భారత మార్కెట్‌లో టూవీలర్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అధిక విక్రయాలు జరుగుతున్న టూవీలర్లలో Honda SP125, Bajaj Pulsar 125 ఉన్నాయి. గత నెలలో GST తగ్గింపు తరువాత, రెండు బైక్‌ల ధరలు కాస్త తగ్గాయి. మీరు రోజువారీ ప్రయాణాల కోసం స్టైలిష్, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా, అయితే మీరు ఈ రెండింటిలో ఓ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు బైక్‌ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement

GST తగ్గింపు తరువాత Honda SP125 కొత్త ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు 85 వేల 564 రూపాయల నుంచి రూ. 94 వేల మధ్య ఉంది. అదే సమయంలో ప్రస్తుతం Bajaj Pulsar 125 ధర 79 వేల 48 రూపాయల నుంచి 86 వేల 444 రూపాయల మధ్య ఉంది. 2 బైక్‌ల పవర్‌ట్రెయిన్, మైలేజ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Honda SP 125 పవర్, మైలేజ్

హోండా కంపెనీకి చెందిన Honda SP 125 బైక్‌లో 123.94cc సింగిల్ సిలిండర్ BS 6, OBD2 కంప్లైంట్ PGM-FI ఇంజిన్ ఉంది. ఇది 8kW శక్తిని, 10.9 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ హోండా బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 65 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. మీరు ఒకసారి ట్యాంక్ నింపితే దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. Honda SP 125 లో ఫుల్లీ డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఆదా, డిస్టెన్స్-టు-ఎంటీ, గేర్ పొజిషన్, సైలెంట్ స్టార్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Continues below advertisement

Bajaj Pulsar N125 బైక్ పవర్‌ట్రెయిన్

Bajaj Pulsar N125 బైక్‌లో 124.45 cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.8 bhp శక్తిని, 11 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఇది మీరు సాఫీగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. దీని ARAI సర్టిఫైడ్ మైలేజ్ 64.75 kmpl. కాగా 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ తో వచ్చింది. ఈ బైక్ పూర్తి ట్యాంక్‌తో దాదాపు 600 కిలోమీటర్ల రేంజ్ జర్నీ చేయవచ్చు. Bajaj Pulsar 125 లో డిజిటల్ క్లస్టర్, స్ప్లిట్ సీట్ ఆప్షన్, USB ఛార్జింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, హాలోజన్ హెడ్‌లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గత నెలలో జీఎస్టీ తగ్గింపు తరువాత టూవీలర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనిది రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ సైతం అత్యధిక విక్రయాలలో తొలిసారిగా టాప్ 5 లో చోటు దక్కించుకుంది.