Podharillu Serial Today Episode: చక్రి, మహా కోసం ఇంటి వద్ద మాధవ్‌ వాళ్ల తమ్ముళ్లు ఘనంగా ఏర్పాట్లు చేయడం చూసి వాళ్ల నాన్నుకు ఆశ్చర్యమేసి ఏం జరుగుతోందని అడుగుతాడు. మన చక్రిగాడు  ఎవరో అమ్మాయిని ప్రేమించి పోలీసుస్టేషన్‌లో పెళ్లిచేసుకుని తిరిగి వస్తున్నాడని కొడుకులు చెబుతారు. ఆ అమ్మాయి చాలా గొప్పింటి బిడ్డని...నువ్వు కొంచెం  ఆ అమ్మాయితో పద్దతిగా  ఉండాలని హెచ్చరిస్తారు. ఇంట్లో తాగుడు బంద్‌ చేయాలని సూచిస్తారు.  ఈ మాటలు విన్న నారాయణ....చక్రిగాడు అన్నంత పనిచేశాడని సంబరపడిపోతారు. కారులో చాలా దూరం వస్తుండటంతో ఇంకా ఎంతసేపట్లో మీఇంటికి  వెళ్తామని మహా మండిపడుతుంది. దగ్గరలోనే ఉన్నామని చెబుతుంది. గతంలో వాళ్ల ఇంటి గురించి గొప్పలు చెప్పుకున్న  చక్రి లోలోపల భయపడుతుంటాడు. ఇప్పుడు ఆ ఇంటిని చూసి మహా ఎలా ఫీలవుతుందోనని ఆందోళన చెందుతుంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లిన నాన్న పరిస్థితి ఏంటని మహా కూడా కంగారుపడుతుంటుంది.                       మహా లేకుండా ఇంటికి వెళ్లిన ప్రతాప్‌ను  చూసి వాళ్ల ఆవిడ అమ్మాయి ఎక్కడండీ  పెళ్లికి ముహూర్తం కూడా దాటిపోతుంటేనని  అడుగుతుంది. నిహారిక కూడా పిలుస్తున్నా వినకుండా  ప్రతాప్‌ లోపలకి వెళ్లి నెత్తిన నీళ్లుపోసుకుని వస్తాడు. అసలు ఏం జరిగిందని  మహా వాళ్ల అమ్మ అడుగితే....కూతురు చిచ్చపోయి  దహన సంస్కరాలు చేసి వచ్చిన తర్వాత తలస్నానం చేయాలని కదా అందుకే చేశానంటాడు. ఆ మాటలకు ఆమెకు ఏం అర్థం కాదు.ఇంతలో అక్కడికి వచ్చిన భూషణ్‌ మరింత మండిపతాడు. మీ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోలేదని...ఆ డ్రైవర్‌గాడితో  లేచిపోయిందని అంటాడు. అంకుల్‌,ఆది, నేను ఎంత బ్రతిమాలినా ఇంటికి రానందని....వాడితోనే  వెళ్లిపోతానని పోలీసులకు చెప్పిందని అంటాడు. ఆ మాటలకు నిహారిక అడ్డుచెబుతుంది. నీతో పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయింది గానీ...ఆ డ్రైవర్‌తో మా మహాకు ఎలాంటి సంబంధం లేదని అంటుంది. అయితే ఇది చూడండని అక్కడ ఉన్నవారందరికీ పోలీసుస్టేషన్‌లో   మహా  పెళ్లిచేసుకున్న ఫొటోలు చూపిస్తాడు. అది చూసిన భూషణ్ వాళ్ల తల్లిదండ్రులు మరింత రెచ్చిపోతారు. మీ అమ్మాయిని చాలా పద్దతిగా పెంచామని చెప్పారు కదా...డ్రైవర్‌తో లేచిపోవడమేనా   పద్ధతిగా పెంచడమంటేనని అంటారు. వాడితో  ముందే లవ్‌ ఎఫైర్‌ ఉందని....కావాలనే మమ్మల్ని మోసం చేసి మీ అమ్మాయిని మావాడికి అంటగట్టాలని చూశారని అంటారు. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే...మేం మా బంధువులకు ఏం చెప్పుకోవాలని అంటారు. అమెరికా,కెనడా నుంచి వచ్చిన మా ప్రెండ్స్‌కు   ఏం సమాధానం చెప్పాలని భూషణ్ నిలదీస్తాడు. ఇంతలో ప్రతాప్ బంధువులు కలుగజేసుకుని వాళ్లు ఇప్పటికే బాధలో ఉన్నారని....మీరు మరింత బాధపెట్టొద్దని వారిస్తారు.  దీంతో ఇరువర్గాలు  ఒకరినొకరు వాదులాడుకుంటారు.                               తొలిసారి ఇంట్లోకి ఓ అమ్మాయి అడుగుపెడుతుందని చక్రి వాళ్ల అన్నదమ్ములు లైటింగ్‌,బ్యాండ్‌మేళం, డీజే పెట్టించి పండుగ చేసుకుంటుంటారు.  ఎప్పుడూ  కళావిహీనంగా ఉండే వాళ్ల అన్నయ్య ఇంటి ముందు  సందడిగా ఉండటం చూసి తాయరుకు ఏం అర్థం కాదు. గాయత్రిని పిలిచి ఏం జరుగుతుందో కనుక్కుని రమ్మని పురమాయిస్తుంది. ఆమె అక్కడికి వెళ్లి ఎందుకు హడావుడి చేస్తున్నారని అడిగితే...చక్రి పెళ్లి చేసుకుని తిరిగి వస్తున్నాడని....ఇక్కడే ఉండి హారతి ఇవ్వమని మాధవ్‌ చెప్పడంతో ఆమె సరేనంటుంది.  అటు బంధువుల సూటిపోటి మాటలతో ప్రతాప్ గదిలోకి  వెళ్లి తలుపు వేసుకుంటాడు.తనను  ఒంటరిగా  వదిలేయాలని కోరతాడు. ప్రతాప్‌ మధ్యాహ్ననమే  ఇంటికి వచ్చినా...ఆది రాకపోవడంతో  నిహారిక  కంగారుపడుతుంది. భర్తకు ఫోన్ చేస్తే....స్విచ్ఛాప్‌ వస్తుంది.  చక్రిని ఏమైనా చేయడానికి వెళ్లాడా అని కీడు శంకిస్తుంది. ఆమె అనుకున్నట్లే....ఆది తన మనుషులను  తీసుకుని చక్రి ఇంటికి బయలుదేరతాడు. వాడిని చంపేసి తన చెల్లెలని ఇంటికి  తీసుకొస్తానని అంటాడు.

Continues below advertisement

 

Continues below advertisement