West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకున్న తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత వెరసి ఇంధన భద్రత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరు ప్రభావం ఇప్పటికే ప్రపంచ సప్లైపై పడింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కరోనా కాలం నాటి పరిస్థితులను ప్రస్తుత యుద్ధ పరిణామాలతో పోలుస్తూ ఆయన చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
లాక్‌డౌన్ పుకారులు- ప్రధాని మోదీ స్పష్టత !
ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా సఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మనం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ఉందని, అయితే ప్రజలు ఐకమత్యంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ పరిస్థితులు సుదీర్ఘ కాలంపాటు క్లిష్టంగా ఉండొచ్చని, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలి. కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని పుకార్లు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అటువంటి వారిని ఏ మాత్రం నమ్మొద్దు అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో లాక్‌డౌన్ వంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ, ఇంధన లభ్యత, ధరల పెరుగుదల పట్ల ఆందోళనలు వాస్తవమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విలవిలలాడుతున్న దేశాలు
భారత్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ మన పొరుగు దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల, ఇంధన కొరత కారణంగా పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. శ్రీలంకలో విద్యాలయాలు, అత్యవసరం కానీ ప్రభుత్వం ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో విద్యాసంస్థలు ఆన్‌లైన్ మోడ్‌లోకి మార్చడమే కాకుండా, షెడ్యూల్డ్ విద్యుత్ కోతలను అమలు చేస్తోంది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వం ఉద్యోగుల కోసం వారానికి నాలుగు రోజులు పన దినాలను అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ప్రజల తమ ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించింది.
ఇంధన పొదుపే శ్రీరామరక్ష
అంతర్జాతీయ పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన వాహనం ఇచ్చే మైలేజీ పెంచుకోవడం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతి లీటర్ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పద్ధతులను ఇవే
డ్రైవింగ్ శైలీలో మార్పు- చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌లో అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం లేదా సడన్ బ్రేక్‌లు వేయడం చేస్తుంటారు. దీని వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. దీనికి బదులుగా, క్రమంగా వేగాన్ని పెంచడం, ట్రాఫిక్ గమనాన్ని ముందుగా అంచనా వేసి ప్రశాంతంగా డ్రైవ్ చేయడం వల్ల మైలేజీ గణనీయంగా పెరుగుతుంది.
స్థిరమైన వేగం- వేగంలో తరచుగా మార్పులు చేయడం వల్ల ఇంజిన్ వేగాన్ని పుంజుకోవడానికి అదనపు ఇంధనం ఖర్చు అవుతుంది. సాధ్యమైనంత వరకు హైవేలపై లేదా ఖాళీ రోడ్లపై స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సిటీ ట్రాఫిక్‌లో కూడా అవసరమైన వేగంలో మార్పులు చేయాలి.
వాహన నిర్వహణ - సరిగ్గా మెయింటైన్ చేయని కారు మైలేజీని తగ్గిస్తుంది. టైర్‌లో గాలి తక్కువగా ఉంటే రోలింగ్ రెసిస్టెన్స్ పెరిగి ఇంజిన్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన ఎయిర్ ఫిల్టర్లు, లేదా నాణ్యత లేని ఇంజిన్ ఆయిల్ కూడా మైలేజీని దెబ్బ తీస్తాయి. అందుకే క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం ముఖ్యం.
అదనపు బరువును తగ్గించడం- కారు డిక్కీలో అనవసరమైన వస్తువులను ఉంచడం మంచిది కాదు. ఈ బరువును లాగడానికి ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని వాడుకుంటుంది. అలాగే ఉపయోగించని రూఫ్ క్యారియర్లు కూడా గాలి నిరోధకతను పెంచి మైలేజీని తగ్గిస్తాయి.
స్మార్ట్ ప్లానింగ్ - ఒక్కో పని కోసం ఒక్కోసారి బయటకు వెళ్లే కంటే పనులన్నింటినీ కలిపి ఒకే ప్రయాణంలో పూర్తి చేయడం వల్ల దూరం, ఇంధనం ఆదా అవుతాయి. సాధ్యమైనంత వరకు రద్దీ సమయంలో ప్రయాణాలను నివారించడం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండొచ్చు.
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామం ఇంధన ధరలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక బాధ్యతాయుతమైన వాహనదారుడిగా మన డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన జేబుపై భారాన్ని తగ్గించుకోవచ్చు.
