Honda Dio 125 X Edition Price And Specifications: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా, తన పాపులర్‌ స్కూటర్‌ రేంజ్‌లోకి కొత్తగా Honda Dio 125 X Editionను ఆవిష్కరించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మెకానికల్‌ లేదా హార్డ్‌వేర్‌ పరమైన మార్పులు ఏవీ లేకపోయినా.... పూర్తిగా కొత్త స్టైలింగ్‌, ఆకర్షణీయమైన రంగులతో యువ వినియోగదారులను లక్ష్యంగా తీసుకుంది. ప్రస్తుతం అన్ని వివరాలను కంపెనీ వెల్లడించినప్పటికీ, ధరలపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Continues below advertisement

కొత్త డిజైన్‌లో ఏంటి ప్రత్యేకత?

Honda Dio 125 X Editionలో ప్రధానంగా కనిపించే మార్పు స్టైలింగ్‌లోనే వచ్చింది. కంపెనీ... ఈ స్కూటర్‌కు గ్రే, డార్క్‌ బ్లూ రంగులతో కూడిన డ్యూయల్‌ టోన్‌ బాడీ ప్యానెల్స్‌ ఇచ్చింది. వీటితో పాటు కొత్త గ్రాఫిక్స్‌, ప్రత్యేకమైన X Edition డికాల్స్‌ స్కూటర్‌ను సాధారణ డియో 125 వేరియంట్ల నుంచి భిన్నంగా నిలబెడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ ఎడిషన్‌కు ఇచ్చిన బ్రైట్‌ ఆరెంజ్‌ కలర్‌ అల్లాయ్‌ వీల్స్‌ మొత్తం లుక్‌ను మరింత స్పోర్టీగా మార్చాయి.

Continues below advertisement

బయటి రూపంలో మార్పులు తప్ప, స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌, పవర్‌ట్రైన్‌ పరంగా ఇది Honda Dio 125 H-Smart వేరియంట్‌తో పూర్తిగా ఒకేలా ఉంటుంది.

పరిమాణాలు, బరువు వివరాలు

Honda Dio 125 X Edition పొడవు 1,830 మిల్లీమీటర్లు, వెడల్పు 707 మిల్లీమీటర్లు, ఎత్తు 1,172 మిల్లీమీటర్లుగా ఉన్నాయి. వీల్‌బేస్‌ 1,260 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 171 మిల్లీమీటర్లు. సీట్‌ పొడవు 708 మిల్లీమీటర్లు ఉండటంతో రైడర్‌, పిలియన్‌ (వెనుక సీట్‌లో కూర్చునే వ్యక్తి) ఇద్దరికీ సరిపడా స్థలం లభిస్తుంది. ఈ ఎడిషన్‌ కెర్బ్‌ వెయిట్‌ 105 కిలోలు మాత్రమే ఉండటం గమనార్హం. ఫ్యూయల్‌ ట్యాంక్‌ సామర్థ్యం 5.3 లీటర్లుగానే కొనసాగుతుంది.

ఫీచర్స్‌ ఏమున్నాయి?

ఫీచర్స్‌ విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇప్పటికే ఉన్న టాప్‌ వేరియంట్ల మాదిరిగానే TFT స్క్రీన్‌ డిస్‌ప్లే, సైడ్‌ స్టాండ్‌ కట్‌ ఆఫ్‌ మెకానిజం, ఐడిల్‌ స్టాప్‌-స్టార్ట్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఇవన్నీ నగర ప్రయాణాల్లో సౌకర్యం, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ పెంచేలా పనిచేస్తాయి.

బ్రేకింగ్‌, సస్పెన్షన్‌ సెటప్‌

ముందు భాగంలో 190 మిల్లీమీటర్ల డిస్క్‌ బ్రేక్‌, వెనుక భాగంలో 130 మిల్లీమీటర్ల డ్రమ్‌ బ్రేక్‌ కొనసాగుతున్నాయి. టైర్లుగా ముందు వైపు 90/90-12 ట్యూబ్‌లెస్‌ టైర్‌, వెనుక వైపు 90/100-10 ట్యూబ్‌లెస్‌ టైర్‌ ఉన్నాయి. సస్పెన్షన్‌ కోసం ముందు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుక మూడు దశల అడ్జస్టబుల్‌ స్ప్రింగ్‌లోడెడ్‌ హైడ్రాలిక్‌ యూనిట్‌ను ఉపయోగించారు.

ఇంజిన్‌ వివరాలు

ఈ స్కూటర్‌లో 123.92cc, సింగిల్‌ సిలిండర్‌, ఫోర్‌ స్ట్రోక్‌, SI ఇంజిన్‌నే ఉపయోగిస్తున్నారు. ఇది 6,500 rpm వద్ద 8.1 hp శక్తిని, 5,000 rpm వద్ద 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ ట్యూనింగ్‌, ట్రాన్స్‌మిషన్‌, మైలేజ్‌ విషయంలో ఎలాంటి మార్పులు లేవు.

మొత్తంగా చూస్తే, Honda Dio 125 X Edition స్టైల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే యువ రైడర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ధరలు వెల్లడైన తర్వాత గానీ దీనిపై వచ్చే అసలు స్పందన అర్ధం కాదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.