Hero HF 100 Price Hike: భారత మార్కెట్‌లో రోజువారీ వాడకానికి అత్యంత ప్రజాదరణ పొందిన 100cc బైక్‌ల ధరల్లో హీరో మోటోకార్ప్‌ స్వల్ప మార్పులు చేసింది. ఎలాంటి హడావుడి చేయకుండా Hero HF 100, Hero HF Deluxe, Hero Passion Plus మోడళ్లపై రూ.250 నుంచి రూ.750 వరకు ధర పెంపు అమల్లోకి తీసుకొచ్చింది. 

Hero HF 100 ధర పెంపు వివరాలు

హీరో మోటోకార్ప్‌ లైనప్‌లో అత్యంత చౌక ధర బైక్‌గా గుర్తింపు పొందిన HF 100 ధర ఇప్పుడు రూ.750 పెరిగింది. తాజా పెంపుతో ఈ బండి ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 59,489కి చేరింది. హైదరాబాద్‌, విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని నగరాల్లో ఇదే ధర అమల్లో ఉంది.

HF 100 ఒక్కటే వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 97.2cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7.9 bhp శక్తి, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా 4 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ అందించారు. మైలేజ్‌, తక్కువ నిర్వహణ ఖర్చులతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బైక్‌కు మంచి డిమాండ్‌ ఉంది.

Hero HF Deluxe కొత్త ధరలు

హీరో HF డీలక్స్‌ 100cc సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌లలో ఒకటి. ఈ మోడల్‌కు కూడా వేరియంట్‌ ఆధారంగా రూ.749 నుంచి రూ.753 వరకు ధర పెరిగింది. తాజా ఎక్స్‌-షోరూమ్‌ ధరలు రూ. 56,742 నుంచి రూ. 69,235 మధ్య ఉన్నాయి.

వేరియంట్‌కొత్త ధర (రూ. )ఎంత పెరిగింది? (రూ. )
All Black56,742750
Kick Cast60,542749
Self Cast65,749750
i3S Cast67,132750
Pro69,235753

HF డీలక్స్‌లోని అన్ని వేరియంట్లలోనూ HF 100లో ఉన్న అదే 97.2cc ఇంజిన్‌ను ఉపయోగించారు. మైలేజ్‌ ప్రాధాన్యత ఇచ్చే ఫ్యామిలీ యూజర్లకు ఇది నమ్మకమైన ఎంపికగా కొనసాగుతోంది.

Hero Passion Plus ధర మార్పు

ఎంట్రీ లెవెల్‌ కమ్యూటర్ సెగ్మెంట్‌లో హీరో ప్యాషన్‌ ప్లస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రోజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్‌, USB మొబైల్‌ ఛార్జింగ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ వంటి ఫీచర్లతో ఇది సెగ్మెంట్‌లో ముందుంది.

ఈ బైక్‌ ధర కేవలం రూ.250 మాత్రమే ధర పెరిగింది. తాజా ఎక్స్‌-షోరూమ్‌ ధరలు డ్రమ్‌ బ్రేక్‌ వేరియంట్‌కు రూ. 76,941, 125 మిలియన్‌ ఎడిషన్‌కు రూ. 78,324గా ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు నగరాల్లో ఈ ధరలే కూడా అమల్లో ఉన్నాయి.

మోడల్‌బ్రేక్‌ టైప్‌కొత్త ధర (రూ. )ఎంత పెరిగింది? (రూ. )
Passion PlusDrum Brake76,941250
125 Million Edition78,324250

ధర పెంపునకు కారణం ఏమిటి?

ధరల పెంపుపై హీరో మోటోకార్ప్‌ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ముడి పదార్థాల ఖర్చు, తయారీ వ్యయాలు పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ స్వల్ప ధర పెంపు హీరో 100cc బైక్‌ల డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.