విక్రయాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారు సంస్థ అయిన భారతదేశానికి చెందిన హీరో మోటో శుక్రవారం తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అదే హీరో విడా వీ1. హీరో క్లీనర్ ట్రాన్స్‌పోర్ట్‌కు మారడానికి ముందు కొత్త మార్కెట్లను చేరుకోవాలని చూస్తోంది.


భారతదేశంలోని కొన్ని ఇతర లెగసీ ఆటోమేకర్‌ల మాదిరిగానే, హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించడంలో వెనుకబడి ఉంది. టైగర్ గ్లోబల్ సపోర్ట్ ఉన్న ఏథర్ ఎనర్జీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతుతో ఓలా ఎలక్ట్రిక్ వంటి స్టార్టప్‌లకు మొదటి-మూవర్ ప్రయోజనాన్ని అందిస్తోంది.


జైపూర్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఛైర్మన్ పవన్ ముంజాల్ విలేకరులతో మాట్లాడుతూ, "ఈ ఉత్పత్తిని ముందుగానే ప్రారంభించాలనేది మా కోరిక అయినప్పటికీ, మంచి అవుట్‌పుట్ కోసం మేం దీన్ని పర్‌ఫెక్ట్‌గా రూపొందించాం." అని చెప్పారు.


భారతదేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు 2030 నాటికి మొత్తం టూ-వీలర్ అమ్మకాలలో 80 శాతంగా ఉంటాయని అంచనా. ఇప్పుడు ఇది దాదాపు 2 శాతంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రజలు గ్యాసోలిన్ స్కూటర్‌లకు దూరంగా ఉండటంతో అమ్మకాలు వేగవంతం అవుతున్నప్పటికీ, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మంటలు అంటుకోవడం భద్రతపై ఆందోళనలను పెంచింది. ఇది వినియోగదారుల విశ్వాసాన్ కూడాని దెబ్బతీసింది.


హీరో తొలి ఎలక్ట్రిక్ మోడల్ విడా వీ1. ధర రూ.1.45 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలోని చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువ. ఏథర్ మాదిరిగానే ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 143 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. డెలివరీలను డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నారు.


ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్‌లలో హీరో వరుసగా పెట్టుబడులు పెట్టింది. సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌లో సంయుక్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసేందుకు $60 మిలియన్లు (దాదాపు రూ. 500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు హీరో తెలిపింది. జనవరిలో ఇది ఏథర్‌లో $56 మిలియన్ల (దాదాపు రూ. 460 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. 2021లో దాని బ్యాటరీ షేరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం తైవాన్‌కు చెందిన గోగోరోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?