Honda X-ADV 750 Scooter Price, Mileage And Features: దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన హోండా ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్ X-ADV 750, ఈ నెల 21న (21 మే 2025) లాంచ్‌ అయింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), టీజర్ విడుదల చేసిన 24 గంటల్లోనే ఈ బండిని మార్కెట్‌లోకి తీసుకురావడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే, Honda Rebel 500 క్రూయిజర్‌ను విడుదల చేసిన ఒక్క రోజు గ్యాప్‌లోనే కంపెనీ X-ADV 750 ని ప్రవేశపెట్టింది. ఇటీవల, సోషల్ మీడియాలో ఈ బండిని "గేమ్ ఛేంజర్" అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ పరిచయం చేసింది. ప్రీమియం టూవీలర్‌ సెగ్మెంట్‌ కస్టమర్లను ఈ హోండా బండి టార్గెట్‌ చేస్తుంది.

హోండా X-ADV 750 లో ప్రత్యేకత ఏమిటి?అంతర్జాతీయ మార్కెట్‌లో, X-ADV 750 ని ఒక యునిక్‌ మ్యాక్సీ స్కూటర్‌గా చూస్తున్నారు. భారత్‌ కోసం టీజ్ చేసిన మోడల్, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న న్యూఏజ్‌ X-ADVని పోలి ఉంటుంది. రోజువారీ జీవితం & సుదీర్ఘ సాహస ప్రయాణాలు రెండింటికీ ఈ స్కూటర్ చక్కగా పనికొస్తుంది.

ఇంజిన్ & పనితీరుహోండా X-ADV 750 స్కూటర్‌ 745cc ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌తో నడిచే పవర్‌ఫుల్‌ & అడ్వంచర్‌-ఫ్రెండ్లీ స్కూటర్. ఈ బండి ఇంజిన్ గరిష్టంగా 58 bhp పవర్‌ను & 69 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ (DCT)తో కలిపారు, ఈ ఏర్పాటు ఈ విభాగంలో చాలా అరుదుగా కనిపిస్తుంది & గేర్లు మార్చేప్పుడు చాలా సున్నతమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్కూటర్‌కు 17-అంగుళాల ముందు చక్రం & 15-అంగుళాల వెనుక చక్రం బిగించారు, ఇవి రెండూ వైర్-స్పోక్ స్పోర్ట్‌ వీల్స్‌, ఇవి బలమైన పికప్‌ అందిస్తాయి. టూవీలర్‌ ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు & లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి. వీటివల్ల, కుదుపుల్లేకుండా మట్టి రోడ్ల మీద కూడా దుమ్ము లేపుకుంటూ దూసుకెళ్లవవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ హఠాత్తుగా ఆగిపోవచ్చు. ఇంకా.. రైడర్‌ చేతులకు రక్షణనిచ్చే నకుల్‌ గార్డ్స్, 

ఫీచర్లుహోండా X-ADV 750 ను కేవలం స్కూటర్‌గానే కాకుండా ప్రీమియం అడ్వెంచర్ టూవీలర్‌గా చూడాలి, అందుకు అన్ని అర్హతలు దీనికి ఉన్నాయి. బండిలో పూర్తి LED లైటింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు, ఫలితంగా రాత్రి ప్రయాణాల్లోనూ దారి స్పష్టంగా కనిపిస్తుంది. రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్ అందించారు, ఇది విండ్‌ ప్రొటెక్షన్‌ & సౌకర్యాన్ని పెంచుతుంది. రైడర్‌ సపోర్ట్‌ కోసం 5 అంగుళాల ఆకర్షణీయమైన డిజిటల్ TFT డిస్‌ప్లే బిగించారు, ఇది రైడింగ్‌ సమయంలో ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ స్క్రీన్‌ను బ్లూటూత్‌తో అనుసంధానించవచ్చు. ఇంకా.. స్మార్ట్‌ కీ యాక్సెస్, హోండా స్మార్ట్‌ఫోన్‌ వాయిస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, USB ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడానికి - అర్బన్, అడ్వెంచర్ & కంఫర్ట్ వంటి మల్టీ రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, ఇది అడ్వెంచర్ కిట్, అర్బన్ సెటప్ & లగేజ్ ఆప్షన్స్‌తో కూడిన యాక్సెసరీ ప్యాక్‌తో అమ్ముడవుతోంది. 22-లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజీ ఉంటుంది, దీనిలో చాలా వస్తువులు లేదా దుస్తులు స్టోర్‌ చేసుకోవచ్చు. పెర్ల్‌ గ్లేర్‌ వైట్, గ్రాఫైట్‌ బ్లాక్‌ రంగుల్లో హోండా X-ADV 750 స్కూటర్‌ లాంచ్‌ అయింది.

ధరఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న హోండా X-ADV 750 ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్‌ ధర కాస్త ఎక్కువే, సామాన్యులకు అందుబాటులో లేదు. దీని ధర రూ. 11.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ రేటుతో ఓ ప్రీమియం కారు కొనుక్కోవచ్చు.