First-Time Car Buyer's Tips: ఇండియాలో సొంత కారు కొనడం అనేది ఒక ఎమోషనల్ మైల్‌స్టోన్. ఆఫీసు ప్రయాణాలు కావచ్చు లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లే ట్రిప్స్ కావచ్చు, కారు వల్ల లైఫ్ స్టైల్ మారిపోతుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్లు, వేరియంట్లు ఉండటంతో ఏ కారు తీసుకోవాలో తేల్చుకోవడం కష్టంగా మారింది. కేవలం కారు లుక్స్ చూసి కాకుండా, మీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ డీల్ ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి..చాలామంది ఎక్స్‌షోరూమ్ ధర చూసి కారును షార్ట్‌లిస్ట్ చేస్తారు. కానీ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ వంటివన్నీ కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. కారు కొనేటప్పుడు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ (EMI) వాటా 15 నుండి 20 శాతం మించకుండా చూసుకోవడం ఫైనాన్షియల్ గా సేఫ్. డౌన్ పేమెంట్, ఇతర యాక్సెసరీస్ ఖర్చులను కూడా ముందే లెక్కించుకోవాలి.

అవసరాలను గుర్తించండి..మీరు కారును ఎక్కడ వాడతారు అనే దానిపై స్పష్టత ఉండాలి. రోజూ సిటీ ట్రాఫిక్‌లో తిరిగే ప్లాన్ ఉంటే చిన్న హాచ్‌బ్యాక్ లేదా కాంపాక్ట్ ఎస్‌యూవీలు బాగుంటాయి. అదే హైవేలపై ఎక్కువగా వెళ్లే వారైతే పవర్‌ఫుల్ సెడాన్లు లేదా పెద్ద ఎస్‌యూవీలను ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య, లగేజీ స్పేస్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం ట్రెండ్ కోసం కాకుండా మీ కంఫర్ట్ కోసం బాడీ స్టైల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

Continues below advertisement

ఇంధనం - గేర్ బాక్స్ ఎంపిక..తిరిగే కిలోమీటర్లను బట్టి పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీని ఎంచుకోవాలి. తక్కువగా తిరిగే వారికి పెట్రోల్ కారు బెటర్. రన్నింగ్ ఖర్చులు తక్కువ ఉండాలంటే సీఎన్జీ ఆప్షన్ బాగుంటుంది. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు నడపడం చాలా సులభం. మాన్యువల్ వేరియంట్లు కొంచెం చౌకగా దొరుకుతాయి. ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) కూడా పరిశీలించవచ్చు అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

సేఫ్టీకే ప్రాధాన్యత..కారులో సన్‌రూఫ్ ఉందా లేదా అనే దానికంటే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉండాలి. అలాగే క్రాష్ టెస్ట్ రేటింగ్స్ చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు ఉండటం వల్ల కారును సేఫ్‌గా పార్క్ చేయవచ్చు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మెయింటెనెన్స్ - ఆఫర్లు..కారు కొన్న తర్వాత దాని సర్వీసింగ్ ఖర్చులు ఎలా ఉంటాయో ఆరా తీయాలి. సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్న బ్రాండ్లను ఎంచుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు, కార్పొరేట్ స్కీమ్స్ గురించి ఎంక్వైరీ చేయండి. అన్ని కంపెనీల ఆఫర్లను కంపేర్ చేసి బేరమాడితే మంచి డీల్ దొరుకుతుంది. సేల్స్ మెన్ ఇచ్చే ఆఫర్లకు లోబడి తొందరగా నిర్ణయం తీసుకోకుండా, అన్ని విధాలా ఆలోచించి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకోండి అని నిపుణులు సూచిస్తున్నారు.