Telugu News: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీలతో కొత్త కొత్త ప్రయోగాలతో నూతన ఆవిష్కరణలకు ఊపిరి పోస్తున్నారు నిపుణులు. అయితే ఒకప్పుడు గుండె ఉండే సంబంధిత వ్యాధులు వస్తే సర్జరీలు చేసేవారు కిడ్నీలలో రాళ్లు వస్తే సర్జరీ చేసి ఆ రాళ్ళను తీసేవారు అయితే మారుతున్న టెక్నాలజీ అనుకూలంగా సర్జరీలు పోయి స్టంట్ లు వచ్చాయి అయితే ఇవన్నీ మానవులకు వచ్చే సమస్యలకు పరిష్కారం... మరి వాహనదారులు నడిపే వాహనాలను కూడా స్టంట్ వేసినట్టుగా కేవలం ఒక పైపు సహాయంతో వాహనాలలో వచ్చే ఇంజన్ సమస్యలను తీర్చే విధంగా నూతన టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు నిపుణులు...


సామాన్యంగా కార్లలో అయినా ద్విచక్ర వాహనాలలో అయినా ఇంజన్ సమస్యలు వస్తుంటాయి. అప్పుడు ఇంజన్ బాగు చేయించాలంటే మాత్రం వేల రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అయితే వాహనాలలో ఇంజన్ సమస్యలు వచ్చాయంటే మాత్రం ఇంజన్ పాట్లు మొత్తం విడదీయాల్సిందే. అయితే ఇంజన్ విడదీసే సమయంలో మరిన్ని పార్ట్స్ చెడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాహనదారులకు మరింత ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.


అయితే నూతనంగా వచ్చిన టెక్నాలజీతో వాహనాల ఇంజన్ ఎలా ఉందో...? ఇంజన్ పరిస్థితి ఏంటో...? తెలిపేలా ఇంజన్ విడదీయకుండానే రిపేర్ చేసే పరికరాలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ పరికరం ఏంటి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.


సామాన్యంగా అన్ని వాహనాలలో 20,000 కిలోమీటర్ల తర్వాత ఇంజన్లో కార్బన్ తయారు అవుతుంది. కార్బన్ అంటే ఇంజన్లో ఉండే ఇంజన్ ఆయిల్ పాడైపోయి అది కార్బన్ తరహాలో తయారవుతుంది. ఇంజన్లో ఉండే ఇంజన్ ఆయిల్ చిక్కగా మారి ఇంజన్ ను దెబ్బతీసే విధంగా తయారవుతుంది. కార్బన్ సమస్యలు మొదలైనప్పుడు వాహనం యొక్క మైలేజీ దెబ్బతినడం ఏసీ సరిగ్గా పని చేయకపోవడం ఇంజన్ వీక్ అవ్వడం ఇంజన్లో వైబ్రేషన్స్ రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అప్పుడు ఇంజన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలా ఇంజన్ పాడైపోయే పరిస్థితి రాకుండా.. కేవలం ఒక గ్యాస్ సహాయంతో కార్బన్ క్లీన్ చేయవచ్చు అంటున్నారు హైడ్రోటెక్ ఎలైట్ కార్బో క్లీనింగ్ టెక్నీషియన్ శ్రీనివాస్.


కార్బన్ క్లీనింగ్ విధానం...
జర్మన్ టెక్నాలజీతో కూడిన హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ చేయాలంటే ముందుగా కారు ఇంజన్ భాగం ముందు ఉండే ఎయిర్ ఫిల్టర్ లోకి ఒక పైపును పంపిస్తారు. పైపు సహాయంతో ఇంజన్లోకి కార్బన్ ను క్లీన్ చేసేందుకు ఒక గ్యాస్ ను పంపిస్తారు. సుమారు 45 నిమిషాల పాటు ఆ పైప్ సహాయంతో కార్బన్ క్లీనింగ్ మిషన్ జరుపుతూ ఉంటుంది. అలా కార్బన్ క్లీనింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాహనంలో ఉండే వైబ్రేటింగ్.. ఇంజన్ పికప్, ఏసీ సంబంధిత సమస్యలన్నీ సర్దుకుంటాయని అంటున్నారు ఎలైట్ కార్బన్ క్లీనింగ్ టెక్నీషియన్ శ్రీనివాస్.