మిహిర్ వర్ధన్.. గురుగ్రామ్‌కు చెందిన ఈ యువకుడికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తక్కువ ధరలో రకరకాల ఎలక్ట్రిక్ వస్తువులను తయారు చేశాడు. తాజాగా తన హ్యుందాయ్ శాంత్రో కారును.. ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు. ఇందుకోసం తనకు మూడు రోజుల సమయంతో పాటు కేవలం రూ. 2.4 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించాడు. వాస్తవానికి ఇంత తక్కువ ఖర్చుతో పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


60Km/h గరిష్ట వేగం, 80-90Km పరిధి


మిహిర్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు.. గరిష్ట వేగం 60Km/Hతో పాటు 80-90Km పరిధిని కలిగి ఉంది. అంతేకాదు.. ఈ కారును నడపడానికి కిలో మీటరకు 1 రూపాయి కంటే తక్కువే ఖర్చు అవుతుందని వెల్లడించాడు. పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చే ప్రకియను వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో కారును EVగా ఎలా మార్చాడో వివరించాడు. మొదట.. మిహిర్ L- ఆకారపు మోటారు మౌంట్‌ ను రూపొందించడానికి ఇంజిన్ పైభాగం.. అంటే సిలిండర్ హెడ్, పిస్టన్‌ లను బయటకు తీశాడు.  మొత్తం ఇంజిన్‌ ను తీసివేయకుండా ఇంజిన్‌ లోని పైభాగాన్ని మాత్రమే తీసివేసినట్లు చెప్పాడు. ఇలా చేయడం మూలంగా తనకు టైం, ఎనర్జీతో పాటు మనీ చాలా వరకు సేవ్ అయినట్లు వెల్లడించాడు. అదనపు మోటార్లు లేకుండా కారు పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్ ఇవ్వడంలో ఈ విధానం ఉపయోగపడిందని మిహిర్ వెల్లడించాడు.


EV ఎలా పనిచేస్తుందంటే?


తను తయారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ 6kW, 72V బ్రష్‌ లెస్ DC ఎలక్ట్రిక్ మోటార్ (BLDC)ని ఉపయోగిస్తున్నట్లు మిహిర్  వెల్లడించాడు. BLDC 350A కెల్లీ కంట్రోలర్‌ కు కనెక్ట్ చేయబడింది. ట్రంక్‌లో 72V 100Ah లిథియం ఫెర్రోఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అమర్చాడు. పవర్ బ్రేకింగ్‌ను రిజర్వ్ చేయడానికి ఎలక్ట్రిక్ బ్రేక్ బూస్టర్ వాక్యూమ్ పంప్  అవసరం అవుతుందని వెల్లడించాడు. తన శాంత్రోలో ఆల్టర్నేటర్ లేనందున, వెనుక వైపు ఉన్న LFP బ్యాటరీ నుంచి 72Vని 12Vకి తీసుకురావడానికి 72-12V DC-DC కన్వర్టర్‌ని ఉపయోగించినట్లు తెలిపాడు. ఇది సెంట్రల్ లాక్‌లు, పవర్ విండోలు, కారు లైట్లకు శక్తినిచ్చే లెడ్ యాసిడ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని తెలిపాడు.


మిహిర్ పై ప్రశంసలు


పెద్ద మోటారుతో పాటు బ్యాటరీ మార్పిడి మూలంగా ఈవీ తయారీ ఈజీ అయినట్లు మిహిర్ వెల్లడించాడు.  ప్రస్తుత స్పెసిఫికేషన్‌ లు  ఒక కచ్చితమైన సిటీ కారును ఉత్పత్తి చేయగలిగేలా ఉన్నాయని వెల్లడించారు. మొత్తంగా మిహిర్ తన కారును పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ గా మార్చడంపై పర్యావరణం పరిరక్షణతో పాటు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది.


Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి