Hero Splendor Vs Bajaj Platina Comparison: రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తే... హీరో స్ప్లెండర్‌ & బజాజ్ ప్లాటినా తప్పక షార్ట్‌లిస్టులోకి వస్తాయి. ఈ రెండు బైక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో, కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత పాపులర్‌ అయ్యాయి. అయితే, ఈ రెండిటికీ పోటీ పెడితే, ఒక లీటర్ పెట్రోల్‌తో ఏ బైక్ మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకెళ్తుందో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. చాలా మందికి ఈ సందేహం ఉంది, ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం తెలుసుకుందాం.

Continues below advertisement


ఏ బైక్ చౌకగా వస్తుంది?


హైదరాబాద్‌ & విజయవాడలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు 80 వేల రూపాయలు. అయితే, GST తగ్గింపు తర్వాత, ఈ బైక్ ధర 10 శాతం తగ్గుతుంది.


తెలుగు నగరాల్లో బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 70,000. ఇది స్ప్లెండర్ ప్లస్ కంటే చౌకైనది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, ప్లాటినా 100 మంచి ఆఫర్‌ కావచ్చు.


ఒక లీటరుతో ఏ బండి ఎక్కువ దూరం వెళుతుంది?


హీరో స్ప్లెండర్+ R Plusలో 97.2 cc ఇంజిన్‌ ఉంది. ఇది Hero i3S టెక్నాలజీతో వచ్చింది. కంపెనీ ప్రకారం, స్ప్లెండర్ బైక్‌ లీటరుకు 70-75 కి.మీ. మైలేజీ ఇస్తుంది. రియల్ రైడ్ కండీషన్స్‌లో, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో, సగటున 60-65 కి.మీ.  మైలేజీ ఇస్తుందని యూజర్లు చెబుతున్నారు.


బజాజ్ ప్లాటినా 100లో 102 cc DTS-i ఇంజిన్‌ ఉంటుంది. ప్లాటినా గురించి బజాజ్ ప్రత్యేకంగా "మైలేజీ కింగ్‌" అని చెప్పుకుంది. కంపెనీ ప్రకారం ఈ బైక్‌ 75-80 కి.మీ. లీటరుకు ఇస్తుంది. రియల్ లైఫ్ రైడింగ్‌లో, సిటీ & హైవే మిక్స్‌లో 65-70 కి.మీ. మైలేజీ వస్తుంది. అయితే, చాలా మంది వినియోగదారులు వెల్లడించిన ప్రకారం, ప్లాటినా 100 ను సరైన వేగంతో నడిపితే, లీటరుకు 80 కిలోమీటర్ల వరకు మైలేజీని కూడా ఇవ్వగలదు. ఇప్పుడు, మీ ప్రధాన దృష్టి ఇంధన సామర్థ్యంపై ఉంటే, ప్లాటినా 100 మీకు సరిపోతుంది.


ఫీచర్లు 


హీరో స్ప్లెండర్ ప్లస్‌లో i3S ఇంజిన్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, సైడ్ స్టాండ్ అలారం, పాసింగ్ లైట్, హాలోజన్ హెడ్‌ల్యాంప్ & పిలియన్ గ్రాబ్రైల్ వంటి చాలా మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 7 వేరియంట్లలో & 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని సీట్ ఎత్తు 1052 mm & ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.8 లీటర్లు. స్ప్లెండర్ ప్లస్ క్లాసిక్ డిజైన్ & నమ్మదగిన లక్షణాలు రోజువారీ రైడింగ్‌కు దీన్ని మెరుగైన బైక్‌ అనే విశ్వాసం ఇస్తుంది.


బజాజ్ ప్లాటినా 100 రైడ్ కంట్రోల్ స్విచ్, పొడవైన & సౌకర్యవంతమైన సీటు, హాలోజన్ హెడ్‌ల్యాంప్ వంటి చాలా ఫీచర్లను ఆఫర్‌ చేస్తుంది. ఈ బైక్ 4 రంగులు & 2 వేరియంట్లలో వస్తుంది. ప్లాటినా సీటు ఎత్తు 1100 mm & దాని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ప్లాటినా సస్పెన్షన్ సెటప్ కొంచెం స్మూత్‌గా ఉంటుంది, ఇది దూర ప్రయాణాలు & తేలికపాటి ఆఫ్-రోడింగ్ కోసం మెరుగ్గా పని చేస్తుంది. 


ఫైనల్‌ పాయింట్‌
ఒక లీటర్ పెట్రోల్‌తో ఎక్కువ కిలోమీటర్లు కవర్ చేసే విషయంలో బజాజ్ ప్లాటినా స్పష్టంగా హీరో స్ప్లెండర్ కంటే  ముందుంది. అయితే.. తక్కువ ధర, విశ్వసనీయత, రీసేల్ వ్యాల్యూ, తక్కువ మెయింటెనెన్స్‌తో హీరో స్ప్లెండర్‌ ప్రత్యేక స్థానంలో ఉంది. కాబట్టి మంచి మైలేజీ కావాలనుకున్న వాళ్లకు బజాజ్ ప్లాటినా మంచి ఎంపిక. దీర్ఘకాలిక నమ్మకమైన రైడ్‌, సులభమైన సర్వీస్ నెట్‌వర్క్ కావాలనుకునేవారు హీరో స్ప్లెండర్‌ను ఎంచుకోవచ్చు.