Hero Passion Plus Price, Mileage And Features In Telugu: హీరో మోటోకార్ప్ బ్రాండ్‌ నుంచి వచ్చి, నగరాల్లో & పల్లెల్లో విజయవంతంగా నడస్తున్న కమ్యూటర్ బైక్ హీరో ప్యాషన్ ప్లస్. ఈ బైక్‌, గత నెలలో (జూన్ 2025) 26,249 యూనిట్లు అమ్ముడైంది. విశేషం ఏంటంటే.. ఈ సంఖ్య గత సంవత్సరం జూన్ 2024లో అమ్ముడైన 13,100 యూనిట్లతో పోలిస్తే రెట్టింపు. అంటే, హీరో ప్యాషన్ ప్లస్‌ డిమాండ్‌ ఏడాది కాలంలో 100% కంటే ఎక్కువే పెరిగింది.

హీరో ప్యాషన్ ప్లస్‌ బాహ్య రూపం స్పోర్టీగా & అట్రాక్టివ్‌గా ఉంటుంది. కొత్త గ్రాఫిక్స్‌, డ్యూయల్‌టోన్ కలర్ స్కీమ్‌ ఈ బైక్‌కి యూత్‌ఫుల్‌ లుక్‌ ఇస్తుంది. స్టైలిష్‌ హెడ్‌ల్యాంప్‌, క్రోమ్ ఫినిష్ మిరర్లు & బాడీ కలర్‌లో ఉన్న సైడ్ ప్యానెల్స్‌ ప్రత్యేకంగా కనిపిస్తాయి. మొత్తంగా, ఈ బండి డిజైన్‌ చాలా స్టైల్‌గా, నగరాల్లో & పల్లెల్లో యూత్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

డిమాండ్‌ ఎందుకు పెరిగింది?నిజానికి, హీరో ప్యాషన్ ప్లస్ బైక్, కామన్‌ మ్యాన్‌ కోరుకునే మైలేజీని ఇస్తుంది & దాని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. స్టైల్‌గా ఉండడం, మెరుగైన మైలేజీ ఇవ్వడం, నిర్వహణ ఖర్చులు తక్కువ కావడం వంటి కారణాల వల్ల ఈ టూవీలర్‌ డిమాండ్ వేగంగా పెరిగింది. పెట్రోల్ ధరలు ప్రజల ఆదాయానికి గండి కొడుతున్న ఈ నేటి కాలంలో, ఈ బైక్ చవకైన & మేలైన ఎంపికగా మారింది. హీరో ప్యాషన్ ప్లస్‌లో ఇచ్చిన i3S టెక్నాలజీ (ఐడల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్) బైక్‌ను ఎక్కువ ఇంధన- సామర్థ్యంతో పని చేయిస్తుంది. అందుకే, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాళ్లకు ఈ బైక్‌ తెలివైన ఎంపిక అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరవిజయవాడలో... హీరో ప్యాషన్ ప్లస్ DRUM BRAKE OBD2B వేరియంట్ ధర 81,251 (ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 99,200. హైదరాబాద్‌లో, ఇదే వేరియంట్‌ ధర 81,141 (ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1,00,200. ఆన్‌-రోడ్‌ ధరలో RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా బైక్‌లతో పోలిస్తే దీనిని తక్కువ ధర టూవీలర్‌గా పరిగణించవచ్చు.

ఇంజిన్, పనితీరు & మైలేజ్హీరో ప్యాషన్ ప్లస్ 97.2 cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ OBD2B ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 7.91 bhp పవర్‌ను & 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. ఈ బైక్‌ గరిష్టంగా 85 kmph వేగంతో నడుస్తుంది. మైలేజ్‌ విషయానికి వస్తే... కంపెనీ డేటా ప్రకారం, లీటరు పెట్రోల్‌కు 70 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌కు ఉన్న 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో, ఇది ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 770 కి.మీ దూరాన్ని కవర్ చేయగలదు. రోజువారీ ప్రయాణికులకు ఇదొక అద్భుతమైన రైడింగ్‌ నంబర్‌.

ప్యాషన్ ప్లస్ ఫీచర్లుహీరో ప్యాషన్ ప్లస్‌లో రోజువారీ ఉపయోగం కోసం చాలా ప్రాక్టికల్‌ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో... i3S టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, USB ఛార్జింగ్ పోర్ట్ & సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటివి ఉన్నాయి.

రైడర్‌ భద్రత కోసం ముందు & వెనుక చక్రాలకు 130mm డ్రమ్ బ్రేక్‌లు బిగించారు, ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)తో ఉంటాయి. ఈ బ్రేకింగ్ సిస్టమ్ బైక్‌ రైడింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంది, ప్రమాదాలను తగ్గిస్తుంది.