భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు యువతకు 2 లక్షల రూపాయల కంటే తక్కువ ధరలో పలు పవర్‌ఫుల్ బైక్స్ వస్తున్నాయి. మీరు స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా.. Hero Xtreme 250R, Triumph Speed T4 బైక్, Bajaj Pulsar NS400Z మీకు అద్భుతమైన ఛాయిస్ కావచ్చు. ఈ 3 బైక్‌లు శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉండటంతో పాటు ఆధునిక ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి ఉన్నాయి.
Hero Xtreme 250R
హీరో మోటోకార్ప్ కొత్త Hero Xtreme 250R కంపెనీ 250cc ప్లాట్‌ఫారమ్‌పై వచ్చింది. బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,65,938. ఇందులో 249.03cc లిక్విడ్ కూల్డ్ DOHC సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 30 PS (29.5 bhp) శక్తిని, 25 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బైక్ డిజైన్ చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS, 320mm ఫ్రంట్ డిస్క్, 230mm రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫీచర్లలో డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, 3 రంగు ఎంపికలతో వచ్చింది.
Triumph Speed T4
భారతదేశంలోని బడ్జెట్ విభాగంలో తన అత్యంత సరసమైన బైక్ ట్రయంఫ్ - Triumph Speed T4ని ప్రారంభించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,92,539. ఇది 398.15cc లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 30.58 bhp శక్తిని, 36 Nm టార్క్‌ను అందిస్తుంది.
డిజైన్ పరంగా చూస్తే ఇది క్లాసిక్ కేఫ్ రేసర్ స్టైల్ బైక్. ఇది రౌండ్ LED హెడ్‌లైట్, ఫ్లాట్ హ్యాండిల్‌బార్, సింగిల్ సీటును కలిగి ఉంది. ఇది రెట్రో లుక్‌ను ఇస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో డ్యూయల్ ఛానల్ ABS, 310mm ఫ్రంట్, 255mm రియర్ డిస్క్‌లు ఉన్నాయి. ఫీచర్లలో డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్, USB సాకెట్, 5 రంగు ఎంపికలు (ఫిల్ట్రో యెల్లో, కాస్పియన్ బ్లూ వంటివి) ఉన్నాయి.
బజాబ్ పల్సర్ (Bajaj Pulsar NS400Z)
మీరు పవర్, పనితీరు విషయంలో రాజీ పడకూడదనుకుంటే Bajaj Pulsar NS400Z మీకు సరైన బైక్. దీని ప్రారంభ ధర రూ. 1,92,794. ఇది భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 400cc బైక్‌లలో ఒకటి. ఇది 373.27cc లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్ DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 PS శక్తిని, 35 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బజాజ్ పల్సర్ బైక్ కేవలం 6 సెకన్లలో 100 km/h వేగాన్ని అందుకుంటుంది.
డిజైన్ పరంగా NS400Z మస్క్యులర్ స్ట్రీట్‌ఫైటర్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది LED హెడ్‌లైట్‌లు, ఫ్లోటింగ్ ప్యానెల్‌లు, బోల్డ్ గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఫీచర్లలో TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్, 4 రంగు ఎంపికలు ఉన్నాయి. కొత్త 2025 వెర్షన్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది. ఇది గేర్ షిఫ్టింగ్‌ను మరింత వేగంగా, సులభతరం చేస్తుంది. ఈ బైక్ KTM 390 Duke బైక్, TVS Apache RTR 310 లకు పోటీనిస్తుంది.