జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా మార్కెట్ భారత్‌లోనూ చాలా పెద్దది. అయినప్పటికీ కంపెనీ సివిక్, సిఆర్-వి మోడల్స్ నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, హోండా మరోసారి ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. కంపెనీ భారత్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ హైబ్రిడ్ SUV హోండా ZR-V ని CBU అంటే ఇంపోర్టెడ్ విధానం ద్వారా లిమిటెడ్ కార్లను ప్రవేశపెడుతోంది.

Continues below advertisement

ట్రాక్‌పై టెస్టింగ్ సమయంలో మోండా జెడ్‌ఆర్ వీ (Honda ZR V) కార్ తన డ్రైవింగ్ డైనమిక్స్, ప్రీమియం ఫినిషింగ్, అద్భుతమైన మైలేజ్‌తో ఎంతో ఆకట్టుకుంది.  అయితే, ఇంపోర్టెడ్ మోడల్ కావడం వల్ల దీని ధర ఎక్కువగా ఉండనుంది. దాంతోపాటు కొన్ని ఫీచర్ల లోపం అమ్మకాల్లో దీనికి కొంత సవాలుగా మారవచ్చు. హోండా ఈ పవర్‌ఫుల్ కార్ ఫీచర్లు, విశేషాలు ఇక్కడ అందిస్తున్నాం.

181 BHP పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్

Continues below advertisement

హోండా ZR-V లో 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి 181 bhp పవర్, 315 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కార్ పూర్తిగా EV మోడ్‌లో స్టార్ట్ అవ్వడం ప్లస్ పాయింట్. స్పీడ్ అందుకోగానే ఇంజిన్ ఎలాంటి జెర్క్ లేకుండా పవర్‌ను అందిస్తుంది. ఇది 22.7 కిలోమీటర్‌తో అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని హోండా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. రియల్ వరల్డ్ కండిషన్‌లో కారు 16 నుండి 18 కి.మీ  మైలేజ్ ఇస్తుందని గుర్తించారు. 

స్పోర్టీ డ్రైవింగ్, క్విక్ రెస్పాన్స్

హోండా ఈ కార్ డ్రైవింగ్ చేయడానికి కస్టమర్లు ఇష్టపడతారు. లో-స్లగ్ డ్రైవింగ్ పొజిషన్, సూపర్‌కార్ల లాంటి మెటల్ ప్యాడిల్ షిఫ్టర్లు దీని స్టీరింగ్ ను ప్రత్యేకంగా చేస్తాయి. eCVT గేర్‌బాక్స్ డ్రైవ్ చేసినప్పుడు చాలా స్మూత్, క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది. దీని స్టీరింగ్ వీల్ తేలికగా ఉన్నప్పటికీ మలుపుల వద్ద బెస్ట్ అనిపిస్తుంది. కారు సైజులో పెద్దదిగా ఉన్నప్పటికీ ఎక్కువ బరువు అనిపించదు. టర్నింగ్‌లలో కూడా దీని రోడ్ గ్రిప్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి.

ఫీచర్లు, క్యాబిన్‌ మైనస్ అవుతాయా..

లుక్స్ పరంగా హోండా ZR-V ఫ్రంట్ చూస్తే ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ లభిస్తుంది.  ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ఫినిషింగ్ క్వాలిటీ చాలా రిచ్‌గా ఫీలవుతారు. దీని అతిపెద్ద బలహీనత దీని చిన్న, బేసిక్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ ఫీచర్లు ఇవ్వలేదు. బూట్ స్పేస్‌లో ఆటో- క్లోజ్ బటన్ వంటి కొన్ని ప్రాక్టికల్ ఫీచర్లు ఇచ్చారు. ఇవి లగేజ్ తీసేటప్పుడు హెల్ప్ అవుతాయి.

Also Read: హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?

సవాలుగా మారుతున్న దీని ధర

CBU మార్గం ద్వారా రావడం వల్ల ఈ SUV పై భారీ పన్నులు కస్టమర్లపై పడతాయి. దీని ఎక్స్-షోరూమ్ అంచనా ధర 40 లక్షల నుండి 45 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ ధరల వద్ద దీనికి స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి పెద్ద SUVలతో పోటీ తప్పదు. ఆ కార్లు హోండా కంటే ఎక్కువ ఫీచర్లు, 7 సీటర్ స్పేస్‌ను అందిస్తాయి. తన పవర్‌ఫుల్ లుక్స్, హోండా క్వాలిటీ, రికార్డు స్థాయి మైలేజ్ పై కొందరు కార్ లవర్స్‌ను తనవైపు తిప్పుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.