Honda Activa 7G Details: భారత స్కూటీ మార్కెట్‌లో ఎప్పటిలాగే హోండా మరోసారి సెన్సేషన్‌ సృష్టించబోతోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటీ సిరీస్‌గా ఉన్న ఆక్టివా, ఇప్పుడు మరో కొత్త రూపంలో రాబోతోంది. హోండా ఆక్టివా 7G నూతన మోడల్‌ జనవరి 2026లో లాంచ్‌ కానుందని సమాచారం.

Continues below advertisement

ధర & లాంచ్‌ వివరాలుహోండా ఆక్టివా 7G ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందా అన్న ఆసక్తి హోండా అభిమానుల్లో తారస్థాయిలో ఉంది. రిపోర్టుల ప్రకారం, హోండా ఆక్టివా 7G ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹80,000 నుంచి ₹90,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది 6G కంటే కొంచెం ఎక్కువైనా, కొత్త ఫీచర్లు, డిజైన్‌ దృష్ట్యా “విలువకు తగిన స్కూటీ”గా నిలుస్తుందనడంలో సందేహం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

హోండా ఆక్టివా 7G... TVS Jupiter 125, Suzuki Avenis 125, Hero Xoom 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అంతేకాదు, Honda PCX 125 అనే ప్రీమియం స్కూటీని కూడా 2026 ఫిబ్రవరిలో లాంచ్‌ చేయాలని ఈ బ్రాండ్‌ ప్లాన్‌ చేస్తోంది.

Continues below advertisement

డిజైన్‌ & లుక్‌హోండా ఆక్టివా 7G డిజైన్‌లో హోండా చిన్న చిన్న మార్పులు చేసి మొత్తం లుక్‌ను మరింత ప్రీమియంగా మార్చింది. ఆక్టివా 6G బాడీ స్టైల్‌నే కొనసాగించినా, కొత్త మోడల్‌లో స్లీక్‌ బాడీ ప్యానెల్స్‌, క్రోమ్‌ ఫినిషింగ్‌, ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్లు చేరుస్తున్నారు. యూత్‌ కోసం స్పెషల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ మోడల్‌ను కూడా తీసుకురావచ్చు, ఇందులో కొత్త గ్రాఫిక్స్‌ & యూనిక్‌ కలర్‌ థీమ్‌లు ఉండనున్నాయి.

ఇంజిన్‌ & పనితీరుపెర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే, ఆక్టివా 7Gలో 109cc సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌నే కొనసాగిస్తారు. ఇది BS6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్‌ సుమారు 7.6 bhp పవర్‌, 8.8 Nm టార్క్‌ ఇస్తుంది. 

మైలేజ్‌స్మూత్‌నెస్‌, రిలయబిలిటీకి పేరుగాంచిన ఈ ఇంజిన్‌తో, లీటరు పెట్రోలుతో 45 నుంచి 50 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని అంచనా. 5.3 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌తో ఈ స్కూటర్‌ 250 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అంటే, నగర వినియోగానికి పర్ఫెక్ట్‌ స్కూటీ అని చెప్పవచ్చు.

ఫీచర్లు & టెక్నాలజీ

- ఫీచర్ల పరంగా 7G మరో లెవెల్‌లో ఉండవచ్చు. ఇంజిన్‌ స్టార్ట్‌-స్టాప్‌ స్విచ్‌, సైలెంట్‌ స్టార్టర్‌ సిస్టమ్‌, డ్యూయల్‌ ఫంక్షన్‌ స్విచ్‌ వంటి ఫీచర్లు రైడింగ్‌ అనుభవాన్ని చాలా బెటర్‌ చేస్తాయి.

- టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, 12-అంగుళాల ముందరి చక్రాలు, 10-అంగుళాల వెనుక చక్రాలు రైడింగ్‌ కంఫర్ట్‌ పెంచుతాయి.

- యూత్‌ మైండ్‌లోకి దూసుకువెళ్లేలా డిజిటల్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ కీ సిస్టమ్‌ వంటి హైటెక్‌ ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది.

ఆక్టివా 7Gతో, హోండా కంపెనీ, స్కూటర్‌ మార్కెట్‌లో తన డామినేషన్‌ను కొనసాగించబోతోంది. అందమైన రూపం, శక్తిమంతమైన ఇంజిన్‌, టాప్‌ క్లాస్‌ మైలేజ్‌తో ఈ స్కూటర్‌ యూత్‌ను ఖచ్చితంగా ఆకట్టుకోవచ్చు. మీరు స్టైలిష్‌, రిలయబుల్‌ & ఎకానమికల్‌ స్కూటర్‌ కోసం చూస్తున్నట్లయితే - ఆక్టివా 7G మీకోసమే వస్తోంది!.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.