిస్తుంది. ఈ కారు కొనడానికి, మీరు కేవలం 75,000 రూపాయలను డౌన్‌ పేమెంట్‌ కోసం చెల్లించాలి. మిగిలిన 6,70,000 రూపాయలు బ్యాంకు నుంచి రుణం లభిస్తుంది. ఈ లోన్ మీద బ్యాంక్‌ కొంత వడ్డీని వసూలు చేస్తుంది. కారు రుణ మొత్తం, బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుందన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. 

టాటా పంచ్‌ కార్‌ లోన్‌ మీద EMI లెక్కింపుఉదాహరణకు, మీరు టాటా పంచ్‌ కొనడానికి బ్యాంక్‌ నుంచి రూ. 6.70 లక్షలు లోన్‌ తీసుకుంటే, బ్యాంక్‌ ఈ లోన్‌ మీద 9% వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుందనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాల కాలానికి మీరు తీసుకుంటే ప్రతి నెలా రూ. 10,780 EMI చెల్లించాలి.

6 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా లోన్‌ పొందితే ప్రతి నెలా రూ. 12,077 EMI చెల్లించాలి.

5 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే ప్రతి నెలా రూ. 13,908 EMI చెల్లించాలి.

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే ప్రతి నెలా రూ. 16,673 EMI చెల్లించాలి.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో టాటా పంచ్ ధరల్లో కొంత తేడా ఉండవచ్చు. టాటా పంచ్‌ కోసం లభించే లోన్ మొత్తం కూడా మారవచ్చు. కారు లోన్‌పై వడ్డీ రేటు మారితే EMI గణాంకాలు కూడా మారతాయని గుర్తుంచుకోండి. కారు లోన్ తీసుకునే ముందు అన్ని రకాల సమాచారాన్ని క్షుణ్నంగా తెలుసుకోండి.