Honda Shine EV : హోండా తన అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ షైన్‌ను ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యాక్టివా ఎలక్ట్రిక్, Q1 వంటి స్కూటర్లతో భారతదేశ EV మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత మిగతా కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పుడు హోండా కంపెనీ మోటార్‌సైకిల్ విభాగంలోకి కూడా అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన పేటెంట్‌ డాక్యుమెంట్‌ ఒకటి లీక్ అయింది. దీంతో హోండా షైన్ EVపై పని చేస్తోందని స్పష్టమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ బైక్‌లలో ఒకటి కావచ్చు.

హోండా షైన్ EV డిజైన్ ఎలా ఉంది?హోండా కంపెనీ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ షైన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పెట్రోల్ మోడల్ ఫ్రేమ్‌ ఆధారంగా కొత్త ఈవీ డిజైన్ ఉంటుందని అంటున్నారు. ఈవీ బైక్ డిజైన్ కూడా షైన్ లాగానే ఉంటుంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌ను తిరిగి ఉపయోగించడం వల్ల ఉత్పత్తి వ్యయం కూడా బాగా తగ్గుతుంది, దీనివల్ల హోండా దీనిని చవకైన అందుబాటులో ఉండే EV బైక్‌గా ప్రవేశపెట్టగలుగుతుంది.

సాంకేతికత, ఇంజిన్ సెటప్ ఎలా ఉంటుదంటే?హోండా షైన్ EVలో, కంపెనీ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించనుంది. ఇది సింగిల్-స్పీడ్ గేర్‌తో జత చేసి ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ మోటార్ ప్రస్తుత పెట్రోల్ షైన్ బైక్ ఇంజిన్ భాగంలోనే అమర్చి ఉంటుంది. ఇది బైక్‌ను తయారీ వ్యయం తగ్గుతుంది. దీని వల్ల బైక్ రేట్‌ కూడా చౌకగా ఉంటుంది.  

షైన్ ఈవీ టార్గెట్ వీళ్లే

షైన్ EV చాలా భాగాలు పెట్రోల్ షైన్‌వే అవుతాయి. దీనివల్ల దాని సర్వీసింగ్ నిర్వహణకు ఖర్చు భారీగా తగ్గుతుంది.  హోండా ఈ సెటప్‌ను ముఖ్యంగా సిటీలో ఎక్కువ బైక్ నడిపే వ్యక్తులకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి వాళ్లంతా తక్కువ నిర్వహణ, ఎక్కువ రేంజ్ వచ్చే బైక్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి వినియోగదారులను ఈ షైన్ ఈవీ టార్గెట్ చేయనుంది.  

రోజూ ఆఫీసు, పాఠశాల లేదా మార్కెట్‌కు వెళ్లడానికి చవకైన మంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్న వారికి ఈ బైక్ మంచి ఆప్షన్ కానుందని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఛార్జింగ్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

అంతేకాకుండా, హోండా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీపై కూడా వేగంగా పనిచేస్తోంది. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఈ సాంకేతికత ఇప్పటికే ఉంది. షైన్ EVలో కూడా ఈ సౌకర్యం ఉంటుందని భావిస్తున్నారు. దీని వల్ల రైడర్‌లు బ్యాటరీ ఛార్జ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ వారు స్వాప్ చేయగల బ్యాటరీని సమీప స్టేషన్‌లో సులభంగా మార్చుకోవడం ద్వారా వారి ప్రయాణాన్ని కొనసాగించగలరు.

షైన్ EVని హోండా చవకైన, మన్నికైన, ఆచరణాత్మక ఎలక్ట్రిక్ బైక్ ఎంపికగా పరిగణిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా భారతీయ నగరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నారు.