GST Effect On 400cc Bikes India: భారత మోటార్‌సైకిల్ ప్రపంచంలో కొన్ని ఇంజిన్లు కేవలం మెషిన్‌లు మాత్రమే కాదు, అవి ఒక తరం భావోద్వేగాలకు ప్రతీకలు. అలాంటి లెజెండరీ ఇంజిన్లలో 373cc, 399cc మోటార్లు ప్రత్యేక స్థానం సంపాదించాయి. కానీ ఇప్పుడు, కొత్త GST నిబంధనల కారణంగా, ఈ ఇంజిన్లకు ముగింపు తప్పదనే పరిస్థితి ఏర్పడింది.

Continues below advertisement

2026 మొదటి త్రైమాసికం ముగిసేలోపు, KTM, Triumph, Bajaj బ్రాండ్లలో ఉన్న అన్ని 373cc, 399cc ఇంజిన్లు 350ccకి తగ్గిపోనున్నాయి. పెర్ఫార్మెన్స్‌ బైక్‌లను ఇష్టపడే బైకర్లకు ఇది కేవలం ఓ టెక్నికల్ మార్పు కాదు, ఒక భావోద్వేగ వీడ్కోలు.

గత 13 ఏళ్లలో ఎప్పుడైనా మీరు పెర్ఫార్మెన్స్ బైక్ ప్రపంచంలోకి అడుగుపెట్టారా?, అయితే ఈ ఇంజిన్ మీ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ప్రభావం చూపి ఉంటుంది. KTM 200 డ్యూక్ వచ్చిన రోజుల నుంచే, పెద్ద 390 గురించిన చర్చలు యువతను ఉర్రూతలూగించాయి. “అసలైన పవర్ ఇదే” అని చెప్పిన బైక్ అది.

Continues below advertisement

ఒకప్పుడు 390 డ్యూక్ కొనడం అంటే కేవలం బైక్ కొనడం కాదు... 

స్పీడ్ అంటే ఏంటో తెలుసుకోవడం

ట్రాక్ డేకి వెళ్లే ధైర్యం రావడం

రైడింగ్‌ సమయంలో మోకాలితో రోడ్డును తాకే అనుభవాన్ని సంపాదించడం

ఈ బైక్ చాలా మందికి గురువు లాంటిది. పవర్‌ను ఎలా గౌరవించాలో నేర్పింది. పవర్‌ఫుల్‌ బైక్‌తో ప్రయాణం అంత సులువు కాదని అర్థం అయ్యేలా చేసింది. హీట్‌ జనరేట్‌ చేస్తుంది, కాస్త మొండిగా ఉంటుంది, కానీ అదే దాని ప్రత్యేకత.

అలాంటి లెజండరీ ఇంజిన్‌లను ఇప్పుడు తగ్గించడంపై బాధ సహజమే. కానీ వాస్తవం ఏంటంటే, బజాజ్‌కు ఇది తప్పనిసరి నిర్ణయం. పన్నుల పరంగా వచ్చే ప్రయోజనాలు ఈ బైక్‌లను మరింత పోటీగా మార్చుతాయి. 25cc నుంచి 50cc తగ్గితే, పవర్‌లో 2hp నుంచి 5hp తేడా రావచ్చు. కానీ బైక్ అనుభవాన్ని కేవలం ఈ సంఖ్యలతో మాత్రమే నిర్ణయించలేరు.

కాస్త తక్కువ టార్క్‌తో, కానీ టాప్ ఎండ్‌లో అగ్రెసివ్‌గా రేవ్ అయ్యే ఇంజిన్ వస్తే?, అదే అసలైన KTM స్వభావం. అదే విధంగా, కొత్త 350cc ఇంజిన్‌లలో KTM, Triumph మధ్య సౌండ్‌, ఫీల్‌లో వచ్చే తేడాలను తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. బజాజ్ తన Dominar, NS మోడళ్లకు ఎలాంటి ట్యూనింగ్ ఇస్తుందన్నది చూడాలి.

అయితే, ఒక విషయం మాత్రం ఖాయం... రాబోయే నెలల్లో మనం రైడ్ చేయడానికి, అనుభవించడానికి, చెప్పడానికి చాలా బైక్‌లు ఉంటాయి. కానీ,  373cc, 399ccలు అంత ఈజీగా అందుబాటులో ఉండకపోవచ్చు.

ఒక చిన్న సూచన... మీరు ఒక అగ్రెసివ్ 390 KTM లేదా నిజమైన 400cc Triumph కొనాలని అనుకుంటే, ఇప్పుడే ఆ సమయం. ఎందుకంటే, ఆ లెజెండ్స్ ఇక ఎక్కువకాలం షోరూమ్‌లలో కనిపించవు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.