Honda Shine 100 Electric Price, Range And Features: హోండా, తన పాపులర్‌ కమ్యూటర్ బైక్ షైన్ 100 ను ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల వెల్లడైన పేటెంట్ ఇమేజ్‌ను బట్టి, హోండా షైన్ 100 లాగా కనిపించే ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ కంపెనీ తయారు చేస్తోందని, పెట్రోల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారుతో ఇది నడుస్తుందని అర్ధం అవుతుంది. తక్కువ ధర, నమ్మకమైన & తక్కువ నిర్వహణ అవసరమయ్యే ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం ఈ బైక్‌ తెస్తోంది.

Continues below advertisement


ఇంజిన్‌తో కాదు, మోటార్‌తో నడుస్తుంది 
ప్రస్తుత హోండా షైన్ 100లో, పెట్రోల్ స్థానం ఉన్న స్థానంలో కొత్త బైక్‌ ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది. కొత్త బైక్ ఛాసిస్, ప్రస్తుత షైన్ 100 లాగే పూర్తిగా బలంగా మరియు సరళంగా ఉంటుంది. ఈ కారణంగా ఈ బండి ఐడెంటిటీ చెక్కుచెదరదు & తయారీ ఖర్చు తగ్గుతుంది.


మార్చుకోగల రెండు బ్యాటరీ ప్యాక్‌లు
హోండా షైన్ 100 ఎలక్ట్రిక్ రెండు చిన్న స్వాపబుల్‌ బ్యాటరీలతో (Swappable batteries) వస్తుంది, వీటిని సులభంగా తొలగించవచ్చు & మార్చుకోవచ్చు. ప్రతి బ్యాటరీ దాదాపు 10.2 కిలోల బరువు ఉంటుంది. ఈ బ్యాటరీలు బైక్‌ రెండు వైపులా అమరుస్తారు & వాటి మధ్య ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది, తద్వారా అవి ఎక్కువగా వేడెక్కవు. ఈ టెక్నాలజీ, హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ (Honda Activa Electric)లో అందించిన బ్యాటరీ స్వాపింగ్‌ తరహాలో ఉంటుంది.


ప్రస్తుత పెట్రోల్‌ ఇంజిన్‌ ఉన్న చోటనే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. అంటే, పెట్రోల్ ఇంజిన్ కోణంలో బ్యాటరీ లేఅవుట్ రూపొందించారు. బైక్ మధ్యలో అడ్వాన్స్‌డ్‌ ECU (ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్) కూడా అందించారు, ఇది విద్యుత్ వ్యవస్థను నియంత్రిస్తుంది.


లాంచ్‌ టైమ్‌లైన్‌
షైన్ 100 ఎలక్ట్రిక్ లాంచ్ కోసం హోండా ఎటువంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే.. పేటెంట్ డిజైన్ & పూర్తయిన ఛాసిస్‌ను పరిశీలిస్తే, ఈ బైక్‌ను 2026 కంటే ముందే మార్కెట్లోకి విడుదల చేయవచ్చని అంచనా. ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి, కంపెనీ పూర్తిగా కొత్త బైక్‌ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. షైన్ 100 ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌లోనే కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ఎలక్ట్రిక్‌ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. 


బ్యాటరీ స్వాపింగ్‌ ప్రయోజనం
హోండా, తన యాక్టివా ఎలక్ట్రిక్ కోసం ఇప్పటికే బలమైన బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. అదే మౌలిక సదుపాయాలు షైన్ 100 ఎలక్ట్రిక్‌కు కూడా పనికొస్తాయి. కాబట్టి వినియోగదారులు ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కస్టమర్‌, ఏదైనా స్వాప్ స్టేషన్‌కు వెళ్లి, బండిలో ఉన్న ఛార్జింగ్‌ తగ్గిన బ్యాటరీని ఇచ్చి, ఫుల్‌ ఛార్జ్‌తో ఉన్న కొత్త బ్యాటరీని బండిలో అమర్చుకోవచ్చు. ఈ పని నిమిషాల్లో పూర్తవుతుంది. అంటే, బ్యాటరీ ఛార్జింగ్‌ టెన్షన్‌ ఉండదు & నిమిషాల వ్యవధిలో ఫుల్‌ ఛార్జ్‌తో ప్రయాణం మళ్లీ ప్రారంభమవుతుంది.


బైక్ మధ్యలో బిగించే ECU (ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్), బండికి స్మార్ట్ కంట్రోల్‌ను అందిస్తుంది. అలాగే, హోండా ప్రస్తుత బ్యాటరీ స్వాప్ నెట్‌వర్క్ ఇతర ఎలక్ట్రిక్‌ బైక్‌ల కంటే దీనికి ఆధిక్యాన్ని ఇస్తుంది.