త్యంత ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్ సన్ నుంచి సరికొత్త బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 పేరుతో ఈ నూతన బైక్ ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ బైక్​ ను  హీరో మోటో కార్ప్ తో కలిసి  హార్లీ డేవిడ్​సన్ కంపెనీ రూపొందించింది. ఈ కొత్త బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


అత్యంత చౌకైన హార్లీ డేవిడ్​ సన్ బైక్ ఇదే!


హార్లీ డేవిడ్​ సన్ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చౌకైన బైక్ గా హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 గుర్తింపు పొందింది. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.2.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. మేడ్​ ఇన్​ ఇండియా బైక్ గా రూపొందిన హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 బైక్ సేల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఎక్స్​440 బైక్ కు సంబంధించిన ఫొటోలను కంపెనీ ఈ మధ్యే విడుదల చేసింది. రౌండ్​ హెడ్​ ల్యాంప్స్​, సింగిల్​ పాడ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.  టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ ఇండికేటర్స్​, సైడ్​ స్లంగ్​ ఎగ్సాస్ట్​  బైక్​కు మరింత అద్భుతమైన లుక్ అందిస్తున్నాయి.  






హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400  బైక్ ఇంజిన్ సామర్థ్యం ఎంత అంటే?


ఇక సరికొత్త హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 400 బైక్​ 440 సీసీ సింగిల్​ సిలిండర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఆయిల్, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్ తో వస్తుంది. ఈ బైక్ 30 బీహెచ్​పీ పవర్​ తో పాటు 35 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. యూఎస్​డీ ఫ్రెంట్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​తో పాటు డిస్క్​ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. అటు , డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్ లాంటి నూతన​  ఫీచర్లతో హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 అందుబాటులోకి రాబోతోంది.


సేల్ ఎప్పటి నుంచి? పోటీ ఏ బైకులతో?


ఈ బైక్ కు సంబంధించి సేల్ ఎప్పుడు మొదలువుతుంది? అనే విషయాన్ని మాత్రం హార్లీ డేవిడ్ సన్ సంస్థ వెల్లడించలేదు. అయితే, విడుదల తర్వాత ఈ బైక్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్​తో పాటు ట్రయంఫ్​ స్పీడ్​ 400, హోండా హెచ్​నెస్​ 350, బెనెల్లి ఇంపేరియల్​ 400 లాంటి మోడల్స్​కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  






Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial