Glamour New Vs Old Varient Differences : దిగ్గజ టూ వీలర్ ఉత్పత్తి సంస్థ హీరో మోటో కార్ప్ తాజాగా గ్లామర్ కొత్ వెర్షన్ ను రిలీజ్ చేసింది. గ్లామర్ బైక్.. హీరో సంస్థలోనే అత్యంత పాపులర్.. ఈక్రమంలో పాత, కొత్త బైక్ ల మధ్య తేడాలను గమనిద్దాం. హీరో ఇటీవలే గ్లామర్ X 125 ను విడుదల చేసింది, దీని ధర డ్రమ్ వేరియంట్ రూ. 89,999 మరియు డిస్క్ రూ. 99,999. అంటే ఇది బేస్ గ్లామర్ డ్రమ్ ధర రూ. 87,798 మరియు గ్లామర్ Xtec డిస్క్ ధర రూ. 95,098 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంటే కాస్త ఎక్కువ ఖరీదైనది. పాత హీరో గ్లామర్ సరళమైన గ్రాఫిక్స్‌తో కూడిన ప్రాథమిక, నో నాన్సెన్స్ ఫంక్షనల్ స్టైలింగ్ తో ఉంది. అయితే Xtec బైక్ ఆధునిక డిజైన్ , 'H' నమూనాతో LED హెడ్‌లైట్‌తో కొంచెం స్పోర్టి లుక్ తో కనిపిస్తుంది. కొత్త గ్లామర్ X 125 లో మెటాలిక్ గ్లామర్ బ్యాడ్జ్ , బోల్డ్ X లోగోతో సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.. డిస్క్ వేరియంట్ లో ప్రీమియం బైక్ ల మాదిరిగా ఆల్-LED లైటింగ్ , ప్రీమియం స్విచ్‌గేర్ లాగా ఉంది. . మొత్తం మీద, గ్లామర్ X 125 పాత వెర్షన్ కంటే కొంచెం ఆధునికంగా ,స్టైలిష్ గా కనిపిస్తోంది.
ఇంజన్ లోని తేడాలివే..గ్లామర్ ,గ్లామర్ ఎక్స్‌టెక్ రెండూ 124.7cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను వాడారు. ఇది 0,7500rpm వద్ద 10.53PS మరియు 6,000rpm వద్ద 10.4Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది . 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచారు. కొత్త X 125 ఇంజిన్ లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మాదిరిగా ఉంది. కానీ 8,250 rpm వద్ద 11.55PS మరియు 6,500 rpm వద్ద 10.5Nm ఉత్పత్తి చేయడానికి డిజైన్ చేయబడింది. హీరో గ్లామర్ బైక్‌ల 3 వెర్షన్‌లు ఒకే రకమైన డైమండ్ ఫ్రేమ్, 30mm టెలిస్కోపిక్ ఫోర్క్, 5-స్టెప్ అడ్జస్టబిలిటీతో ట్విన్ షాక్‌లు, 10-లీటర్ ఇంధన ట్యాంక్, అల్లాయ్ వీల్స్ - రెండూ ట్యూబ్‌లెస్‌గా ఉంటాయి. గ్లామర్ డ్రమ్ బేసిక్ సెమీ-డిజిటల్ కన్సోల్, హాలోజన్ లైట్లు, ఎలక్ట్రిక్ స్టార్ట్ , CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్)లను కలిగి ఉంది. అయితే హీరో గ్లామర్ X 125 డ్రమ్ బ్లూటూత్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అలెర్ట్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, 5-అంగుళాల కలర్ LCD కన్సోల్‌ను పొందుపరిచారు.. దీనికి LED హెడ్‌లైట్ ఉంది, అయినప్పటికీ టెయిల్ లైట్ , ఇండికేటర్‌లు ఇప్పటికీ హాలోజన్‌లోనే ఉన్నాయి.
ధర పరంగా..పాత , కొత్త బైకుల ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం పెద్దగా లేదు. డ్రమ్ వేరియంట్ కి రూ. 2వేలు , డిస్క్ వేరియంట్ కి రూ. 5 వేల వరకు తేడా ఉంది. LCD కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు , ఎక్కువ పవర్ కారణంగా కొత్త బైక్ ధర కాస్త పెరిగింది. హీరో స్టాండర్డ్ గ్లామర్‌ను ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (రూ. 91,798), అలాగే ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌తో కూడిన Xtec వేరియంట్ (రూ. 90,498, రెండూ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరలు ఉన్నాయి. . అయితే, గ్లామర్ X 125 వేరియంట్ లాంచ్‌తో, ఆ రెండు వేరియంట్‌లు కాస్త ఔట్ డేటెడ్ గా కనిపిస్తున్నాయి.