Honda SP160 Review: భారత కమ్యూటర్‌ బైక్‌ మార్కెట్‌లో హోండాకు మంచి పేరు ఉంది. దీనికి కొనసాగింపుగా కంపెనీ తీసుకొచ్చిన మోడల్‌ Honda SP160. ఇది హోండా యూనికోర్న్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందినప్పటికీ, లుక్‌, ఫీచర్ల విషయంలో మరింత ఆధునికంగా కనిపిస్తుంది. SP125 నుంచి తీసుకున్న డిజైన్‌ టచ్‌లు దీనికి యూత్‌ ఫ్రెండ్లీ అప్పీల్‌ను ఇస్తాయి. మీరు ఈ బైక్‌ను కొనాలనుకుంటే, ముందుగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఇవే.

Continues below advertisement

1. Honda SP160 ఇంజిన్‌ పవర్‌ ఎంత?

Honda SP160లో 162.7cc సామర్థ్యం గల, ఎయిర్‌-కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్‌ 7,500rpm వద్ద 13.2hp పవర్‌ను, 5,250rpm వద్ద 14.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్‌ పవర్‌ డెలివరీ ఉండటం ఈ బైక్‌ ప్రత్యేకత.

Continues below advertisement

2. Honda SP160 బరువు ఎంత?

SP160 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ బరువు 138 కిలోలు కాగా, డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌ బరువు 140 కిలోలు. అదే ఇంజిన్‌, ప్లాట్‌ఫామ్‌ ఉన్న హోండా యూనికోర్న్‌ బరువు 139 కిలోలు. అంటే, SP160 బరువు పరంగా సులభంగా హ్యాండిల్‌ చేయగలిగే బైక్‌గా చెప్పుకోవచ్చు.

3. సీట్‌ హైట్‌ & రైడింగ్‌ కంఫర్ట్‌

Honda SP160 సీట్‌ హైట్‌ 796mm. ఇది ఎక్కువ మంది తెలుగు రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది. కమ్యూటర్‌ బైక్‌గా డిజైన్‌ చేసినందున, ఇందులో పొడవైన సింగిల్‌ పీస్‌ సీట్‌ ఇచ్చారు. దీని వల్ల రైడర్‌, పిలియన్‌ ఇద్దరికీ సరిపడా స్థలం లభిస్తుంది. రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలు, కుటుంబంతో చిన్న ట్రిప్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది.

4. Honda SP160లో ఉన్న ఫీచర్లు

ఫీచర్ల విషయంలో SP160 ఆకట్టుకుంటుంది. ఇందులో TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. దీనికి బ్లూటూత్‌ కనెక్టివిటీ అందించారు. కాల్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్‌ ఈ డిస్‌ప్లే ద్వారా ఉపయోగించుకోవచ్చు. అలాగే LED హెడ్‌ల్యాంప్స్‌, LED టెయిల్‌ ల్యాంప్‌, USB Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉన్నాయి. భద్రత కోసం సింగిల్‌ ఛానల్‌ ABS‌ను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.

5. Honda SP160 ధర & ఆన్‌రోడ్‌ ఖర్చు

Honda SP160 ధరలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర - ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ):• సింగిల్‌ డిస్క్‌ వేరియంట్‌ - రూ.1.15 లక్షలు• డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌ - రూ.1.21 లక్షలు

డబుల్‌ డిస్క్‌ వేరియంట్‌లో రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ స్థానంలో డిస్క్‌ బ్రేక్‌ ఇస్తారు.

హైదరాబాద్‌లో Honda SP160 సింగిల్‌ డిస్క్‌ ఆన్‌రోడ్‌ ధర:ఎక్స్‌-షోరూమ్‌ ధర - రూ.1,15,018RTO - రూ.18,725ఇన్సూరెన్స్‌ - రూ.12,230ఎక్స్‌టెండెడ్‌ వారంటీ - రూ.1,114TR - రూ.995మొత్తం ఆన్‌రోడ్‌ ధర - రూ.1,48,082

విజయవాడలో Honda SP160  సింగిల్‌ డిస్క్‌ ఆన్‌రోడ్‌ ధర:ఎక్స్‌-షోరూమ్‌ ధర - రూ.1,15,018RTO - రూ.15,302ఇన్సూరెన్స్‌ - రూ.11,530మొత్తం ఆన్‌రోడ్‌ ధర - రూ.1,41,850

మొత్తం మీద, రోజువారీ ప్రయాణాలకు నమ్మకమైన ఇంజిన్‌, ఆధునిక ఫీచర్లు, హోండా విశ్వసనీయత కావాలనుకునే వారికి Honda SP160 ఒక మంచి ఎంపిక. నగరంతో పాటు హైవేలోనూ స్మూత్‌ రైడ్‌ కోరుకునే వారికి ఇది సరైన కమ్యూటర్‌ బైక్‌గా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.