‌Honda India: భారత్‌లో హోండా టూవీలర్ తిరగని రోడ్లు కానీ, వీధులు కానీ లేవు. మధ్యతరగతి ప్రజల నమ్మకానికి చిరునామాగా మారిపోయిన హోండా కంపెనీ యాక్టివా7 జి నుంచి ఈవీ వరకు చాలా వాహనాలను అమ్మకానికి ఉంచింది. అసలు వాటి ఫీచర్స్ ఏంటీ, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హోండా టూవీలర్ కొనుగోలు చేద్దామనుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూద్దాం. 

Continues below advertisement

1984లో కైనెటిక్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌గా హోండా తన ప్రస్తానాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1071 నగరాల్లో 3786 డీలర్ల నెట్‌వర్క్‌తో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ ప్రయాణంలో హోండా 1999లో HMSI స్థాపించింది. తర్వాత 2001లో యాక్టివా మోడల్‌ను భారత్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది మార్కెట్‌ రూపురేఖలనే మార్చేసింది. రేటు, ఇంధన సామర్థ్యం, వెయిట్, నిర్వహణ అన్ని విభాగాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుని మంచి బ్రాండ్ ఇమేజ్‌తో ప్రత్యర్థులకు అంతనంత ఎత్తులో నిలబడింది. 2023 నాటికి హోండా ఇండియా ఆరు కోట్ల విక్రయాలు మేలురాయి చేరుకోగా అందులో 53 శాతం ఈ యాక్టివా వాహనాలే ఉన్నాయి. 

ప్రస్తుత లైనప్‌ ఎలా ఉంది? 

ప్రస్తుతం హోండా భారత్ మార్కెట్‌లో ఎనిమిది విభిన్న స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు 70వేల 159 నుంచి ప్రారంభమై గరిష్టంగా 13,51,366 రూపాయల వరకు వాహనాలను విక్రయిస్తోంది. 

Continues below advertisement

హోండా యాక్టివా సిరీస్‌

నగర ప్రయాణాలకు అనువుగా ఎక్కువ మందిని ఆకట్టుకునే వాహనాల్లో టాప్‌లో ఉంటోంది హోండా యాక్టివా. అందుకే ఎప్పటికప్పుడు ఈ సిరీస్‌ను అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం యాక్టివా110 మోడల్‌ 75,433 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది లీటర్‌కు సుమారు 59.5కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. అత్యంత పొదుపైన స్కూటర్‌గా పేరు పొందింది. ఈ సిరీస్‌లోనే పవర్‌ఫుల్‌ వెహికల్ కావాలని కోరుకునే వారి కోసం యాక్టివా 125ను డిజైన్ చేసి మార్కెట్‌లో ఉంచింది. దీని ధర 89,256 నుంచి ప్రారంభమవుతుంది. 

యాక్టివాఈ, క్యూసీ1తో ఎలక్ట్రిక్ విప్లవం 

పర్యావరణహిత వాహనాల వైపు అడుగులు వేస్తూ హోండా 2025 జనవరిలో ఆటో ఎక్స్‌పో వేదికగా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను పరిచయం చేసింది. అందులో మొదటిది యాక్టివా ఇ. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్‌లో బేసిక్‌ వెహికల్ ధర 1,17,428 రూపాయలు. టాప్‌లో ఉంటే రోడ్‌సింక్ డ్యూయో వేరియంట్ రేటు 1,52,028గా ఉంది. 

తక్కువ దూర ప్రయాణాలకు, రోజువారీ అవసరాలకు సరిపోయేలా యూసీ1 మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది 80 కిలోమీటర్ల రేంజ్‌, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర 90వేల నుంచి మొదలవుతుంది. 

హోండా డియో

మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో కూడా హోండా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారి కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి దింపుతూనే ఉంది. ఇప్పుడు  కూడా స్పోర్టీ డిజైన్‌తో రూపొందించిన హోండా డియో చౌకైన స్కూటర్‌గా యువతకు చేరువ అవుతోంది. దీని ధర 70,159 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 125 సీసీ వేరియంట్‌ మరింత మంచి పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. దీని ధర 86,733 రూపాయల నుంచి మొదలవుతుంది. 

ఎవరు ఏ స్కూటర్ కొనుగోలు చేస్తే లాభదాయకం

వినియోగదారుల అవసరాలను బట్టి హోండా వివిధ ఆప్షన్లను అందిస్తోంది. సిటీలో తిరిగే వారి కోసం, ఆఫీసులకు వెళ్లే వారి కోసం, ఇంటి అవసరాల కోసం యాక్టివా 110, యానివర్సరీ ఎడిషన్లు సరైన ఆప్షన్‌గా చెబుతున్నారు. స్పీడ్‌గా వెళ్లాలనుకునే వారికి డియో 110 లేదా డియో 125ను ఎంచుకోవచ్చు. హైవే ప్రయాణాల కోసం లేదా ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. స్కూటర్ సౌకర్యంతో పాటు ఆఫ్‌ రోడ్ వెళ్లానుకునే వారికి ప్రీమియం ఎడ్వెంచర్‌ స్కూటర్‌ ఎక్స్‌-ఏడీవీ అందుబాటులో ఉంది. 

భవిష్యత్‌లో రాబోయే స్కూటర్లు

హోండా అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా చూస్తున్న యాక్టివా 7జీ ఇ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర 79వేలు. వీటితోపాటు ప్రీమియం సెగ్మెంట్‌లో ఫోర్జా 350, పీసీ ఎక్స్‌ 160, మోటోకోంపాక్టో వంటి మోడళ్లను భారత్‌కు తీసుకొచ్చే యోచనలో ఉంది.