Honda Cars Diwali 2025 Discounts & Offers: దీపావళి దగ్గర పడుతున్న వేళ, హోండా కార్స్‌ ఇండియా, కస్టమర్ల కోసం ఆకట్టుకునే ఫెస్టివ్‌ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ నెల (అక్టోబర్‌ 2025) మొత్తం కొనసాగనున్న ఈ స్కీమ్‌లో డైరెక్ట్‌ క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ బోనస్‌లు, కార్పొరేట్‌ ఆఫర్లు, లాయల్టీ రివార్డ్స్‌ అన్నీ ఉన్నాయి.

Continues below advertisement

Honda Elevate SUV - ఈ సీజన్‌ స్టార్‌

హ్యుందాయ్‌ క్రెటా, గ్రాండ్‌ విటారా వంటి SUV లకు టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తున్న ఎలివేట్‌ పై హోండా భారీ తగ్గింపులు ప్రకటించింది. టాప్‌ ZX వెర్షన్‌ బయ్యర్లు ఈ ఆఫర్‌ కింద రూ. 1.32 లక్షల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. VX వెర్షన్‌ కొనేవాళ్లు రూ. 73,000 వరకు ఆదా చేయవచ్చు. V వేరియంట్‌ మీద రూ. 57,000 వరకు సేవ్‌ అవుతుంది. Honda Elevate SUV ఎంట్రీ SV వేరియంట్‌పై కూడా రూ. 25,000 డిస్కౌంట్‌ ఉంది.

Continues below advertisement

హోండా ఇటీవల లాంచ్‌ చేసిన “Alpha-Bold Plus” గ్రిల్‌ ఇప్పుడు రూ. 9,900 కే (మునుపటి ధర రూ. 16,500) లభిస్తుంది. అలాగే “Signature Black Edition” యాక్సెసరీ ప్యాక్‌ రూ. 36,500 బదులు కేవలం రూ. 29,900 కే అందుబాటులో ఉంది. అదనంగా 360 డిగ్రీల కెమెరా, అంబియంట్‌ లైటింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్లను కూడా ఉచితంగా ఇస్తున్నారు.

Honda City - స్మార్ట్‌ లుక్స్‌తో సూపర్‌ డీల్‌

ఇండియన్‌ రోడ్లపై రెండు దశాబ్దాలుగా ఉన్న హోండా సిటీ, ఇప్పుడు, ఈ దీపావళి సమయంలో భారీ ఆఫర్లతో ఆకర్షిస్తోంది. పెట్రోల్‌ SV, V, VX వెర్షన్‌ల మీద కస్టమర్లు రూ. 1.27 లక్షల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. టాప్‌ ZX వెర్షన్‌ బయ్యర్లు రూ. 1.02 లక్షలు మిగిల్చుకోవచ్చు. హైబ్రిడ్‌ మోడల్‌ ఈ ఫెస్టివ్‌ క్యాంపైన్‌లో భాగం కాకపోయినా, ఈ ఏడాది జులైలోనే ఆ వెర్షన్‌ ధరను హోండా రూ. 1 లక్ష తగ్గించింది.

Honda Amaze - చిన్న కారు, పెద్ద ఆఫర్‌

డిజైర్‌కు పోటీగా నిలిచే కంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ కూడా ఈ సీజన్‌లో ఆఫర్లతో కింగ్‌లా మారింది. పాత జనరేషన్‌ S ట్రిమ్‌పై రూ. 97,200 వరకు తగ్గింపు లభిస్తుండగా.. కొత్త జనరేషన్‌ మోడల్‌పై రూ. 67,200 వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంది. టాప్‌ ZX CVT మోడల్‌ ధరను రూ. 25,000 తగ్గించి ఇప్పుడు రూ. 9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) చేశారు.    

ఈ ఆఫర్లు నగరాన్ని బట్టి, డీలర్‌ స్టాక్‌ ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీరు హోండా కారు కొనాలనుకుంటే, మీ సమీప హోండా షోరూమ్‌ సంప్రదించి ప్రస్తుత డిస్కౌంట్లను చెక్‌ చేసుకోవడం మంచిది. దీపావళి 2025 కోసం హోండా ప్రకటించిన ఆఫర్లు, నిజంగానే “దివాలీ సెలబ్రేషన్‌ ఆన్‌ వీల్స్‌”గా మారవచ్చు!