Maruti Suzuki Fronx New Price After GST Cut: ఈ దీపావళి నాటికి మీ ఫ్యామిలీకి గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఒక మంచి కారు కొనాలని మీరు ఆలోచిస్తుంటే, మీ ఆలోచన నిజమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే, ఈ దీపావళి నాటికి చిన్న కార్లు ధరలు తగ్గి, మరింత చౌకగా మారబోతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, చిన్న కార్లు సహా చాలా ఉత్పత్తులపై GST తగ్గించాలని యోచిస్తోంది, దీపావళి నాటికి దీనిని అమలు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం, చిన్న కార్లపై 28% GST & 1 శాతం సెస్ విధిస్తున్నారు. అంటే, మొత్తం 29 శాతం పన్ను విధించబడుతుంది.

GST తగ్గిన తర్వాత...చిన్న కార్లు సహా చాలా ఉత్పత్తులను, ప్రస్తుతం ఉన్న 28% GST స్లాబ్‌ రేటును నుంచి 18% స్లాబ్‌ రేటులోకి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇది అమలైతే, కొత్త కారు కొనేవాళ్లు నేరుగా 10% తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు. 

మారుతి ఫ్రాంక్స్ ధర ఎంత మారుతుంది? మీరు, ఈ దీపావళికి, Maruti Fronx ను కూడా చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 28% GST రేటును నుంచి 18% రేటులోకి మారే అవకాశం ఉన్న కార్ల లిస్ట్‌లో మారుతి ఫ్రాంక్స్‌ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, మారుతి ఫ్రాంక్స్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర 7,58,500 రూపాయలు (Maruti Fronx price, Hyderabad Vijayawada). 28% GST రేటు ప్రకారం, ఇప్పుడు, ఈ కారుపై రూ. 2,19,964 పన్ను & సెస్ విధిస్తున్నారు. ఈ పన్నును 10 శాతం తగ్గిస్తే, కారు ధర ఏకంగా రూ. 75,849 తగ్గుతుంది. అంటే, కొత్త మారుతి ఫ్రాంక్స్ మీద మీకు దాదాపు రూ. 76,000 మిగులుతుంది, ఈ డబ్బుతో ఒక కొత్త బైక్‌ కూడా కొనవచ్చు. 

మారుతి ఫ్రాంక్స్ పవర్‌ట్రెయిన్ మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. మొదటిది 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్, ఇది కేవలం 5.3 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గం వేగాన్ని అందుకోగలదు. రెండోది 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్ VVT ఇంజిన్, ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌లతో, ప్యాడిల్ షిఫ్టర్‌లతో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతారు. ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ డేటా ప్రకారం, మారుతి ఫ్రాంక్స్ లీటరుకు సగటున 22.89 కి.మీ. వరకు మైలేజీ ఇవ్వగలదు. 

ప్రీమియం ఫీచర్లుమారుతి ఫ్రాంక్స్ క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ & వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రియర్‌ AC వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. కలర్ MIDతో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, వేగవంతమైన USB ఛార్జింగ్ పోర్ట్, కనెక్టెడ్‌ కార్ ఫీచర్లు & లెదర్‌ స్టీరింగ్ వీల్ వంటి మోడ్రన్‌ ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. ఈ కారుకు 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ బిగించారు, ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తంగా, ఇది యూత్‌ఫుల్‌ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కారు.