Honda Fest August 2025 Discounts: హోండా కార్స్ ఇండియా, ఈ ఆగస్టులో గ్రేట్ ఇండియా ఫెస్ట్ (Honda Great India Fest August 2025) పేరుతో ప్రత్యేక పండుగ కాల ఆఫర్లను లాంచ్‌ చేసింది. ఈ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ కార్‌ కంపెనీ, గ‌తంలోలాగ కాకుండా, ఈసారి ప్రత్యేకంగా Amaze, City, Elevate పై ఆఫర్ల ప్రకటించింది. డిస్కౌంట్లు, ఎక్సేంజ్‌ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, బైబ్యాక్ ఆప్షన్స్, 7-సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి పాకేజీ-ఆధారిత ప్రయోజనాలను హోండా కంపెనీ తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తోంది. ఇది పరిమిత కాల అవకాశం మాత్రమే.

రూ. 1.22 లక్షల వరకు డిస్కౌంట్లు!

ఫ్యామిలీ కార్ల విభాగంలో ఉన్న పోటీని తట్టుకునేందుకు, ఈ ఫెస్టివ్‌ సీజన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేందుకు... పండుగల ప్రారంభానికి ముందుగానే హోండా "ది గ్రేట్ హోండా ఫెస్ట్" పేరుతో అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలలో హోండా అమేజ్, ఎలివేట్, సిటీ మోడళ్లపై భారీ తగ్గింపులు, అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. హోండా కార్లు కొనాలనుకుంటున్న కస్టమర్లకు ఇది గుడ్‌ న్యూస్‌, మంచి బెనిఫిట్స్‌ అందుతాయి.

ఏ కారుపై ఎంత ఆదా?

హోండా అమేజ్ (Honda Amaze Sedan) – రూ. 77,000 వరకు ప్రయోజనాలు

హోండా అమేజ్ తాజా థర్డ్‌ జెన్‌ మోడల్ (2024 డిసెంబర్‌లో విడుదలైంది) పై రూ. 77,000 వరకు ఆఫర్లు అందిస్తోంది. దీనికి అదనంగా కార్పొరేట్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.

ధరలు: రూ. 8.10 లక్షల నుంచి రూ. 11.20 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్‌/విజయవాడ)

ఆఫర్ గడువు: ఆగస్టు 31 వరకు మాత్రమే

హోండా ఎలివేట్ (Honda Elevate SUV) – రూ. 1.22 లక్షల వరకు సేవింగ్స్

ఈ ఫెస్ట్‌లో ప్రధాన ఆకర్షణ హోండా ఎలివేట్ మోడల్

గరిష్టంగా రూ. 1.22 లక్షల వరకు తగ్గింపులు (కార్పొరేట్ ఆఫర్లు మినహాయించి)

కొత్తగా 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ యాక్సెసరీ ఆప్షన్‌గా అందుబాటులోకి వచ్చింది

ప్రత్యేకంగా "ఎలైట్ ప్యాక్" – 360 డిగ్రీల కెమెరా + 7-కలర్ రిథమిక్ అంబియంట్ లైటింగ్ సిస్టమ్ ఉచితంగా కొన్ని గ్రేడ్లలో అందిస్తోంది

ధరలు:  రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.73 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్‌/విజయవాడ)

హోండా సిటీ – రూ. 1.07 లక్షల వరకు ప్రయోజనాలు

హోండా సిటీ ‍‌(Honda City Sedan) మోడల్‌పై:

రూ. 1,07,300 వరకు ఆఫర్లు (అదనంగా కార్పొరేట్ ఆఫర్లు)

ధరలు: రూ. 12.38 లక్షల నుంచి రూ. 16.65 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్‌/విజయవాడ)

హోండా సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్‌కు ఆఫర్లు లేవు, కానీ గత నెలలో దీని ధర రూ. 20.85 లక్షల నుంచి రూ. 19.90 లక్షలకు తగ్గింది

ఎలా ఉపయోగించుకోవాలి?

ఈ ఆఫర్లను పొందడానికి మీ సమీప హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించి, ఆగస్టు 31 లోపు కారు బుకింగ్ చేయాలి. స్టాక్‌ పరిమితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేయడం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

హోండా అందించే అన్ని ఆఫర్లు ఆగస్టు 31, 2025 వరకు మాత్రమే వర్తిస్తాయి

ఈ ఆఫర్‌లు మోడల్‌ & వేరియంట్‌ ఆధారంగా మారవచ్చు

360 డిగ్రీల కెమెరా, ఎలైట్ ప్యాక్ వంటి ఫీచర్లు పరిమిత మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి

టెస్ట్-డ్రైవ్ ఓచర్‌లు కొనసాగుతున్నాయి. ఈ నెలలో హోండా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారీ తగ్గింపులు, కొత్త ఫీచర్లు, అదనపు కార్పొరేట్ ఆఫర్లతో కస్టమర్లు పండుగ సీజన్‌ ముందే లాభం పొందవచ్చు.