All-new Honda CB500 Details In Telugu: భారత మిడ్‌సైజ్‌ రెట్రో మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు హోండా సిద్ధమైంది. కంపెనీ తన ఆల్‌-న్యూ Honda CB500 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ఒకప్పుడు దేశంలో 500cc సింగిల్‌ సిలిండర్‌ బైక్‌లకు ప్రత్యేకమైన ఆదరణ ఉండేది. అయితే 2020లో Royal Enfield 500cc UCE ఇంజిన్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ విభాగంలో పెద్దగా ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడమే లక్ష్యంగా Honda CB500 రంగంలోకి దిగుతోంది.

Continues below advertisement

501cc ఇంజిన్‌ఈ కొత్త బైక్‌లో 501cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను హోండా తొలిసారిగా పరిచయం చేసింది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 27 హెచ్‌పీ శక్తి & 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ పరంగా సంఖ్యలు సాధారణంగానే కనిపించినా, టార్క్‌ మాత్రం ఈ బైక్‌కు ప్రధాన బలం. ఈ టార్క్‌ గణాంకం Royal Enfield Interceptor 650కు చాలా దగ్గరగా ఉండటం విశేషం. ఇంటర్‌సెప్టర్‌లో 648సీసీ ప్యారలల్‌ ట్విన్‌ ఇంజిన్‌ ద్వారా 47.4 హెచ్‌పీ శక్తి & 52.3 ఎన్ఎం టార్క్‌ లభిస్తుండగా, తక్కువ సామర్థ్యం ఉన్న సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తోనే Honda ఈ స్థాయి టార్క్‌ను అందించడం విశేషంగా చెప్పాలి. ఈ బైక్‌కు 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

డిజైన్‌ Honda CB350 నుంచి స్ఫూర్తి పొందిన క్లాసిక్‌ లుక్‌ను CB500లో అందించారు. గుండ్రటి LED హెడ్‌లైట్‌, రిబ్బ్డ్‌ సింగిల్‌ పీస్‌ సీటు, పెద్ద టియర్‌డ్రాప్‌ ఆకారంలోని ఇంధన ట్యాంక్‌ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రెట్రో స్టైలింగ్‌ను కొనసాగిస్తూ ఆధునిక సాంకేతికతను కూడా హోండా ఇందులో జోడించింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్

ఫీచర్లుHonda Selectable Torque Control (HSTC), స్లిప్పర్‌ క్లచ్‌, అనలాగ్‌-డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, Honda RoadSync కనెక్టివిటీ వంటి ప్రీమియం సదుపాయాలు ఈ బైక్‌లో ఉన్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్‌తో కనెక్టివిటీతో పాటు మరింత సురక్షితమైన & సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవాన్ని పొందవచ్చు.

హోండా ఇంకా పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్లు, రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. రోజువారీ వినియోగంతో పాటు లాంగ్‌ రైడ్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది

Honda CB500ను మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. స్టాండర్డ్‌ అల్లాయ్‌ వీల్‌ వేరియంట్‌తో పాటు క్రాస్‌-స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ వీల్‌ వేరియంట్‌, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో కూడిన టాప్‌-ఎండ్‌ క్రాస్‌-స్పోక్‌ ట్యూబ్‌లెస్‌ వేరియంట్‌ను వినియోగదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విభిన్న అభిరుచులు ఉన్న రైడర్లను ఆకట్టుకోవాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.

అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే Honda CB500 మోడల్‌ను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గడమే కాకుండా ధర కూడా పోటీ స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారిక ధరను ప్రకటించలేదు. అయితే మిడ్‌సైజ్‌ రెట్రో మోటార్‌సైకిల్‌ విభాగంలో Royal Enfield Interceptor 650 & BSA Gold Star 650లకు నేరుగా పోటీ ఇవ్వడమే కాకుండా, వాటి కంటే ఆకర్షణీయమైన ధరతో ఈ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావచ్చని ఆటోమొబైల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లాసిక్‌ స్టైలింగ్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే యువతకు Honda CB500 మంచి ఎంపికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.