Petrol Bunk Important Tips: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కారు లేదా బైక్ ఉంటుంది. మీరు కూడా మీ కారు లేదా బైక్‌లో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి పెట్రోల్ బంక్‌కు వెళితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెట్రోలు బంకులో తక్కువ ఆయిల్ వేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయిదు. ఆయిల్ నింపేటప్పుడు మీటర్‌లో 0ని తప్పక తనిఖీ చేయాలని అందరికీ తెలుసు. అయితే ఇది మాత్రమే కాకుండా పెట్రోల్ పంపులో మోసం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
స్క్రీన్‌పై 00.00 అని కనిపించిన తర్వాత పెట్రోల్ నింపుతాం. అప్పుడు ఎలాంటి మోసం జరగలేదని భావిస్తాం. కానీ పెట్రోల్ నింపుతున్న సమయంలో మీటర్ రీడింగ్ ఒక్కసారిగా ఒక నంబర్ నుంచి దానికి దూరంగా ఉన్న నంబర్‌కు జంప్ అయితే అక్కడ మోసం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే పెట్రోల్ కొడుతున్న సమయంలో ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.40, రూ.50కి అలా భారీగా జంప్ అయితే మీటర్‌లో తేడా ఉందని అనుకోవాలి.
మీరు మీటర్‌లో తప్పు జరుగుతుందని అనుకుంటే దానిని పెట్రోల్ పంపు వద్ద సర్టిఫైడ్ క్యాన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి సర్టిఫైడ్ క్యాన్లు అన్ని పెట్రోల్ పంపుల వద్ద అందుబాటులో ఉంటాయి.
Also Read: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
కారులో కూర్చొని పెట్రోల్ పట్టించుకోవద్దు...
తరచుగా తమ కారులో కూర్చొని పెట్రోల్ నింపుకునే వ్యక్తులు మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్. అలాంటి కార్ రైడర్లు సులభంగా మోసానికి గురవుతారు. చాలా సార్లు పెట్రోల్ బంకుల్లో ఉండే ఉద్యోగులు కస్టమర్‌కు సమాచారం ఇవ్వకుండా ప్రీమియం ఇంధనాన్ని ఇస్తారు. కాబట్టి వాహనంలో ఇంధనాన్ని నింపేటప్పుడు ధరను ఎల్లప్పుడూ తెలుసుకోండి. మీకు సాధారణ కారు ఉంటే ప్రీమియం ఇంధనాన్ని నింపడం వల్ల డబ్బు వృధా అవుతుంది.
ఎలా ఫిర్యాదు చేయాలి?
పెట్రోల్ పంపులో మీకు ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే మీరు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఆ పెట్రోల్ పంపు గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఇండియన్ పెట్రోలియం పెట్రోల్ పంపులలో మోసం గురించి ఫిర్యాదు చేయడానికి, టోల్ ఫ్రీ నంబర్ 1800-22-4344ని ఉపయోగించండి. హెచ్‌పీ పెట్రోల్ పంప్‌కు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1800-2333-555కు కాల్ చేయండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్‌కు సంబంధించిన ఫిర్యాదుల కోసం మీరు 1800-2333-555కు కాల్ చేయవచ్చు.
Also Read: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!