Hyundai Creta Hybrid: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVల్లో హ్యాందాయ్ క్రెటా ఒకటి. అందుకే దీన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో ఉంది కంపెనీ. సరికొత్త అవతార్‌లో భారత్ మార్కెట్‌లోకి వచ్చే ఏడాదిలో రాబోతోంది. ఇప్పటకే రెండు జనరేషన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పుడు థర్డ్ జనరేషన్‌తో మరింత మెస్మరైజ్ చేయబోతోంది. ఇప్పటి వరకు వచ్చి నరెండు జనరేషన్స్‌కు మరింత అప్‌డేట్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సరికొత్త హైబ్రిడ్ సాంకేతికత చూడవచ్చు. ఇది Hyundaiకి ఒక పెద్ద మార్పు అవుతందని ఆటోరంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు Creta పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో వస్తోంది. హైబ్రిడ్ వెర్షన్ మంచి మైలేజీని కోరుకునే వాళ్లకు కొత్త మోడల్ మరింత ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. 

Continues below advertisement

క్రెటా హైబ్రిడ్‌లో ఇంజిన్ ఎలా ఉంటుంది?

తదుపరి తరం క్రెటా ప్రస్తుతం డిజైనింగ్ దశలోనే ఉంది. అంతర్గత దీన్ని SX3 అని పిలుస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఈ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో సహా బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌తో పని చేయనుంది. ఈ సిస్టమ్ కియా సెల్టాస్‌ హైబ్రీడ్‌ లాగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే రెండు కంపెనీలు ఒకే గ్రూప్‌లో భాగం కావడంతో ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నారు. హైబ్రిడ్‌తో పాటు, కొత్త క్రెటాలో 1.5 లీటర్ సాధారణ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదు.  

మైలేజ్- డ్రైవింగ్

క్రెటా హైబ్రిడ్‌ తక్కువ వేగంతో కొంత దూరం వరకు ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే నడుస్తుంది. ఇలాంటి వాహనం ఎక్కువడా ఎక్కువ ట్రాఫిక్ ఉండే సిటీల్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఈ SUV లీటరుకు 20 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని భావిస్తున్నారు. పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే, నగరంలో దీని మైలేజ్ దాదాపు 10 శాతం, హైవేపై దాదాపు 5 శాతం ఎక్కువగా ఉండవచ్చు.

Continues below advertisement

హ్యాందాయ్‌కి హైబ్రిడ్  అవసరం ఏం వచ్చింది?

హ్యూందాయ్‌ ఇప్పటికే క్రెటా ఎలక్ట్రిక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న ఈవీలకు తగ్గట్టుగా విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండటం లేదు. అందుకే ఈవీలు తీసుకుంటున్న వారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీన్ని గ్రహించిన కంపెనీలు ఛార్జింగ్ గురించి హైరానా పడకూడదని చెప్పి హైబ్రిడ్ మోడల్‌ను కూడా ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు ఉంచున్నారు. ఇప్పుడ హ్యాందాయ్ కూడా అదే చేస్తోంది. హైబ్రిడ్ ఒక సులభమైన, నమ్మదగిన ఎంపికగా మారుతుంది. అదే సమయంలో, కొత్త ప్రభుత్వ నిబంధనల కారణంగా, మంచి మైలేజీని అందించే కార్లను తీసుకురావడానికి కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఎవరికి పోటీ ఇస్తుంది? ఏయే ఫీచర్లు ఉంటాయి?

క్రెటా హైబ్రీడ్‌ నేరుగా మారుతి గ్రాండ్‌ విటారా హైబ్రీడ్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైబ్రీడ్‌తో పోటీపడుతుంది. రాబోయే రోజుల్లో రెనో డస్టర్‌ హైబ్రీడ్‌ కూడా ఈ విభాగంలోకి రానుంది. కొత్తగా వస్తున్న క్రెటా హైబ్రీడ్‌లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటీరియర్‌లో చాలా ఛేంజస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉండబోతోంది. కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, టాప్ వేరియంట్‌లలో లెవెల్-2 సేఫ్టీ ఫీచర్‌లు పొంద వచ్చని చెబుతున్నారు.  

కొత్త క్రెటా హైబ్రీడ్‌ ప్రత్యేకత ఏమిటి?

హ్యూందాయ్‌ క్రెటా హైబ్రీడ్‌ కేవలం ఒక కొత్త వేరియంట్ మాత్రమే కాదు, కంపెనీ భారతదేశంలోని మారుతున్న మార్కెట్‌ను అర్థం చేసుకుంటుందని నిరూపిస్తోంది. మంచి మైలేజ్, తక్కువ ఖర్చు,  సులభమైన వినియోగంతో ఈ SUV చాలా మంది కస్టమర్‌లకు సరైన ఎంపికగా ఉంటుంది.