Hero Xoom 110 Price And Features: భారత మార్కెట్‌లో స్పోర్టీ డిజైన్‌తో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ స్కూటర్లలో హీరో Xoom 110 ఒకటి. Honda Dio, TVS Jupiter వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన ఈ స్కూటర్... స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు & తక్కువ బరువుతో యువతను ఆకట్టుకుంటోంది. మీరు Hero Xoom 110 కొనుగోలు చేయాలని భావిస్తే ముందుగా ఈ ఆరు విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

Continues below advertisement

1. వేరియంట్ల విషయానికి వస్తే, హీరో Xoom 110 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి VX, ZX & Combat Edition. ఎక్స్ షోరూమ్ ధరలు రూ.76,212 నుంచి ప్రారంభమై రూ.84,017 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.85,687 నుంచి రూ.92,951 మధ్య ఉంటుంది.

2. VX, ZX & Combat Edition మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. బేస్ VX వేరియంట్‌లో ముందు & వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ZX వేరియంట్‌లో ముందు డిస్క్ బ్రేక్‌తో పాటు Bluetooth కనెక్టివిటీ, కార్నరింగ్ లైట్స్, సీక్వెన్షియల్ LED ఇండికేటర్లు & అదనపు కలర్ ఆప్షన్లు లభిస్తాయి. Combat Edition మాత్రం ZX ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మ్యాట్ షాడో గ్రే పెయింట్ స్కీమ్ & ప్రత్యేక గ్రాఫిక్స్ అందించారు.

Continues below advertisement

ఇది కూడా చదవండి: గత నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు - టాటా డబుల్ ట్రీట్‌, మారుతికి ఉత్పత్తి దెబ్బ

3. ఈ స్కూటర్ ముందు & వెనుక భాగంలో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. ముందు 90/90-12 & వెనుక 100/90-12 టైర్లు అమర్చారు. ముఖ్యంగా వెనుక భాగంలో 12 అంగుళాల వీల్ ఉండటం ఈ సెగ్మెంట్‌లో అరుదైన విషయం. దీంతో గుంతలు ఉన్న రోడ్లపై కూడా మెరుగైన స్థిరత్వం లభిస్తుంది.

4. హీరో Xoom 110లో 5.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ అందించారు. స్కూటర్ మొత్తం బరువు 108 కిలోలు మాత్రమే. తక్కువ బరువు & కాంపాక్ట్ డిజైన్ కారణంగా నగర ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి అనువుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ముదురుతున్న E20 ఇంధనం వివాదం - టయోటా, మారుతి, హీరో మద్దతు.. ప్రతిపక్షాల విమర్శలు

5. బ్లూటూత్‌ కనెక్టివిటీ కోరుకునే వారికి కూడా ఈ స్కూటర్ మంచి ఎంపికే. అయితే ఈ ఫీచర్ ZX & Combat Edition వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌తో జత చేసి కాల్స్ & SMS అలర్ట్‌లను ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పైనే చూడొచ్చు.

6. పనితీరు విషయానికి వస్తే, హీరో Xoom 110లో 110.9cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ బిగించారు. ఇది 8.05hp పవర్ & 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అలాగే నగర ప్రయాణాల్లో ఇంధన పొదుపు కోసం హీరో i3S ఐడిల్ స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ & సిటీ రైడింగ్‌కు అనువైన పనితీరుతో హీరో Xoom 110 ఎంట్రీ లెవల్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.