ఈ ఏడాది దీపావళి కానుకగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం GST తగ్గించే యోచనలో ఉంది. ఇందులో చిన్న కార్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మీరు ఏదైనా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, కేంద్రం కార్లపై GSTని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించవచ్చు అని తెలుసుకోండి. ఒకవేళ టాటా టియాగోపై పన్ను తగ్గించినట్లయితే, ఈ కారు గతంలో ధర కంటే మీకు ఎంత చౌకగా లభిస్తుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  

Tata Tiago ఎంత చౌకగా లభిస్తుంది? 

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు, కాగా ఇది టాప్ వేరియంట్ ధర రూ. 8.55 లక్షల వరకు ఉంటుంది. ఈ కారుపై 10 శాతం GST తగ్గింపు ప్రకటిస్తే కనుక, కస్టమర్‌లు బేస్ వేరియంట్‌పైనే దాదాపు రూ.50 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 

టాటా టియాగో 12 వేరియంట్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, CNG రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. టియాగో 1199 cc 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. కారులో ఉన్న ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 86 పీఎస్ ఎనర్జీని, 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 

Tata Tiago పవర్, మైలేజ్ వివరాలు 

టాటా టియాగో CNG కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. టియాగో CNGలో ఉన్న ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS ఎనర్జీని, 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిసిందే. ఈ కారు 242 లీటర్ల బూట్-స్పేస్‌తో అందుబాటులోకి వచ్చింది. టాటా టియాగో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంది. ఈ టాటా కంపెనీ కారు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

టాటా టియాగో ఎంత మైలేజ్ ఇస్తుంది? 

టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కారు 20.09 kmpl మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ టాటా కారు 19 kmpl మైలేజ్ ఇస్తుంది. దీంతో పాటు CNG మోడ్‌లో టాటా టియాగో కారు అధిక మైలేజ్ ఇస్తుంది. ఒకవేళ మీరు రెండు ట్యాంకులను ఫుల్ చేపిస్తే,  మీరు సులభంగా 900 కిలోమీటర్ల వరకు జర్నీ చేయవచ్చు. టియాగో CNG మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 km/ Kg, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 km/ kg మైలేజ్ తో దూసుకెళ్తుంది.