Honda Activa Price, Mileage And Features In Telugu: హోండా టూ వీలర్స్, మొత్తం భారతదేశంలో, రెండో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ. ఈ కంపెనీ, గత నెలలో (జులై 2025) అమ్మకాల పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది, నెలవారీ గరిష్ట స్థాయిని సాధించింది. గత నెలలో, ఈ బ్రాండ్ టూవీలర్లు తెగ అమ్ముడయ్యాయి. వాటిలో హోండా యాక్టివా ఫుల్ యాక్టివ్‌గా కనిపించింది.
హోండా అమ్మకాల జాబితాలో (Honda sales report, August 2025), హోండా యాక్టివా అగ్రస్థానంలో (Honda Activa Most Selling Scooter) ఉంది. గత నెలలో మొత్తం 2 లక్షల 37 వేల 413 మంది కస్టమర్లు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. గత ఏడాది అదే నెల, అంటే జులై 2024లో అమ్ముడైన మొత్తం 1 లక్ష 95 వేల 604 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది జులైలో 41,809 యూనిట్లను ఎక్కువగా అమ్మింది. ఇది 21 శాతం వార్షిక పెరుగుదలను చూపిస్తుంది.
రెండు & మూడు ర్యాంకుల్లో ఏ బండి ఉంది? జులై 2025లో అమ్మకాల పరంగా, Honda Shine రెండో స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 1 లక్ష 38 వేల 665 మంది ఈ బైక్‌ను కొనుగోలు చేశారు. అయితే, ఇది వార్షిక ప్రాతిపదికన (జులై 2024 తో పోలిస్తే) స్వల్ప తగ్గుదలను చూపిస్తుంది. 2025 జులై సేల్స్ జాబితాలో Honda Unicorn మూడో స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 30 వేల 572 యూనిట్ల హోండా యునికార్న్ అమ్ముడైంది.
హోండా యాక్టివా ధర తెలుగు రాష్ట్రాల్లో హోండా యాక్టివా (స్టాండర్డ్/బేస్ వేరియంట్) ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,173 నుంచి (Honda Activa ex-showroom price, Hyderabad Vijayawada) ప్రారంభమవుతుంది. దీనిని విజయవాడలో దాదాపు రూ. 1.11 లక్షల ఆన్-రోడ్ రేటుకు (Honda Activa on-road price, Vijayawada) ఇంటికి తీసుకురావచ్చు. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ రేటు దాదాపు రూ. 1.04 లక్షలు (Honda Activa on-road price, Hyderabad).
విజయవాడలో హోండా యాక్టివా H-స్మార్ట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 97,694 కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.26 లక్షలు. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 97,168 కాగా, ఈ టాప్ స్పెక్ మోడల్‌ను దాదాపు 1.20 లక్షల ఆన్-రోడ్ ధరకు కొనవచ్చు.
హోండా యాక్టివా స్కూటర్‌లో 109.51 cc ఇంజిన్ ఉంది, ఇది గరిష్టంగా 7.79 PS శక్తిని & 8.84 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో, ఈ టూవీలర్‌కు డ్రమ్ బ్రేక్‌లు అందించారు. ఇంకా.. అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ESP టెక్నాలజీ & షట్టర్ లాక్ ఉన్నాయి.
కంపెనీ లెక్క ప్రకారం, ఈ స్కూటర్ 50 కి.మీ. వరకు మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్‌కు 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మైలేజ్ లెక్క ప్రకారం, ఈ ట్యాంక్‌ను ఫుల్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు మళ్లీ పెట్రోల్ బంక్ మొహం చూడాల్సిన అవసరం రాదు. హోండా యాక్టివా బరువు దాదాపు 109 కిలోలు.
మార్కెట్లో, TVS జూపిటర్ (TVS Jupiter) & సుజుకి యాక్సెస్ (Suzuki Access) వంటి స్కూటర్‌లకు హోండా యాక్టివా ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.