Hero HF Deluxe Price, Mileage And Features In Telugu: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర బైక్‌ల్లో ఒకటి. స్ల్పెండర్ సిరీస్ తర్వాత, హీరో కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన బైక్ ఇది. సేల్స్ రిపోర్ట్ ప్రకారం, గత నెలలో (జూన్ 2025) ఈ బండిని 1 లక్ష మందికి పైగా కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు. కిక్ స్టార్ట్ & సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్లలో ఈ టూవీలర్‌ను కొనవచ్చు.
హీరో HF డీలక్స్ 2025 మోడల్ ఒక మంచి కమ్యూటర్ బైక్. అంటే, డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచి ఇంధన సామర్థ్యం కారణంగా పెట్రోల్ తక్కువ తాగుతుంది, మీ డబ్బు ఆదా చేస్తుంది.
హైదరాబాద్‌లో, హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర (Hero HF Deluxe ex-showroom price, Hyderabad) రూ. 62,018 నుంచి ప్రారంభమై, రూ. 70,618 వరకు ఉంటుంది. దీని ఆన్-రోడ్ ధర (Hero HF Deluxe on-road price, Hyderabad) దాదాపు రూ. 78,000.
విజయవాడలో హీరో HF డీలక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 62,018 కాగా, ఆన్-రోడ్ ధర (Hero HF Deluxe Price, Vijayawada) దాదాపు రూ. 77,500.
హీరో HF డీలక్స్ ఫీచర్లుదీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా & ఆధునికంగా కనిపిస్తుంది. స్టైలిష్ బాడీ దీనికి మరింత మెరుగైన రూపాన్ని ఇస్తుంది. బైక్ సీటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి హాయిగా ఉంటుంది. తక్కువ బరువు కారణంగా ఈ బండిని చాలా సులభంగా నడపవచ్చు. ఇంకా, మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కారణంగా యాక్సిడెంట్ల రిస్క్ తగ్గుతుంది. దీని సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా బాగుంది, గుంతలు & స్పీడ్ బ్రేకర్ల దగ్గర కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ మీటర్, ఇగ్నిషన్ సిస్టమ్ & ట్యూబ్‌లెస్ టైర్లు వంటివి ఇచ్చారు.
హీరో HF డీలక్స్ ఇంజిన్హీరో HF డీలక్స్‌లో.. 97.2cc ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్, OHC టెక్నాలజీ ఇంజిన్ బిగించారు. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఉంది, ట్రాఫిక్‌లో ఇది గొప్ప షిఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
హీరో HF డీలక్స్ మైలేజీహీరో HF డీలక్స్ మంచి ఇంధన సామర్థ్యానికి పెట్టింది పేరు. కంపెనీ లెక్క ప్రకారం, ఈ టూవీలర్ లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇప్పటికే ఈ బండిని వాడుతున్న వినియోగదారులు చెప్పిన ప్రకారం, సగటున లీటరుకు 65-70 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. సిటీ ట్రాఫిక్‌లోనూ & హైవే రైడింగ్‌లోనూ కొందరు దాదాపు 70 కిలోమీటర్ల మైలేజీ సాధించారు. హీరో బ్రాండ్ డైలీ కమ్యూటర్ బైక్‌కు 9.6 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్‌ను నింపితే, 70 కిలోమీటర్ల మైలేజీ ప్రకారం, దాదాపు 670 కి.మీ. వరకు ఈల వేసుకుంటూ వెళ్లిపోవచ్చు.
ఇటీవల, హీరో కంపెనీ, కొన్ని కొత్త ఫీచర్లతో Hero HF Deluxe Pro ను విడుదల చేసింది. ఈ బైక్‌కు ఇంధనాన్ని ఆదా చేసే i3S టెక్నాలజీని అందించింది.