Honda Shine 100 DX Price, Mileage And Features In Telugu: హోండా, తన చవకైన & అత్యంత పాపులారిటీ ఉన్న బైక్ Honda Shine 100 ను కొత్త & ప్రీమియం వెర్షన్‌లో పరిచయం చేసింది, అది - "హోండా షైన్ 100 DX. 2025 మోడల్‌లో, ఈ టూవీలర్‌ సరికొత్త డిజైన్, ఆధునిక హంగులు & యువ రైడర్లకు ఇష్టమైన రంగులతో లాంచ్‌ అయింది. దీని బుకింగ్స్‌ శుక్రవారం నుంచి, అంటే 01 ఆగస్టు 2025 నుంచి ప్రారంభమయ్యాయి. 

2025 హోండా షైన్ 100 DX లుక్స్‌ విషయానికి వస్తే.. ఈ బండికి పెద్ద ఇంధన ట్యాంక్‌ ఇచ్చారు, దీనివల్ల ఈ బైక్ గతంలో కంటే మరింత మస్క్యులర్‌గా & స్టైలిష్‌గా కనిపిస్తోంది. బోల్డ్ గ్రాఫిక్స్, క్రోమ్ హెడ్‌లైట్ కౌల్ & క్రోమ్ హీట్ షీల్డ్ కూడా ఉన్నాయి. ఇవి, ముఖ్యంగా ఈ బండి బడ్జెట్‌తో పోల్చినప్పుడు దీనికి ప్రీమియం లుక్ & ఫీల్‌ను ఇస్తాయి.

హోండా షైన్ 100 DX ఫీచర్లుకొత్త హోండా షైన్ 100 DX ఇప్పుడు పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వచ్చింది, ఇది ఈ విభాగంలో కొత్త & ప్రత్యేక లక్షణం. ఈ డిజిటల్ మీటర్ రైడర్‌కు వేగం, ఇంధన స్థాయి & గేర్ స్థానం వంటి ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. తద్వారా, ఈ బైక్‌ మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందిన & ఆధునిక బైక్‌ అనే అనుభూతిని ఇస్తుంది.

హోండా షైన్ 100 DX ను యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు & ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ బైక్‌ రంగుల్లో - పెర్ల్ ఇంజీనస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ & జెనీ గ్రే మెటాలిక్ ఉన్నాయి. ఈ కలర్‌ ఆప్షన్లు అన్నీ యువ రైడర్లకు స్టైలిష్ & ట్రెండీ లుక్ ఇచ్చేలా ఎంపిక చేశారు.

బైక్ ఇంజిన్ & పవర్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, Honda Shine 100 లో ఉపయోగించిన అదే 98.98cc ఇంజిన్‌ను  హోండా షైన్ 100 DX లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7.28 bhp పవర్‌ను & 8.04 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్‌ అయి ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల, ఈ బైక్ నగర ట్రాఫిక్‌లో బాగా పని చేయడమే కాకుండా, గ్రామీణ రోడ్లపై కూడా మంచి మైలేజీని & మృదువైన ప్రయాణాన్ని అందిస్తుంది.

భద్రత & సౌకర్యం పరంగా, Shine 100 DX ను స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్‌తో తయారు చేశారు, ఇది ఈ టూవీలర్‌కు బలాన్ని ఇస్తుంది. ఇంకా.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ షాక్స్‌ & 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్‌ కూడా ఉన్ాయి. ఈ లక్షణాలన్నీ కలిసి షైన్‌ 100 DX సౌకర్యవంతమైన, సురక్షితమైన & స్టైలిష్ బైక్‌గా చూపిస్తున్నాయి.

మార్కెట్‌లో, Hero Splendor & TVS Sport కు నేరుగా పోటీ ఇవ్వడానికి Shine 100 DX ను ఈ కంపెనీ లాంచ్‌ చేసింది.