India's Top Scooties Latest Updates: దేశ‌వ్యాప్తంగా స్కూటీల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. గేర్ లెస్, ఈజీ యాక్సెస్, ట్రాఫిక్ లో ఈజీగా న‌డ‌ప‌గ‌లగ‌డం లాంటి ఫీచ‌ర్ల‌తో యువ‌త‌తోపాటు అన్ని వ‌య‌సుల వార‌కు ఈ స్కూటీలకు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. జూలై నెల‌లో అత్య‌ధికంగా అమ్ముడైన టాప్-5 స్కూటీల వివ‌రాలు తీస‌iకుంటే, హోండా యాక్టివా దుమ్ము రేపింది. మిగ‌తా అన్ని బ్రాండ్ల కంటే ఘ‌న‌మైన అమ్మ‌కాలు చూపించింది. లక్షలాది స్కూటీల అమ్మకాలు జరిపి టూ వీలర్స్ రంగంలో తన వాడిని చూపించింది.  జూలై 2025లో టాప్ 5 అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల వివరాలు:

హోండా యాక్టివా (Activa 110, Activa 125)హోండా యాక్టివా 110 , 125 మోడళ్లతో కూడిన ఈ శ్రేణి,  అనుకూలమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, తక్కువ సీట్ హైటు, మంచి మైలేజ్ వంటి లక్షణాలతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ గా రికార్డుల‌కెక్కింది.. జూలై 2025లో 2,37,413 యూనిట్లు విక్ర‌యించ‌బ‌డ్డాయి. ఇది నెలవారీగా 29.54%, సంవత్సరవారీగా 21.37% వృద్ధిని చూపింది. TVS Jupiter, Suzuki Access 125, Honda Dio కలిపిన అమ్మకాల కంటే ఎక్కువగా యాక్టివా ఒక్కటే అమ్ముడవ‌డం విశేషం. 

TVS జూపిటర్  (Jupiter 110, Jupiter 125)TVSకి ప్రధాన మోస్ట్ సెల్లింగ్ వెహిక‌ల్ గా  ఉన్న జూపిటర్ శ్రేణిలో పెద్ద 33 లీటర్ల బూట్ స్పేస్, స్టైలిష్ డిజైన్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. జూలై 2025లో 1,24,876 యూనిట్లు అమ్ముడయ్యాయి. నెలవారీ వృద్ధి 15.64%, సంవత్సరవారీ వృద్ధి 67.25%గా న‌మోదైంది. 

సుజుకి ఆక్సెస్ 125125cc సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్కూటర్లలో ఒకటిగా సుజుకి Access 125  ని పేర్కొంటారు., నాణ్యమైన నిర్మాణం, చురుకైన పనితీరు, ఈజీ టూ యాక్సెస్ త‌దిత‌ర‌ ఉపయోగాల‌ వల్ల చాలా ప్రజాదరణ పొందింది. జూలై 2025లో 68,172 యూనిట్లు అమ్ముడయ్యాయి. నెలవారీ వృద్ధి 32.23%, కానీ సంవత్సరవారీ అమ్మకాలు 4.31% తగ్గాయి.

హోండా డియో (Dio 110, Dio 125)ఈ జాబితాలో హోండా మోడ‌ల్ కు మ‌రోసారి స్థానం ద‌క్క‌డం విశేషం. స్పోర్టీ లుక్‌కి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు  డియో శ్రేణి (110 మరియు 125 మోడళ్లు) మంచి గుర్తింపు పొందింది. అయితే, ప్రస్తుతం కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్స్ అవసరం ఉందని విశ్లేష‌క‌లు పేర్కొంటున్నారు. జూలై 2025లో  అమ్మకాలు 15.12% పెరిగినప్పటికీ, నెలవారీగా 16.49% తగ్గాయి. ఓవ‌రాల్ గా ఈ నెల‌లో 24,278 యూనిట్లు అమ్ము డ‌య్యాయి. 

5. TVS Ntorq 125యూత్‌పై దృష్టి పెట్టి రూపొందించిన‌ స్పోర్టీ స్కూటర్ అయిన Ntorq 125, స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుందని మంచి పేరుంది. జూలై 2025లో 26,258 యూనిట్లు అమ్ముడయ్యి, ఈ నెల‌లో హోండా డియోను వెన‌క్కినెట్టింది. అయితే ఇయ‌ర్ వైజ్ లో డియో మోడ‌ల్ వెన‌కాలే ఉంది. ఇక  నెలవారీ వృద్ధి 15.05 శాతం పెర‌గ‌గా, సంవత్సరవారీ అమ్మకాలు 2.18% స్వల్పంగా తగ్గాయి. తాజా కలర్ వేరియంట్ల విడుదలతో రాబోయే నెలల్లో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఏదేమైనా టాప్-5లో ఇండియాకు చెందిన టీవీఎస్ ఒక్క కంపెనీ మాత్ర‌మే ఉండ‌గా, హోండా, సుజుకి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాయి.