Hero Xoom 160 Price Features Mileage Telugu: హీరో జూమ్‌ 160 స్కూటర్‌, యువతలో జోష్‌ నింపింది. అడ్వెంచర్‌ స్టైలింగ్‌తో పాటు మాక్సీ స్కూటర్‌ డిజైన్‌లో ఇది బాగా ఆకట్టుకుంటోంది. మార్కెట్లో Yamaha Aerox 155, TVS Ntorq 150 వంటి మోడళ్లతో పోటీకి వచ్చిన ఈ స్కూటర్‌ - కొందరికి సూపర్‌ ప్యాకేజీలా అనిపిస్తే, ఇంకొందరికి కొన్ని చిన్న లోపాల వల్ల సందేహాలు కలిగిస్తోంది. Hero Xoom 160 స్కూటర్‌ని కొనడానికి మూడు ప్రధాన కారణాలు, అలాగే దాన్ని స్కిప్‌ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి.

Continues below advertisement


కొనడానికి 3 కారణాలు


1. బోల్డ్‌ లుక్‌ & రోడ్డుపై ప్రెజెన్స్‌
Hero Xoom 160 ఫస్ట్‌ లుక్‌లోనే "వావ్‌!" అనిపిస్తుంది. బైక్‌ & స్కూటర్‌ పోలికలతో బలంగా కనిపిస్తుంది. ADV స్టైల్‌లో ఉన్న ఈ మాక్సీ స్కూటర్‌ బాడీ షేప్‌, ముందు భాగం డిజైన్‌, విండ్‌స్క్రీన్‌ అన్నీ కలిపి దానికి ప్రీమియం లుక్‌ ఇస్తాయి. రియర్‌ గ్రాబ్‌ హ్యాండిల్‌ బాడీలో ఇంటిగ్రేట్‌ అయింది. అలాగే, మందపాటి స్వింగ్‌ ఆర్మ్‌ కూడా చూడటానికి మాస్‌ టచ్‌ ఇస్తుంది.


2. సౌకర్యవంతమైన ఫీచర్లు
Hero Xoom 160లో కీలెస్‌ సిస్టమ్‌ ఉండటం ఒక పెద్ద ప్లస్‌ పాయింట్‌. కీ ఫాబ్‌తో మీరు స్కూటర్‌ను స్టార్ట్‌ చేయడం, ఫ్యూయల్‌ క్యాప్‌ ఓపెన్‌ చేయడం సులభం. అంతేకాకుండా, 22 లీటర్ల పెద్ద అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ కూడా ఉంది, ఇందులో ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ సులభంగా సరిపోతుంది. చాలా ఇతర స్కూటర్లలో ఇది సాధ్యం కాదు.


3. అన్ని హైట్ల రైడర్లు సులభంగా ఉపయోగించుకునేలా
దీని 787 mm సీట్‌ హెయిట్‌ వల్ల, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కూడా ఈ స్కూటర్‌ హ్యాండిల్‌ చేయడం సులభం. సీటు ఆకారం ముందుకు దిగువకు వంగి ఉండటం వల్ల రెండు కాళ్లతో ఫ్లోర్‌ మీద బలంగా కూర్చోవచ్చు. సిటీ డ్రైవింగ్‌లో దీని హ్యాండ్లింగ్‌ చాలా ఈజీగా అనిపిస్తుంది.


కొనకుండా ఆగడానికి 2 కారణాలు


1. సస్పెన్షన్‌ ADV లా ఉండదు
Hero Xoom 160లో అడ్వెంచర్‌ లుక్‌ ఉన్నా, సస్పెన్షన్‌ మాత్రం లాంగ్‌-ట్రావెల్‌కు తగినంతగా లేదు. ముందు 97 mm, వెనుక 94 mm మాత్రమే ఉంది. అంటే రోడ్లపై ఉన్న బంప్స్‌ లేదా గుంతల మీదుగా ఈ బండిని నడిపినప్పుడు సస్పెన్షన్‌ సాఫ్ట్‌గా అనిపించదు.


2. థ్రాటిల్‌ రెస్పాన్స్‌ సహజంగా లేదు
టెస్టింగ్‌లో గమనించిన మరో లోపం - Hero Xoom 160 థ్రాటిల్‌ కాస్త ఎక్కువగా తిప్పాల్సి రావడం. బండి ఫుల్‌ పవర్‌ తీసుకోవాలంటే థ్రాటిల్‌ను సాధారణం కంటే ఎక్కువగా ట్విస్ట్‌ చేయాలి. ఈ కారణంగా 150cc స్థాయి పెర్ఫార్మెన్స్‌ ఉన్నప్పటికీ, రైడ్‌ అనుభవం అంత ఈజీగా ఉండదు.


తెలుగు రాష్ట్రాల్లో ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో Hero Xoom 160 ఎక్స్‌-షోరూమ్‌ ధర 1,38,185 రూపాయలు (Hero Xoom 160 ex-showroom price, Hyderabad Vijayawada) . రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 21,000, బీమా కోసం దాదాపు రూ. 14,000, ఇతర ఖర్చులను కూడా కలుపుకుంటే, ఈ బండి ఆన్‌-రోడ్ ధర దాదాపు రూ. 1.75 లక్షలు (Hero Xoom 160 on-road price, Hyderabad Vijayawada) అవుతుంది.


Hero Xoom 160 డిజైన్‌, ఫీచర్లు, రైడింగ్‌ ఈజ్‌ అన్నీ కలిపిన అద్భుతమైన ప్యాకేజీ. కానీ హార్డ్‌గా అనిపించే సస్పెన్షన్‌ & ఎక్కువగా తిప్పాల్సిన థ్రాటిల్‌ ఇష్యూ కొందరి ఉత్సాహానికి బ్రేకులు వేయవచ్చు. అయినా, సిటీ రైడింగ్‌ కోసం అడ్వెంచర్‌ లుక్‌ కలిగిన మాక్సీ స్కూటర్‌ కావాలనుకునేవారికి Hero Xoom 160 ఒక మంచి ఎంపికే!.