GST తగ్గింపు తర్వాత భారత మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్‌ల ధరలు బాగా దిగొచ్చాయి. మీరు రోజువారీ జర్నీ చేయడానికి కొంచెం చవకైన హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నారా.. అయితే మీకు Maruti Celerio, Tata Tiago రెండు మంచి ఎంపికలు కావచ్చు. ఈ 2 కార్ల ధర, ఫీచర్లు, భద్రతా సౌకర్యాలు,  మైలేజ్ గురించి తెలుసుకుందాం. ఆ విషయాలు తెలిస్తే ఏ కారు తక్కువ ఖర్చు, మంచి మైలేజ్ ఇస్తుందో మీరే నిర్ణయించుకోవచ్చు?

Continues below advertisement

గత నెలలో జీఎస్టీని కొన్ని కార్లపై 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు తర్వాత Maruti Celerio ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 4.70 లక్షలకు చేరుకుంది. అయితే దాని టాప్ వేరియంట్ ధర రూ. 7.05 లక్షలుగా ఉంది. అదే సమయంలో Tata Tiago కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 4.57 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 8.75 లక్షలుగా ఉంది.

Tata Tiago కారు, Maruti Celerio కారు మైలేజ్

Tata Tiago CNG కంపెనీ తెలిపిన మైలేజ్ మాన్యువల్ మోడ్‌లో 26.49 km/ kg ఉంది. అదే ఆటోమేటిక్ మోడ్‌లో 28 km/ kg. డ్రైవింగ్‌లో ఇది సగటున 24– 25 km/kg ఇస్తుంది. ఇది సిటీ ట్రాఫిక్ కు తగినట్లుగా ఉంటుంది. అదే సమయంలో, Maruti Celerio CNG క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే 35.60 km/kg. ఫ్యూయల్ కెపాసిటీ పరంగా ఇది చాలా ముందుంది. రోజువారీగా ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి చాయిస్. ఇంధన ధరలు పెరుగుతున్నప్పుడు ఈ కారు వారికి బెస్ట్ అని భావిస్తుంటారు.

Continues below advertisement

ఫీచర్లు, ఇంటీరియర్ ఎలా ఉన్నాయి?

Tiago CNG ఫీచర్ ప్యాక్డ్ కారు. ఇది LED DRLతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, AMT ట్రాన్స్‌మిషన్ ఛాయిస్ అందిస్తారు. దీంతో పాటు ట్విన్ సిలిండర్ టెక్నాలజీ వల్ల బూట్ స్పేస్ ఇతర CNG కార్ల కంటే ఎక్కువ ఉంటుంది. Celerio CNG కూడా మోడ్రన్ టచ్ ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, Apple CarPlay, ఆండ్రాయిడ్ ఆటో, పుష్ బటన్ స్టార్ట్ సహా పవర్ విండోస్ ఉన్నాయి. అయితే ఇందులో AMT ఆప్షన్ లేదు, Tiago అందించేంత బూట్ స్పేస్ కూడా లేదు.

ఏ కారు ఎక్కువ సేఫ్

భద్రతా ఫీచర్లు విషయానికి వస్తే Tata Tiago CNGకి గ్లోబల్ NCAP నుండి 4 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, రియర్ కెమెరా, CNG లీక్ డిటెక్షన్ సిస్టమ్ తో పాటు మైక్రో స్విచ్ వంటి మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంది. అదే సమయంలో, Maruti Celerio CNG ఇప్పుడు 6 ఎయిర్‌ బ్యాగ్‌లతో వస్తుంది. సేఫ్టీ విషయంలో ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. అయితే, దాని క్రాష్ టెస్ట్ రికార్డ్ Tiago అంత ఎక్కువగా లేదు. అందువల్ల సురక్షితమైన డ్రైవింగ్ పరంగా, Tiago ఇప్పటికీ ఒక అడుగు ముందుంటుంది.