Hero Passion+ Disc variant Price And Features: హీరో మోటోకార్ప్, తన ప్రీమియం 100cc కమ్యూటర్ బైక్ ప్యాషన్+కు కొత్త డిస్క్ వేరియంట్‌ను మన మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాషన్+ డ్రమ్ వేరియంట్ కంటే ఈ మోడల్ ధర మాత్రమే రూ.3,800 ఎక్కువ. 

Continues below advertisement

కొత్త ప్యాషన్+ డిస్క్ వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ 240 మిల్లీమీటర్ల ఫ్రంట్ డిస్క్ బ్రేక్. గతంలో ఉన్న 130 మిల్లీమీటర్ల డ్రమ్ బ్రేక్ స్థానంలో దీనిని అందించారు. దీంతో బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగవుతుందని, సేఫ్టీ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది మరింత భద్రతను అందించనుంది.

బ్లూటూత్ సపోర్ట్‌ఈ కొత్త వేరియంట్‌లో మరో ప్రధాన ఆకర్షణ బ్లూటూత్ సపోర్ట్‌ ఉన్న పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుంటే కాల్ అలర్ట్స్, SMS నోటిఫికేషన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్లు & లో ఫ్యూయల్ వార్నింగ్ వంటి ఉపయోగకరమైన సమాచారం కూడా డిస్‌ప్లే మీద కనిపిస్తుంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: క్లాసిక్ లుక్, అద్భుతమైన పవర్.. లాంగ్ రైడ్‌లకు ఈ 3 బైక్‌లో మీకు ఏది బెస్ట్

హీరో ప్యాషన్+లో 97.2cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 8 hp శక్తిని 8,000 rpm వద్ద & 8.05 Nm టార్క్‌ను 6,000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంధనాన్ని ఆదా చేసే హీరో ఐత్రీఎస్ (i3S) స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం ఈ బైక్ లీటరుకు 71 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సాధారణ & జాగ్రత్తగా నడిపితే ఈ మైలేజ్‌ను సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ & వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. ట్యూబులర్ స్టీల్ క్రేడిల్ ఫ్రేమ్‌పై ఈ బైక్‌ను నిర్మించారు. కొత్త డిస్క్ వేరియంట్ బరువు 116 కిలోలు కాగా, డ్రమ్ వేరియంట్ కంటే ఇది ఒక కిలో ఎక్కువ.

ఇది కూడా చదవండి: టైర్‌పై ఈ అక్షరాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ ప్రమాదమే!, దాని అర్థం తెలుసా - బీమా క్లెయిమ్ కూడా రాకపోవచ్చు!

భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. గేర్‌లో ఉన్న సమయంలో సైడ్ స్టాండ్ దించిన వెంటనే ఇంజిన్ ఆగిపోతుంది. అలాగే ఇంజిన్ పైన చిన్న స్టోరేజ్ క్యూబీతో పాటు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించడం డైలీ రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

రంగులుకొత్త హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్... రెడ్, బ్లూ, బ్లాక్ & గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు కొత్త గ్రాఫిక్స్‌తో మరింత ఆకర్షణీయమైన లుక్‌ను కంపెనీ ఇచ్చింది. ప్రస్తుతం హీరో 100cc బైక్‌లలో ప్యాషన్+ డిస్క్ & స్ప్లెండర్ ఎక్స్‌టెక్ డిస్క్ మాత్రమే ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందుబాటులో ఉన్నాయి. హోండా & బజాజ్ 100cc బైక్‌లలో ఈ ఫీచర్ లేకపోవడం హీరోకు అదనపు ప్రయోజనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.