Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ హీరో మోటోకార్ప్ ఒకేసారి రెండు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌ను ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లలో లాంచ్ చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. 100cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఈ రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేసినప్పటికీ ఫీచర్లు, ధర పరంగా వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రెండింటిలో ఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ కొనుగోలు చేయడం మంచిదో క్లియర్ కట్‌గా బ్రేక్‌డౌన్ చేద్దాం.

Continues below advertisement

రూ.10,000 వ్యత్యాసం దేనికి?

బడ్జెట్ కాన్షియస్ రైడర్స్ అందరూ మొదట చూసేది ధర. ఇక్కడే ఈ రెండు బైకుల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ యావరేజ్ ఎక్స్-షోరూమ్ ధర 72,792 రూపాయలుగా ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ యావరేజ్ ఎక్స్-షోరూమ్ ధర 82,710 రూపాయలుగా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్ మోడల్స్ లాగే, ఫ్లెక్స్ ఫ్యూయల్ సెగ్మెంట్‌లో కూడా స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ కంటే దాదాపు 9,918 రూపాయలు అదనం. మీరు ఒకవేళ స్ట్రిక్ట్ బడ్జెట్‌లో ఉండి, కేవలం ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణమే లక్ష్యంగా పెట్టుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఇక్కడ భారీగా డబ్బు ఆదా చేస్తుంది.

i3S టెక్నాలజీ 

ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న అతిపెద్ద మెకానికల్ డిఫరెన్స్ హీరో సిగ్నేచర్ i3S టెక్నాలజీ. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఈ స్మార్ట్ i3S ఫీచర్ అందుబాటులో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ న్యూట్రల్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. మళ్లీ క్లచ్ నొక్కగానే సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో అదనపు పెట్రోల్‌ పొదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్లో ఈ i3S టెక్నాలజీ తొలగించారు. ధరను వీలైనంత తక్కువగా ఉంచేందుకు హెచ్ఎఫ్ డీలక్స్‌ఫ్లెక్స్ ఫ్యూయల్లో ఈ ఫీచర్‌ను హీరో ఆఫర్ చేయడం లేదు.

Continues below advertisement

మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్ 

నేటి డిజిటల్ యుగంలో, ముఖ్యంగా రోజంతా బైక్‌లపై ప్రయాణించే డెలివరీ బాయ్స్, ఉద్యోగులకు మొబైల్ ఛార్జింగ్ అత్యంత అవసరమైన ఫీచర్. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ హ్యాండిల్‌బార్ వద్ద కంపెనీ ఇన్‌బిల్ట్‌గా USB ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తోంది. దీనివల్ల ప్రయాణంలో మొబైల్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. హెచ్ఎఫ్ డీలక్స్‌ఫ్లెక్స్ ఫ్యూయల్లో USB ఛార్జింగ్ పోర్ట్ లభించదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ లేదా అదనపు యాక్సెసరీగా అమర్చుకోవాల్సి ఉంటుంది.

డిజైన్, సీట్ హైట్, రైడింగ్ కంఫర్ట్

ఇంజిన్ పరంగా రెండింటిలోనూ ఒకే రకమైన 97.2 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉన్నప్పటికీ (రెండు బైకులూ E85 ఫ్యూయల్‌పై 8.5 PS పవర్, 8.3 Nm టార్క్ ఇస్తాయి), వాటి డైమెన్షన్స్‌లో స్వల్ప మార్పులు ఉన్నాయి. స్ప్లెండర్ ప్లస్ దాని క్లాసిక్, బాక్సీ, ప్రీమియం లుక్‌ను కొనసాగిస్తుండగా.. హెచ్ఎఫ్ డీలక్స్ కాస్త యాంగ్యులర్, యూత్‌ఫుల్ డిజైన్‌తో వస్తుంది. స్ప్లెండర్ ప్లస్ సీట్ హైట్ 785 mm మాత్రమే. అంటే హైట్ తక్కువ ఉన్న రైడర్స్‌కు కూడా ఇది చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది. మరోవైపు హెచ్ఎఫ్ డీలక్స్ సీట్ హైట్ 805mmగా ఉంది, ఇది కొంచెం పొడవుగా ఉండే వారికి మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది.

మీరు కేవలం తక్కువ ధరలో, ఎటువంటి ఆడంబరాలు లేని ప్రాక్టికల్ ఇథనాల్ బైక్ కావాలనుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్. కానీ, మీకు సిటీ ట్రాఫిక్‌లో మైలేజ్ సేవ్ చేసే i3S టెక్నాలజీ, లాంగ్ రైడ్స్‌లో మొబైల్ ఛార్జ్ చేసుకునే USB పోర్ట్, ఐకానిక్ రీసేల్ వాల్యూ ఉన్న ప్రీమియం లుక్ కావాలనుకుంటే అదనంగా ₹10,000 ఖర్చు చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు వెళ్లడం 100% వాల్యూబుల్ డిసిషన్.