Podharillu Serial Today Episode: రోడ్డుమీద ఉన్న మహా,చక్రిని చూసి రౌడీలు వెంటపడటంతో  వాళ్లిద్దరూ పోలీసుస్టేషన్‌లోకి పరుగులు తీసి కాపాడమని కోరతారు. అప్పటికే రౌడీలు ప్రతాప్‌కు ఫోన్ చేసి చెప్పడంతో...ఆది, భూషణ్‌తో కలిసి ప్రతాప్‌ అక్కడికి చేరుకుంటాడు. రావడంతోనే భూషణ్‌ చక్రిని కొట్టి మహాను లాక్కెళ్లుందుకు యత్నిస్తాడు. పెళ్లిముహూర్తానికి సమయం అవుతుందని....వెంటనే వెళ్లిపోదామని అంటాడు. దీంతో మహా అతని చేతిని విదిలించుకుని వచ్చి చక్రి వెనక దాక్కుంటుంది. ఈసారి ఆది వెళ్లి ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనికి మహా రానని చెబుతుంది. వీళ్లందరూ గొడవపడుతుంటే...ఎస్‌ఐ చూసి మందలిస్తాడు. పోలీసుస్టేషన్‌లో ఇలాంటివి కుదరదని చెబుతాడు. ఇంకా ఏమైనా గలాటా చేస్తే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. ముందు ఆ భూషణ్‌ను బయటకు వెళ్లిపొమ్మని చెబుతాడు. ప్రతాప్‌ అతనికి సర్దిచెప్పి బయటకు పంపుతాడు. ఇది మా కుటుంబ వ్యవహారమని మేం పరిష్కరించుకుంటాని ప్రతాప్‌ ఎస్‌ఐకి చెబుతాడు. దీంతో ఎస్‌ఐ కూడా ప్రతాప్‌ను మందలిస్తాడు. చూసి చూసి అలాంటి వాడికి మీ అమ్మాయిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారండీ అంటాడు. వాడు చూస్తే శాడిస్ట్‌లా బిహేవ్‌ చేస్తున్నాడని అంటాడు. వాడితో పెళ్లి ఇష్టంలేకే  మీ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని చెబుతుంది కదా అని అంటాడు. మా అమ్మాయికి నేను నచ్చజెప్పుకుంటానని ప్రతాప్‌ చెప్పినా....రూల్స్ అందుకు  ఒప్పుకోవని చెబుతాడు. మీ అమ్మాయి ఇష్టపూర్వకంగా మీతో వస్తేనే పంపుతామని లేదంటే తనకు ఎలా ఇష్టమైతే అలా చేస్తామని చెబుతాడు.

Continues below advertisement

                చక్రిని పక్కకు తీసుకెళ్లి విచారించమని ఎస్‌ఐ కానిస్టేబుల్‌ను పురమాయిస్తాడు. దీంతో మహా భయపడిపోయి అతని తప్పు ఏం లేదని...నేను అడిగితేనే హెల్ఫ్‌ చేశాడని చెబుతుంది. అతన్ని ఏం చేయమని జస్ట్ విచారిస్తామని చెప్పి ఎస్‌ఐ పంపిస్తాడు. పక్కకు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌...చక్రి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తాడు. పెద్దింటి పిల్లను ఎందుకు లేపుకుని వచ్చావని అడిగితే తాను అలా ఏం చేయలేదని....ఆ పెళ్లికొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే ఆ అమ్మాయి హెల్ఫ్‌ కోరితే చేశానని చెబుతాడు. కానీ కానిస్టేబుల్‌ చక్రి మాటలు నమ్మడు. వాళ్లకు దొరికితే  చంపేస్తారని తెలిసికూడా ఎందుకు రిస్క్ చేశావని అంటే...ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టమేనని కాకపోతే ఆ అమ్మాయి మనసులో ఏం ఉందో తెలియదని చెబుతాడు. మరోవైపు ఎస్‌ఐ కూడా మహాతో విడిగా మాట్లాడి అసలు విషయం తెలుసుకుంటాడు.

ఈలోగా మళ్లీ లోపలికి వచ్చిన భూషణ్‌....మహాను రమ్మంటే రానని చెబుతుంది. అయితే నీకు ఈచక్రిగాడు ముందే తెలుసని...మీరిద్దరూ ప్రేమించుకునే ఈ నాటకం ఆడుతున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. డ్రైవర్‌తో లేచిపోయి వచ్చిందని అనడంతో ఆది మందలిస్తాడు. ఎస్‌ఐ మళ్లీ అతన్ని బయటకు పంపిస్తాడు. లేకపోతే సెల్‌లో వేస్తానని హెచ్చరిస్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ప్రతాప్‌ మళ్లీ మహాను ఇంటికి రమ్మని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు రాకుంటే....వాడు అన్నదే నిజమవుతుందని అంటాడు. నువ్వు వీడి హెల్ఫ్‌ తీసుకుని వచ్చావని అనుకోరని....డ్రైవర్‌తో లేచిపోయావనే అనుకుంటారని అంటాడు. 

Continues below advertisement

ఎస్‌ఐ పర్మిషన్ తీసుకుని మహాను బయటకు తీసుకెళ్లి నచ్చజెబుతామని ప్రతాప్‌ అనుకుంటాడు. మిమ్మల్ని నమ్మి ఆ అమ్మాయిని పంపించడం కుదరదని...కావాలంటే ఇక్కడే మాట్లడమని చెబుతాడు.మహాను తీసుకెళ్లి ప్రతాప్ మాట్లాడతాడు.ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు ముందునుంచీ చెబుతూనే ఉన్నానని....మీరే పట్టించుకోలేదని అంటాడు. నీ మంచి కోసమే ఈ సంబంధం చూశానని చెప్పినా....మహా వినదు. ఇప్పుడు ఈ పెళ్లి జరగతకపోతే  సంఘంలో నా పరువుపోతుందని అంటాడు. మీకోసం నేను జీవితాంతం బాధపడలేనని...వాడితో పెళ్లి ఆపిస్తామని చెబితే ఇప్పుడే ఇంటికి వస్తానని చెబుతుంది. చక్రితో నాకు ఎలాంటి సంబంధం లేదని....కేవలం హెల్ఫ్‌ తీసుకుని వచ్చానని అంటుంది. ఈ పెళ్లి ఆపడం సాధ్యం కాదని ప్రతాప్‌ అంటే...అయితే మీతో రావడం కూడా కుదిరేపని కాదని మహా తెగేసి చెబుతుంది.