భారత మార్కెట్‌లో రోజువారీ ప్రయాణాల కోసం ఎన్నో రకాల స్కూటర్లు విక్రయాలు జరుగుతున్నాయి. కానీ చాలా మంది ఎక్కువ మైలేజీనిచ్చే, తక్కువ ధర కలిగిన స్కూటీలను కొనడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా చెప్పాలంటే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ రెండూ కూడా బాగా అమ్ముడవుతున్న స్కూటీ బ్రాండ్స్.
మీరు ఈ 2 స్కూటర్లలో ఏదైనా ఒకదాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా అయితే, మీ కోసం ఏ స్కూటర్ సరైనదో మీరే నిర్ణయించుకోండి. అయితే హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్
హోండా యాక్టివా మంచి మైలేజీనిచ్చే టూవీలర్. ఈ స్కూటర్‌లో 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఇచ్చారు. ఈ స్కూటీ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ (V-matic) ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. హోండా యాక్టివాలో అమర్చిన ఈ ఇంజిన్ 5.77 kW పవర్‌ను జనరేట్ చేస్తుంది. 8.90 Nm టార్క్‌ను సైతం ఉత్పత్తి చేస్తుంది. హోండా కంపెనీకి చెందిన ఈ స్కూటీలో 1260 mm వీల్‌బేస్, 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.
హోండా యాక్టివా 51.23 kmpl మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటీ ఇంధన ట్యాంక్ (Honda Activa Fuel Tank) సామర్థ్యం 5.3 లీటర్లు. ఒకసారి యాక్టివా ట్యాంక్ నింపితే దాదాపు 270 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. హోండా ఈ స్కూటw ఎక్స్-షోరూమ్ ధర నోయిడాలో రూ. 75,368. దేశంలోని ఆయా నగరాల్లో ఈ ధరలో వ్యత్యాసం ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
టీవీఎస్ జూపిటర్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్ ఉంది. స్కూటర్‌లో అమర్చిన ఈ ఇంజిన్ 6,500 rpm వద్ద 5.9 కిలోవాట్ పవర్‌ను, 5,000 rpm వద్ద 9.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ టూవీలర్ ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
స్కూటర్ మైలేజ్, ధర
టీవీఎస్ జూపిటర్ ARAI ధృవీకరించబడిన మైలేజ్ 53 kmpl. ఈ స్కూటీ 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఒకసారి టీవీఎస్ జూపిటర్ ట్యాంక్ నింపితే దాదాపు 270 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,400 గా ఉంది. సిటీని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది.
ఏ స్కూటర్ తీసుకుంటే బెటర్
హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ రెండింటి మైలేజీని పరిశీలిస్తే, 2 టూవీలర్స్ మైలేజ్ దాదాపు 50 kmpl ఇస్తుంది. అలాగే, రెండు స్కూటీల ధరలో పెద్దగా తేడా లేదు. స్కూటీ డిజైన్, కలర్ బట్టి రెండింటిలో మీకు నచ్చిన ఒక మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.