మీరు ప్రతిరోజూ ఆఫీసుకు, లేక బిజినెస్ పని మీద ప్రయాణం చేసే వారైతే వాహనం కొనుగోలు చేయాలని చూస్తుంటారు. మీరు చవకైన, మన్నికైనస్టైలిష్ స్కూటర్ కోసం చూస్తున్నారా.. అయితే Honda Activa మీకు మంచి ఛాయిస్ కావచ్చు. ఈ స్కూటీ అద్భుతమైన పనితీరు, ఇంధన సామర్థ్యం వల్ల భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. మీరు ఈ స్కూటీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, పూర్తి ధర చెల్లింకున్నా సొంతం చేసుకోవచ్చు. అందుకోసం బయటి వ్యక్తులతో అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మీరు దీనిని ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటీ ఆన్-రోడ్ ధరతో పాటు బండి EMI ప్లాన్ గురించి తెలుసుకుందాం.
Honda Activa 110 ఆన్-రోడ్ ధర ఎంత?
ఢిల్లీలో Honda Activa 110 స్కూటీ కొనడానికి మీరు దాదాపు రూ. 95 వేలు ఖర్చు చేయాలి. ఇందులో ఎక్స్-షోరూమ్ ధరతో పాటు RTO ఛార్జీలు బీమా (Bike Insurance) మొత్తం కూడా ఉన్నాయి. ఈ ధర వేరియంట్, డీలర్‌షిప్ లాంటి విషయాలను బట్టి మారవచ్చు.
Honda Activa 110 స్కూటీ కొనడానికి మీరు కనీసం 5 వేల రూపాయల డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తానికి మీరు బ్యాంకు నుండి వెహికల్ లోన్ తీసుకోవాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నందుకు మీకు 9 శాతం వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు లోన్ లభిస్తే, మీరు నెలకు దాదాపు 3 వేల రూపాయల EMI చెల్లించాలి.
హోండా యాక్టివా 110 ని Activa 6G అని కూడా పిలుస్తారు. ఈ స్కూటర్ ప్రస్తుతం 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7.8 bhp ఎనర్జీని, 9.05 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్కూటీ మైలేజ్ విషయానికి వస్తే, ఈ స్కూటీ ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్లే మార్గాల్లో అయితే లీటరుకు గరిష్టంగా 55 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
స్కూటర్ మైలేజ్ ఎంత?
ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. స్కూటర్ గరిష్టంగా దాదాపు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, Activa 110 లో 4.2-అంగుళాల TFT డిజిటల్ డిస్‌ప్లే వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్ సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. Honda RoadSync యాప్ ద్వారా కాల్స్ , SMS అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.